breaking news
lakshmi chaitanya
-
ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తి: ఆర్.యు. రెడ్డి
సోనుధి ఫిలిమ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై ఆర్.యు. రెడ్డి నిర్మిస్తున్న తొలి చిత్రం ప్రొడక్షన్ నెం.1 షూటింగ్ శరవేగంగా పూర్తయింది. ఈ సందర్భంగా శుక్రవారం ఆర్.యు. రెడ్డి మాట్లాడుతూ, ఈ సినిమా కొత్త రకమైన కథతో అనేక ఎమోషన్స్ కలగలిపిన చిత్రమని తెలిపారు. నటీనటులు ఆశిష్ గాంధీ, మానస రాధాకృష్ణన్‌ల నుండి అద్భుతమైన సహకారం లభించడంతో అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి చేయగలిగామన్నారు.కిరణ్ కిట్టి, లక్ష్మీ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కొత్తవారైనా కథను అద్భుతంగా చిత్రీకరించారని ఆయన ప్రశంసించారు. ఒక్క పాట మినహా మొత్తం షూటింగ్ పూర్తయిందని, ఆ పాటను ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సమకూరుస్తారని వెల్లడించారు. ప్రముఖ సంగీత దర్శకుడు గోపీసుందర్ అందించిన ఆరు పాటలు సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయని ఆయన తెలిపారు.త్వరలో సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేసి, రెండు నెలల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఆర్.యు. రెడ్డి పేర్కొన్నారు. ఈ ఏడాదిలో సోనుధి ఫిలిమ్ ఫ్యాక్టరీ నుండి మరికొన్ని చిత్రాలు ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. -
క్రీడా విభాగంలో లక్ష్మీచైతన్యకు ట్రిపుల్ ఐటీ సీటు
భీమవరం : పట్టణంలోని సెయింట్ మెరీస్ విద్యార్థిని కేతా లక్ష్మీ చైతన్య క్రీడా విభాగంలో నూజివీడు ట్రిపుల్ ఐటీలో సీటు సాధించింది. హెచ్ఎం వలసమ్మ జార్జి సోమవారం వివరాలు వెల్లడించారు. లక్ష్మీ చైతన్య ఆరో తరగతి నుంచి సెయింట్ మేరీస్ స్కూల్లో హాకీ క్రీడను విద్యనభ్యసిస్తూ వివిధ అంతర జిల్లాల హాకీ పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపింది. ఈ ఏడాది మే నెలలో జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీ నగరంలో నిర్వహించిన జాతీయస్థాయి మహిళా హాకీ పోటీల్లో రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహించిన లక్ష్మీచైతన్య ట్రిపుల్ ఐటీ సీటు సాధించిందన్నారు. హెచ్ఎం వలసమ్మ జార్జి, కరస్పాండెంట్ సిస్టర్ లీల, వ్యాయామ ఉపాధ్యాయులు అల్లు అప్పారావు, పాలా దుర్గారావు తదితరులు అభినందించారు.