వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి 'మెగా' గుడ్‌న్యూస్‌..? | lavanya tripathi and varun tej Will First Child Buzz News | Sakshi
Sakshi News home page

Lavanya Tripathi And Varun Vej: గుడ్‌న్యూస్‌ చెప్పనున్న 'మెగా' దంపతులు..?

May 2 2025 8:51 AM | Updated on May 2 2025 10:10 AM

lavanya tripathi and varun tej Will First Child Buzz News

మెగాకపుల్ వరుణ్ తేజ్(Varun Tej)-లావణ్య త్రిపాఠి శుభవార్త చెప్పబోతున్నారని తెలుస్తోంది. ఈమేరకు సోషల్‌మీడియాలో పలు కథనాలు వైరల్‌ అవుతున్నాయి. ఈ దంపతులు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నట్లు సమాచారం. మెగా ఇంటికి వారసుడు రాబోతున్నాడు అంటూ అభిమానులు కూడా పోస్టులు పెడుతున్నారు. 2023లో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట మొదటి బిడ్డను ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నట్లు నెట్టింట వైరల్‌  అవుతుంది.

పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి( Lavanya Tripathi) మళ్లీ షూటింగ్స్‌లలో పాల్గొంటూ వచ్చారు.  ఈ క్రమంలోనే ఒక వెబ్‌ సిరీస్‌ను ఆమె విడుదల చేశారు. ఆపై సతీ లీలావతితో పాటు కోలీవుడ్‌ మూవీ థనల్‌ను ఆమె పూర్తి చేశారు. అయితే, ఈ రెండు ప్రాజెక్ట్‌లను పూర్తి చేసిన తర్వాత ఆమె మళ్లీ కాస్త బ్రేక్‌ ఇచ్చారు. కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండాలని ఆమె భావించారని తెలుస్తోంది. దీనికి కారణం ఆమె ప్రెగ్నెన్సీ అని అందుకే ప్రస్తుతం కొత్త ప్రాజెక్ట్‌లను ఒప్పకోవడం లేదని టాక్‌. అయితే, ఈ విషయంపై వారి నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు.

వాస్తవానికి 2017లో వరుణ్‌, లావణ్యల మధ్య స్నేహం ఏర్పడింది. వీరిద్దరు కలిసి అప్పుడు ‘మిస్టర్‌’ అనే సినిమాలో నటించారు. ఆ సమయంలోనే వరుణ్‌, లావణ్య త్రిపాఠి క్లోజ్‌ అయ్యారు. మొదట్లో స్నేహం.. ఆ తర్వాత అది ప్రేమగా మార్చుకొని డేటింగ్‌ వరకు వెళ్లారు. కానీ ఈ విషయం బయటకు రాకుండా చాలా జాగ్రత్తగా పర్సనల్‌ లైఫ్‌ని ఎంజాయ్‌ చేశారు. సరిగ్గా పెళ్లికి కొద్దిరోజులు ముందు వారి ప్రేమ విషయాన్ని అందరికీ తెలిపారు. అలా వరుణ్‌, లావణ్యల పెళ్లి ఇట‌లీలో జరగగా.. హైదరాబాద్‌లో రిసెప్ష‌న్  ఘనంగా జరిగింది. 

Advertisement
 
Advertisement
Advertisement