హీరోయిన్‌ రెచ్చగొట్టింది.. అందుకే సిక్స్‌ ప్యాక్‌ చేశా: అల్లు అర్జున్‌ | Allu Arjun Recalls 6 Pack Abs Because an Actress Think South Actors Not Do It | Sakshi
Sakshi News home page

Allu Arjun: సిక్స్‌ ప్యాక్‌ చేయడం మీ వల్ల కాదని హీరోయిన్‌ రెచ్చగొట్టింది.. అందువల్లే..

May 2 2025 3:49 PM | Updated on May 2 2025 4:25 PM

Allu Arjun Recalls 6 Pack Abs Because an Actress Think South Actors Not Do It

అప్పట్లో ఆరుఫలకల దేహానికి ఉన్న క్రేజే వేరు. బాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌ వరకు.. చాలామంది హీరోలు సిక్స్‌ ప్యాక్‌లు ట్రై చేసినవారే.. తెలుగుకు ఆ ట్రెండ్‌ను తీసుకొచ్చింది మాత్రం హీరో అల్లు అర్జున్‌ (Allu Arjun) అనే చెప్పాలి. దేశముదురు సినిమాలో బన్నీ సిక్స్‌ ప్యాక్‌తో కనిపించాడు. తర్వాత చాలామంది తెలుగు హీరోలు ఈ ట్రెండ్‌ను ఫాలో అయ్యారు.

20 ఏళ్ల కిందట..
గురువారం నాడు వేవ్స్‌ సదస్సు (Waves Summit 2025)కు హాజరైన అల్లు అర్జున్‌ ఈ ట్రెండ్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బన్నీ మాట్లాడుతూ.. 20 ఏళ్ల క్రితం దక్షిణాదిన ఏ నటుడూ చేయని పని నేను చేసి చూపించాను. మన వల్ల కాదు అన్న పనిని చేసి చూపిస్తే ఆ కిక్కే వేరు. నిజానికి నేను ఆరు ఫలకల దేహం కోసం ప్రయత్నించడానికి ఓ హీరోయిన్‌ ముఖ్య కారణం. తను నాతో ఓ సినిమా కూడా చేసింది. సౌత్‌లో ఎవరూ సిక్స్‌ ప్యాక్స్‌ చేయలేరు అని కామెంట్స్‌ చేసింది. 

సిక్స్‌ ప్యాక్‌ చేసి చూపించా..
అది నాకు నచ్చలేదు. ఎందుకు చేయలేరు? అని ప్రశ్నించుకున్నాను. ఛాలెంజ్‌గా తీసుకున్నాను. సిక్స్‌ ప్యాక్స్‌ చేసి చూపించాను అని చెప్పుకొచ్చాడు. అయితే ఆ హీరోయిన్‌ ఎవరన్నది మాత్రం చెప్పలేదు. అల్లు అర్జున్‌.. గంగోత్రి సినిమాతో వెండితెరకు హీరోగా పరిచయమయ్యాడు. దేశముదురు చిత్రంలో తొలిసారి సిక్స్‌ ప్యాక్‌ బాడీతో కనిపించాడు. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హన్సిక కథానాయికగా నటించింది. చక్రి సంగీతం అందించిన ఈ చిత్రం 2007 జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

చదవండి: విజయ్‌ దేవరకొండపై కేసు! ఎందుకంటే?

Advertisement
 
Advertisement
Advertisement