నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం | Few People Died In Road Accident Nandyal District | Sakshi
Sakshi News home page

నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

May 2 2025 7:07 PM | Updated on May 2 2025 9:49 PM

Few People Died In Road Accident Nandyal District

నంద్యాల: జిల్లాలోని ఆత్మకూరు మండలంలోని  సిద్ధాపురం చెరువు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కర్నూలు, గుంటూరు ప్రధాన జాతీయ రహదారిపై బోలెరో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో  నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో 16 మందికి గాయాలు కాగా, అందులో పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. 

గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  శ్రీశైల క్షేత్రంలో దైవదర్శనానికి వెళ్లి బొలెరో వాహనంలో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో గాయపడిన వారు, మృతులు కర్నూలు జిల్లా ఆదోని పట్టణం ఇందిరానగర్, రాజీవ్ నగర్ లకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలించారు.

 

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement