ఉత్తమ చిత్రంగా హనుమాన్ నటి మూవీ | Tollywood actress Varalaxmi Sarathkumar Movie Gets Crazy Award | Sakshi
Sakshi News home page

Varalaxmi Sarathkumar: ఉత్తమ చిత్రంగా వరలక్ష్మి శరత్‌కుమార్ మూవీ

May 2 2025 5:15 PM | Updated on May 2 2025 5:36 PM

Tollywood actress Varalaxmi Sarathkumar Movie Gets Crazy Award

హనుమాన్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన 'శబరి'. తాజాగా ఈ సినిమాకు అరుదైన గౌరవం దక్కింది. దాసరి ఫిలిం అవార్డ్స్- 2025లో ఉత్తమ కథా చిత్రంగా శబరి అవార్డును కైవసం చేసుకుంది. తెలుగు సినిమా పరిశ్రమలో మరోసారి ప్రయోగాత్మక చిత్రం ఈ ఘనతను సాధించింది. ఈ సినిమాను ప్రముఖ ఎన్నారై మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మించారు.

తొలి సినిమాకే కథాబలం ఉన్న చిత్రాన్ని ఎన్నుకొని అనిల్ క్యాట్జ్ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. అద్భుతమైన భావోద్వేగాలతో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఒక తల్లి తన బిడ్డను రక్షించేందుకు చేసిన ఒంటరి పోరాటాన్ని తెరపై అద్భుతంగా ఆవిష్కరించారు. కాగా.. గతేడాది మే నెలలో థియేటర్లలో విడుదలైన శబరి మూవీకి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన దక్కించుకుంది.

 

Advertisement
 
Advertisement
Advertisement