ఒక్క పాట మినహా షూటింగ్‌ పూర్తి: ఆర్.యు. రెడ్డి | Sonudhi Film Factory First Film Update | Sakshi
Sakshi News home page

ఒక్క పాట మినహా షూటింగ్‌ పూర్తి: ఆర్.యు. రెడ్డి

May 2 2025 3:28 PM | Updated on May 2 2025 3:28 PM

Sonudhi Film Factory First Film Update

సోనుధి ఫిలిమ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై ఆర్.యు. రెడ్డి నిర్మిస్తున్న తొలి చిత్రం ప్రొడక్షన్ నెం.1 షూటింగ్ శరవేగంగా పూర్తయింది. ఈ సందర్భంగా శుక్రవారం ఆర్.యు. రెడ్డి మాట్లాడుతూ, ఈ సినిమా కొత్త రకమైన కథతో అనేక ఎమోషన్స్ కలగలిపిన చిత్రమని తెలిపారు. నటీనటులు ఆశిష్ గాంధీ, మానస రాధాకృష్ణన్‌ల నుండి అద్భుతమైన సహకారం లభించడంతో అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి చేయగలిగామన్నారు.

కిరణ్ కిట్టి, లక్ష్మీ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కొత్తవారైనా కథను అద్భుతంగా చిత్రీకరించారని ఆయన ప్రశంసించారు. ఒక్క పాట మినహా మొత్తం షూటింగ్ పూర్తయిందని, ఆ పాటను ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సమకూరుస్తారని వెల్లడించారు. ప్రముఖ సంగీత దర్శకుడు గోపీసుందర్ అందించిన ఆరు పాటలు సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయని ఆయన తెలిపారు.

త్వరలో సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేసి, రెండు నెలల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఆర్.యు. రెడ్డి పేర్కొన్నారు. ఈ ఏడాదిలో సోనుధి ఫిలిమ్ ఫ్యాక్టరీ నుండి మరికొన్ని చిత్రాలు ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు.


 

Advertisement
 
Advertisement
Advertisement