క్రీడా విభాగంలో లక్ష్మీచైతన్యకు ట్రిపుల్‌ ఐటీ సీటు | lakshmi chaitanya got iit seat in sports quota | Sakshi
Sakshi News home page

క్రీడా విభాగంలో లక్ష్మీచైతన్యకు ట్రిపుల్‌ ఐటీ సీటు

Aug 29 2016 11:59 PM | Updated on Sep 4 2017 11:26 AM

పట్టణంలోని సెయింట్‌ మెరీస్‌ విద్యార్థిని కేతా లక్ష్మీ చైతన్య క్రీడా విభాగంలో నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో సీటు సాధించింది. హెచ్‌ఎం వలసమ్మ జార్జి సోమవారం వివరాలు వెల్లడించారు. లక్ష్మీ చైతన్య ఆరో తరగతి నుంచి సెయింట్‌ మేరీస్‌ స్కూల్లో హాకీ క్రీడను విద్యనభ్యసిస్తూ వివిధ అంతర జిల్లాల హాకీ పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపింది.

భీమవరం : పట్టణంలోని సెయింట్‌ మెరీస్‌ విద్యార్థిని కేతా లక్ష్మీ చైతన్య క్రీడా విభాగంలో నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో సీటు  సాధించింది. హెచ్‌ఎం వలసమ్మ జార్జి సోమవారం వివరాలు వెల్లడించారు. లక్ష్మీ చైతన్య ఆరో తరగతి నుంచి సెయింట్‌ మేరీస్‌ స్కూల్లో హాకీ క్రీడను  విద్యనభ్యసిస్తూ వివిధ అంతర జిల్లాల హాకీ పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపింది. ఈ ఏడాది మే నెలలో జార్ఖండ్‌ రాష్ట్రంలోని రాంచీ నగరంలో నిర్వహించిన జాతీయస్థాయి మహిళా హాకీ పోటీల్లో రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహించిన లక్ష్మీచైతన్య  ట్రిపుల్‌ ఐటీ సీటు సాధించిందన్నారు. హెచ్‌ఎం వలసమ్మ జార్జి, కరస్పాండెంట్‌ సిస్టర్‌ లీల, వ్యాయామ ఉపాధ్యాయులు అల్లు అప్పారావు, పాలా దుర్గారావు తదితరులు అభినందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement