
సాక్షి, హైదరాబాద్: హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) చిక్కుల్లో పడ్డాడు. గిరిజన ప్రజల గురించి తప్పుగా మాట్లాడారంటూ ట్రైబల్ లాయర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కిషన్ రాజ్ చౌహాన్.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే విజయ్‌పై కేసు నమోదైనట్లు తెలుస్తోంది.
ఏం జరిగిందంటే?
సూర్య హీరోగా నటించిన రెట్రో సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా వెళ్లాడు. అతడు మాట్లాడుతూ.. ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. కశ్మీర్ ఇండియాది. కశ్మీరీలు మనవాళ్లే.. రెండేళ్ల క్రితం ఖుషీ సినిమా షూటింగ్ అక్కడే జరిపాం. అక్కడ చాలామంచి జ్ఞాపకాలున్నాయి. పాకిస్తాన్ వాళ్లు.. అక్కడి ప్రజలనే చూసుకోలేరు.. అలాంటిది ఇక్కడేం చేయాలని చూస్తున్నారో!
ఇండియా.. పాకిస్తాన్‌పై దాడి చేయాల్సిన అవసరం లేదు. అక్కడి ప్రజలకే విరక్తి వచ్చి పాక్ ప్రభుత్వంపై తిరగబడతారు. 500 ఏళ్ల క్రితం ట్రైబల్స్ (గిరిజనులు) కొట్టుకున్నట్లు.. బుద్ధి లేకుండా, కనీస కామన్ సెన్స్ లేకుండా ఇలాంటి పనులు చేస్తున్నారు. మనమంతా ఐకమత్యంగా ఉండాలి అని స్పీచ్ ఇచ్చాడు. ఉగ్రవాదులను గిరిజనులతో పోల్చడంపై వ్యతిరేకత వచ్చింది.
What a speech anna @TheDeverakonda ❤️🙌🏻#RetrofromMay01 #VijayDevarakonda #KINGDOM pic.twitter.com/653qCLhlu8
— The Revanth (@Revanth__7) April 26, 2025
చదవండి: 21 రోజుల్లో 15 కిలోలు తగ్గా.. ఆ సీక్రెట్ మాత్రం చెప్పను: రకుల్ భర్త