తెలంగాణలో చేసింది కుల సర్వేనే | Kishan Reddy Comments On Caste Census: Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో చేసింది కుల సర్వేనే

May 2 2025 5:41 AM | Updated on May 2 2025 5:43 AM

Kishan Reddy Comments On Caste Census: Telangana

కులగణన కాదు.. అది కూడా తూతూమంత్రమే 

కేంద్రం చేపట్టే కులగణన శాస్త్రీయంగా ఉంటుంది  

చట్టసవరణ తర్వాత 2026లో కులగణన మొదలు 

కులగణనపై రాహుల్‌గాంధీ మాటలు సిగ్గుచేటు 

కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి 

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభు త్వం నిర్వహించింది కులగణన కాదని.. కుల సర్వే మాత్రమేనని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డి విమర్శించారు. ఆ సర్వే ను కూడా తూతూమంత్రంగానే నిర్వహించారని ఆరోపించారు. గురువారం ఢిల్లీలో ఆయ న మీడి యాతో మాట్లాడారు. ‘తెలంగాణ ప్రభు త్వం సర్వే వివరాలను ఒకసారి పబ్లిష్‌ చేసి, లోపాలుంటే మరోసారి సర్వే చేసింది. ఇష్టం వచ్చినట్లు సర్వే చేశారు తప్ప.. అందులో శాస్త్రీయత లేదు. అది బీసీ వ్యతిరేక సర్వే. ఈ విషయం రాహుల్‌గాం«దీకి అర్థం కాలేదు.

తెలంగాణ, కర్ణాటకలో చేపట్టిన కులగణన హడావుడిగా, ఏదో సాధించామని చెప్పుకునేందుకు చేశారు. ఇందులో చిత్తశుద్ధి లేదు, ఇది కులగణన కూడా కాదు. కులాలకు సంబంధించిన సర్వే మాత్రమే. తెలంగాణలో ఉన్న రాంగ్‌ రోల్‌ మోడల్‌ మాకు అవసరం లేదు. మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్లి సమగ్రంగా జనగణన చేస్తాం. శాస్త్రీయ పద్ధతిలో కులగణన జరుగుతుంది. మేము చేపట్టబోయే కులగణనలో ఎట్టి పరిస్థితుల్లోనూ ముస్లింలను బీసీల్లో చేర్చం. మత ప్రాతిపదికన ఎవరినీ బీసీల్లో చేర్చే ప్రసక్తే లేదు’అని స్పష్టం చేశారు. ఈ కులగణన చరిత్రపుటల్లో నిలిచిపోతుందన్నారు. 

రాహుల్‌గాంధీ మాటలు సిగ్గుచేటు 
తన ఒత్తిడి వల్లే కేంద్ర ప్రభుత్వం కులగణన నిర్ణయం తీసుకుందని కాంగ్రెస్‌ రాహుల్‌గాంధీ చెప్పడం సిగ్గుచేటని కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రాహుల్‌గాం«దీ, రేవంత్‌రెడ్డిలకు భయపడి తీసుకున్న నిర్ణయం కాదని స్పష్టం చేశారు. ‘ఎద్దులబండి కింద నడుస్తున్న కుక్క.. మొత్తం బండిని తానే మోస్తున్నానని అనుకుంటుంది. అలాగే కాంగ్రెస్‌ పార్టీ కూడా. తాము చెప్పినట్లే ప్రభుత్వాన్ని నడిపిస్తామని చెప్పుకుంటోంది. ఇది హాస్యాస్పదం’అని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తీర్పుకు కట్టుబడే కులగణన ఉంటుందని తెలిపారు.

దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ప్రజలను మతం పేరుతో విడగొడుతున్న కాంగ్రెస్‌ పార్టీ.. కులాల పేరుతోనూ సమాజాన్ని విచి్ఛన్నం చేసే కుట్ర చేస్తోందని ఆరోపించారు. ‘కులగణన చేపట్టేందుకు సెన్సెస్‌ యాక్ట్‌ 1948లో సవరణ తీసుకొచ్చి ‘కులం’అనే పదాన్ని ఓ పారామీటర్‌గా చేర్చాలి. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఈ సవరణ తీసుకొచి్చన తర్వాతే జనగణనపై ముందుకెళ్తాం. 2026లో జనగణన మొదలయ్యే అవకాశం ఉంది’అని కిషన్‌రెడ్డి తెలిపారు. కాంగ్రెస్‌ పారీ్టకి ఉన్నవే మూడు రాష్ట్రాలని, అవి కూడా తుమ్మితే ఊడిపోయే ముక్కులాంటివని ఎద్దేవా చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement