breaking news
Sports Quota
-
డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా అతిపెద్ద స్కామ్
స్పోర్ట్స్ కోటా అన్నది పెద్ద కుంభకోణం. నిజంగా కష్టపడ్డ క్రీడాకారులకు అన్యాయం జరిగింది. జీవో నంబర్ 4, జీవో నంబర్ 47లతో చంద్రబాబు, ఆయన కొడుకు ముందుగానే వేసిన ‘స్కామ్‌ల పాలసీ స్కెచ్’ ఇది. గతంలో ఎప్పుడూ జరగని విధంగా స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు ఎవ్వరూ డీఎస్సీ పరీక్ష, టెట్ రాయాల్సిన అవసరం లేకుండా, బ్యాక్ డోర్ ద్వారా వారిని లోపలికి తీసుకున్నారు. దీనికోసం కొత్త జీవోలు తెచ్చారు. అనుకున్న వారితో పోస్టులు నింపాక, మళ్లీ పాలసీ మార్చారు. స్పోర్ట్స్ కోటాను 2% నుంచి 3%కు పెంచి బ్యాక్ డోర్ ద్వారా లోపలికి తీసుకున్నారు. కేవలం స్పోర్ట్స్ సర్టిఫికెట్ ఆధారంగా.. అదీ పతకాలు లేకపోయినా పర్వాలేదు.. పాల్గొంటే చాలంటూ ఉద్యోగాలు ఇచ్చేలా నిబంధనను మార్చారు. ఇందుకోసం జీవోల జారీకి ముందుగానే వసూళ్ల కార్యక్రమం మొదలైపోయింది. కొన్ని పోస్టులకు అయితే ఉద్యోగం వచ్చిన తర్వాత ఐదేళ్లలో డిగ్రీ పూర్తి చేసి సర్టిఫికెట్ ఇవ్వొచ్చని మినహాయింపు ఇవ్వడం దారుణం. స్పోర్ట్స్‌లో ఆటగాళ్ల ప్రతిభను చూడలేదు.. ఫలితాలు చూడలేదు.. బ్యాకప్ సర్టిఫికెట్స్ లేవు.. ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇంటర్ కాలేజీ, ఇంటర్ యూనివర్సిటీ క్రీడల్లో పార్టిసిపేట్ చేసిన సర్టిఫికెట్స్లోనూ పోస్టులు ఇచ్చేశారు. ఆయా గేమ్స్‌లో పాల్లొన్నట్లు సర్టిఫికెట్స్ కూడా వాళ్లే ఇచ్చారు. ఇలా బాల్ బాడ్మింటన్‌లో 48 మందికి, ఖోఖోలో 49 మందికి, జూడోలో 39 మందికి, సాఫ్ట్ బాల్లో 38 మందికి, ఫెన్సింగ్‌లో 13 మందికి ఉద్యోగాలు వచ్చాయి.డీఎస్సీ స్కామ్‌కు సంబంధించి ఆధారాలు సహా ఫ్యాక్ట్స్, ఫిగర్స్ ఇంత క్రిస్టల్ క్లియర్‌గా కన్పిస్తున్నప్పుడు ప్రభుత్వం సరైన సమాధానం చెప్పకపోగా, ఎదురుదాడి చేస్తూ అబద్ధాన్ని కప్పిపుచ్చుకునే కార్యక్రమం చేస్తోంది. పోలీసులు, అధికారులు వీళ్ల మనుషులే.. సీఎం కుమారుడు నారా లోకేశ్ విద్యా శాఖ మంత్రి. అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వ విచారణలో న్యాయం ఎలా జరుగుతుంది? థర్డ్ పార్టీ ఎంక్వైరీ జరగాలి. సీబీఐతో విచారణ జరిపించాలి. ప్రభుత్వం ఇన్ని తప్పులు చేస్తున్నప్పుడు ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. అలాగని నిర్దాక్షిణ్యంగా నలిపేస్తే ఆటోమేటిక్‌గా కోట్ల మంది కాక్రోచ్లు వస్తారు. -వైఎస్ జగన్సాక్షి, అమరావతి : డీఎస్సీలో మోసపోయిన ప్రతి విద్యార్థి ఒక కాక్రోచ్ (బొద్దింక)గా మారి చంద్రబాబును కాటేస్తారని.. ఈ జెన్ జెడ్, జెన్ ఆల్ఫా కాలంలో విద్యార్థులను ఎవరూ నియంత్రించలేరని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఆపేకొద్దీ ఇంతింతై, వటుడింతై అన్నట్లు దగాపడ్డ యువత కాక్రోచ్లై బాబును కాటేయడం ఖాయమని నిప్పులు చెరిగారు. గురువారం ఆయన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. స్పోర్ట్స్ కోటా రూపంలో చంద్రబాబు సర్కారు డీఎస్సీలో భారీ స్కామ్ చేసిందని, దొడ్డిదారిన తమ వారికి ఉద్యోగాలు ఇచ్చుకోవడానికి జీవోల పేరిట స్కామ్‌కు స్కెచ్ వేశారని మండిపడ్డారు. డీఎస్సీ పరీక్ష రాయకుండానే, ఎటువంటి డిగ్రీ అర్హత లేకుండానే.. ఆటల్లో ఎటువంటి ప్రతిభ కనపర్చకుండానే మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఇంగ్లిష్, హిందీ టీచర్లుగా చంద్రబాబు సర్కారు వందలాది మందిని నియమించేసిందని ఎత్తి చూపారు. జిల్లా, కాలేజీ, విశ్వవిద్యాలయ స్థాయి పోటీల్లో పతకాలు గెలవకపోయినా కేవలం పాల్గొన్నారని వీళ్ల ఎమ్మెల్యేలు, ఎంపీలు అధ్యక్షులుగా ఉన్న క్రీడా సంఘాల చేత సర్టిఫికెట్లు ఇప్పించి ఉద్యోగాలు ఇచ్చేశారని ఆధార సహితంగా వివరించారు. ఇందుకోసం జీవో నంబర్ 4, జీవో నంబర్ 47లను తీసుకొచ్చిన చంద్రబాబు సర్కారు.. నియామక ప్రక్రియ పూర్తికాగానే వాటిని రద్దు చేసి, కొత్త జీవోలు తీసుకొచ్చిందని నిప్పులు చెరిగారు. డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలు పక్కా సాక్ష్యాలతో కనపడుతున్నా, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రశ్నించిన వారిపై ఎదురు దాడికి దిగుతోందని, మొత్తం డీఎస్సీ నియామక ప్రక్రియపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. డీఎస్సీలో దగాపడ్డ అభ్యర్థులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని, ప్రభుత్వం దిగిరాకపోతే వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కమిషన్ వేసి మోసపోయిన విద్యార్థులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ కోటాలో జరిగిన అక్రమాలపై వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..నిజమైన క్రీడాకారులకు అన్యాయం» ‘‘స్పోర్ట్స్ కోటా అన్నది ఇంకో పెద్ద కుంభకోణం. ప్రతిభ ఉన్న వారికే కాదు, నిజంగా కష్టపడ్డ క్రీడాకారుడికి కూడా అన్యాయం జరిగింది. జీవో నంబర్ 4, జీవో నంబర్ 47లతో చంద్రబాబు, ఆయన కొడుకు ముందుగానే వేసిన ‘స్కామ్‌ల పాలసీ స్కెచ్’ ఇది. గతంలో ఎప్పుడూ జరగని విధంగా స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు ఎవ్వరూ డీఎస్సీ పరీక్ష రాయాల్సిన అవసరం లేకుండా, ఒక బ్యాక్ డోర్ పెట్టి.. దాని ద్వారా వారిని లోపలికి తీసుకున్నారు. దీనికోసం కొత్త జీవోలు తెచ్చారు. పని అయిపోయాక, అనుకున్న వారితో నింపాక, మళ్లీ పాలసీ మార్చారు. తెచ్చిన జీవోలను తీసేశారు. » గతంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏ రిక్రూట్‌మెంట్‌లోనైనా క్రీడాకారులకు 2% రిజర్వేషన్ ఉంది. అయితే ఆ ఉద్యోగాలకు సంబంధించిన ఎగ్జామ్‌లో మిగతా అభ్యర్థులతోపాటు వీరు కూడా ఎగ్జామ్స్ రాసి కచ్చితంగా క్వాలిఫై కావాలన్న నిబంధన ఉండేది. అలాంటి నిబంధనను చంద్రబాబు మొత్తం మార్చేశారు. » స్పోర్ట్స్ కోటాను 2% నుంచి 3%కు పెంచి బ్యాక్ డోర్ ద్వారా లోపలికి తీసుకువచ్చారు. ఇందుకోసం ప్రత్యేకంగా కొత్త జీవోలు నంబర్ 4, జీవో నంబర్ 47 తీసుకొచ్చారు. గతంలో జీవో నంబర్ 74 ప్రకారం డీఎస్సీ తప్పకుండా ఉత్తీర్ణత కావాలి. ఈ నిబంధనను రద్దు చేస్తూ స్పోర్ట్స్ కోటా రెండు శాతం నుంచి మూడు శాతానికి పెంచారు. డీఎస్సీ ఎగ్జామ్ రాత పరీక్ష లేకుండా కేవలం స్పోర్ట్స్ సర్టిఫికెట్ ఆధారంగా ఇచ్చేలా నిబంధనను మార్చారు.» ఇంగ్లిష్, హిందీ, మాథ్స్, సోషల్ సైన్స్ సబ్జెక్టులకు డీఎస్సీ ఎగ్జామ్ రాయకుండానే ఉద్యోగాలిచ్చారు. ఇందుకోసం జీవోలు జారీకి ముందుగానే వారి దగ్గర నుంచి వసూళ్ల కార్యక్రమం మొదలైపోయింది. ఆ తర్వాత జీవోలు జారీ చేయడం మొదలు పెట్టారు. ఇంకా కొన్ని పోస్టులకు అయితే ఉద్యోగం వచ్చిన తర్వాత ఐదేళ్లలో డిగ్రీ పూర్తి చేసి సర్టిఫికెట్ ఇవ్వొచ్చని మినహాయింపు ఇచ్చారు. స్పోర్ట్స్ కోటా అంటే నిజమైన ఆటగాళ్ల ప్రతిభకు గౌరవం. దీన్ని ఉద్యోగాల దళారీ వ్యవస్థగా ఈ ప్రభుత్వం మార్చేసింది. డీఎస్సీ 2025 ప్రక్రియ ముగియగానే స్పోర్ట్స్ కోటాలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎత్తివేస్తూ ఆయా శాఖలు నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని జారీ చేసిన జీవో నెం.23 క్రీడాకారుల పేరుతో చేస్తున్న స్కామ్స్పోర్ట్స్లో ఆటగాళ్ల ప్రతిభను చూడలేదు.. ఫలితాలు చూడలేదు.. బ్యాకప్ సర్టిఫికెట్స్ లేవు.. ఎటువంటి పతకాలు, సర్టిఫికెట్స్ లేకుండా కేవలం ఆటల్లో పాల్గొన్నట్లు సర్టిఫికెట్ ఉంటే చాలు ఉద్యోగాలు ఇచ్చేశారు. ఆ స్పోర్ట్స్ కూడా ఏమిటంటే ఇంటర్ డిస్ట్రిక్ట్ (అంతర్ జిల్లా), ఇంటర్ కాలేజీ, ఇంటర్ యూనివర్సిటీ క్రీడల్లో పాల్గొంటే చాలు. అక్కడ కూడా మెడల్స్ అవసరం లేదు. కేవలం పార్టిసిపేట్ చేసిన సర్టిఫికెట్స్‌తో పోస్టులు ఇచ్చేశారు. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే ఆయా గేమ్స్‌లో పాల్లొన్నట్లు సర్టిఫికెట్స్ కూడా వాళ్లే ఇచ్చారు. బాల్ బాడ్మింటన్‌లో 48 మందికి, ఖోఖోలో 49 మందికి, జూడోలో 39 మందికి, సాఫ్ట్‌బాల్‌లో 38 మందికి, ఫెన్సింగ్‌లో 13 మందికి.. కేవలం ఆయా గేమ్స్‌లో పాల్గొన్నందుకే ఉద్యోగాలు వచ్చాయి. ఇందులో సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు టీడీపీ నేత, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్. జూడో అసోసియేషన్ ప్రెసిడెంట్ లోకేశ్ తోడల్లుడు, విశాఖ ఎంపీ భరత్. అంటే వీళ్లే పాల్గొన్న వారికి సర్టిఫికెట్స్ ఇస్తారు.. వీళ్లే ధ్రువీకరిస్తారు. క్రీడల్లో పాల్గొంటే చాలు ఉద్యోగంవివిధ కాలేజీల మధ్య ఆటల పోటీల్లో పాల్గొన్నందుకు 99 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఇందులో పతకాలు, ట్రోఫీలు రాని 86 మందికి ఉద్యోగాలు ఇచ్చేశారు. వీళ్లకు పతకాలు రాలేదు, చెప్పకోదగ్గ టోర్నమెంట్లలో విజయాలు లేవు. జస్ట్ పార్టిసిపేట్ (పాల్గొన్నారు) చేశారంతే. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు. పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు ఇచ్చిన జాబితా చూస్తే.. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి 37, శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి 31, నాగార్జున యూనివర్సిటీ నుంచి 28, ఆది కవి నన్నయ యూనివర్సిటీ నుంచి 19, రాయలసీమ యూనివర్సిటీ నుంచి 15, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ నుంచి 14, యోగి వేమన వర్సిటీ నుంచి 7, డాక్టర్ అంబేడ్కర్ యూనివర్సిటీ నుంచి 4, సంస్కృత యూనివర్సిటీ నుంచి 2, మిగతా యూనివర్సిటీల నుంచి ఒక్కో సర్టిఫికెట్ ఉన్నాయి. ఇంటర్ కాలేజియేట్ పోటీల్లో.. అంటే వివిధ కాలేజీల మధ్య జరిగే పోటీల్లో పాల్గొన్న 99 మందికి టీచర్ ఉద్యోగాలు దక్కాయి. మెడల్స్, ట్రోఫీలు రాకపోయినా కేవలం పార్టిసిపేట్ చేసినందుకే 86 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఇంటర్ డిస్ట్రిక్ట్ పోటీలకు సంబంధించి 59 మందికి ఉద్యోగాలు వస్తే, అందులో పార్టిసిపేట్ చేసినందుకే 18 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. జిల్లా తరఫున ఆడితే చాలు.. గెలుపుతో సంబంధం లేకుండా, డీఎస్సీ పరీక్షలు రాయాల్సిన వసరం లేకుండా కేవలం పార్టిసిపేట్ చేసినందుకు టీచర్ ఉద్యోగం ఇచ్చేశారు.నా పక్కనే ఉన్న (వైఎస్ జగన్ పక్కన కూర్చున్నారు) పోలవరానికి చెందిన గిరిజన క్రీడాకారుడు నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ అనిగి దుర్గయ్యకు ఉద్యోగం రాలేదు. 1:1 నిష్పత్తిలో కాల్ లెటర్ వచ్చిన తర్వాత కూడా ఇవ్వలేదు. డేటా అప్‌లోడ్‌లో సిల్వర్ మెడల్ అని రాయడంతో ఇవ్వలేదంటున్నారు. గోల్డ్ మెడల్ వచ్చినవాడు ఎవడైనా సిల్వర్ మెడల్ అని రాస్తాడా? అయినా ఆటల్లో పాల్గొంటేనే ఉద్యోగాలు ఇస్తున్నప్పుడు, ఇక్కడ ఏదో మెడల్ వచ్చినా ఎందుకు ఇవ్వలేదు? ఆయన 2002లో విశాఖ, హైదరాబాద్‌లో జరిగిన నేషనల్ గేమ్స్‌లో ఫస్ట్ ప్లేస్ గోల్డ్ మెడలిస్ట్. తర్వాత సీనియర్స్ నేషనల్స్, జార్ఖండ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్, యూత్ స్పోర్ట్స్ కలకత్తాలో మూడు గోల్డ్ మెడల్స్ వచ్చాయి. అయినా ఉద్యోగం ఇవ్వలేదు.అయినా ఇంటర్ కాలేజీ, ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇంటర్ యూనివర్సిటీ ఆటల్లో పాల్గొంటేనే ఇస్తున్నావు కదా.. అదే జాతీయ స్థాయిలో పతకం సాధించినవాడికి ఎందుకు ఇవ్వలేదు? ఇదెక్కడి న్యాయం? నిజంగా ఇది కచ్చితమైన క్రీడాకారులకు జరిగిన అవమానం కాదా? ఇది క్రీడాకారుల పేరుతో చేస్తున్న స్కామ్ కాదా? ముందు తన వాళ్లకు ఉద్యోగాలు వచ్చే విధంగా జీవో నంబర్ 4, జీవో నంబర్ 47 తీసుకొచ్చి గేట్లు తెరిచాడు. వాళ్ల వాళ్లకి ఉద్యోగాలు ఇచ్చేశాక జీవో నంబర్ 23, జీవో 25, జీవో 56లతో పాత జీవోలను రద్దు చేస్తూ గేట్లు మూసేశారు. ఇదిస్కాం కాకపోతే ఏమిటి స్వామీ?నీ బుద్ది పుట్టినప్పుడు జీవోలు ఇస్తున్నావు.. నీ బుద్ది పుట్టినట్లు జీవోలు రద్దు చేస్తున్నావు. ఇవి అంత మంచి జీవోలు అని నువ్వు అనుకున్నట్లయితే జీవో నంబర్ 4, జీవో నంబర్ 47ని ఎందుకు రద్దు చేశావు చంద్రబాబూ? సెలక్టయిన అభ్యర్థుల జాబితా పరిశీలిస్తే ఇంకో ఆశ్చర్చకరమైన విషయం కనిపిస్తోంది. ఇంటర్ కాలేజీ, ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇంటర్ యూనివర్సిటీల్లో కేవలం పాల్గొన్నందుకు 270 మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చారు. వీళ్లకు పతకాలు లేవు, చెప్పుకోదగ్గ టోర్నమెంట్స్‌లో పాల్గొనలేదు. కేవలం పార్టిసిపేట్ చేశారంతే.ఒక్కో ఉద్యోగానికి రూ.15–20 లక్షలు» స్పోర్ట్స్ కోటా పోస్టులను ఒక్కొక్కటి రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు బేరసారాలు చేసినట్లు వీడియోలు కూడా బయటకు వచ్చాయి (ఆ వీడియో, ఆడియోను ప్రదర్శించారు). ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లోగోను డీపీ (డిస్ప్లే పిక్చర్)గా పెట్టుకొని ఒక అభ్యర్థితో జరిగిన సంభాషణ కూడా బయట పడింది. విషయం బయటకు రాగానే నామమాత్రంగా కేసు నమోదు చేసి, స్టేషన్ బెయిల్‌తో వదిలేశారు. » ఇవన్నీ చూస్తుంటే స్పోర్ట్స్ కోటా పేరుతో జరిగింది పారదర్శక నియామక ప్రక్రియ కాదు. ఇది ఒక వ్యవస్థీకృత స్కామ్ అని ప్రజలు భావిస్తున్నారు. ఆ కేసులో చేసిన విచారణ శూన్యం. ఏ విషయాలు కూడా బయటకు రాకుండా దాచిపెట్టారు. దీనికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ గమనించండి. వీడియో కాల్ చేసిన వ్యక్తి ఫోన్ నంబర్ చాలా స్పష్టంగా ఉంది. పోలీసులు తల్చుకుంటే ఆ నంబర్ ఎవరిదో నిమిషాల్లో కనిపెట్టేస్తారు. కానీ, ఎఫ్ఐఆర్ కాపీలో ఆ నంబర్ ఎవరిదో చెప్పకుండా, పేరు కూడా తెలపకుండా అనుమానిత వ్యక్తి అని మాత్రమే రాశారు. ఆ అనుమానిత వ్యక్తి చాలా ముఖ్యమైన వ్యక్తి. దీంతో ఆ కేసు ప్రక్రియ కూడా చాలా ఆలస్యం చేశారు. » ఇలా ఎందుకు అయ్యిందంటే.. ఉన్నతాధికారులతో సంప్రదింపుల వల్ల ఆలస్యం అయ్యిందంట. దీని అర్థం ఈ వీడియో కాల్ ఆషామాషీది కాదని, అనుమానిత వ్యక్తి చాలా ముఖ్యమైన వ్యక్తి అని తేలిపోతుంది. స్పోర్ట్స్ కోటాలో టీచర్ ఉద్యోగాల భర్తీ వ్యవహారం వెనుక పెద్ద తలకాయలు ఉన్నాయని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. మరో పక్క ఎమ్మెల్యేలు, ఎంపీలే డీల్ చేస్తున్నారు.. అది వేరే విషయం అనుకోండి. ఇంకా అన్నింటి కంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? బలమైన సెక్షన్లు పెట్టి గట్టిగా విచారణ చేయకుండా, కేవలం స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు. ఇది అన్నింటికంటే దారుణం. కోట్లాది కాక్రోచ్‌ల్లో నేనూ ఒకడినవుతా... కాక్రోచ్ పార్టీనా, ఇంకోటా అనేది పక్కన పెడితే.. వీళ్లంతా యువత. వీళ్లకు న్యాయం చేయకపోతే గవర్నమెంట్ ఏం చేస్తున్నట్టు? గవర్నమెంట్ ఇన్ని తప్పులు చేస్తున్నప్పుడు ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. జెన్ జీ ఇందులో భాగమే. వారి ఆశలను నువ్వు నిర్దాక్షిణ్యంగా నలిపేస్తే ఆటోమేటిక్‌గా, కోట్ల మంది కాక్రోచ్లు వస్తారు. అందులో నేనూ ఒకడినవుతా.ఇది జెన్‌జెడ్ కాలం» చంద్రబాబూ.. ఒకటి గుర్తు పెట్టుకోవాలి. ఇది జెన్‌జెడ్, జెన్ ఆల్ఫా కాలం. దేన్నీ నువ్వు ఆపలేవు. నువ్వు ఆపేకొద్దీ ఇంతింతై, వటుడింతై అన్నట్లు పెరుగుతుంది. దగాపడ్డ యువత నిన్ను విడిచిపెట్టదు. నీకు తగిన గుణపాఠం తప్పకుండా చెప్తారు. కాక్రోచెస్ లేస్తాయి. ఇన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టే మేం సీబీఐ దర్యాప్తునకు పట్టుబడుతున్నాం. లోతుగా వెళ్తే మరిన్ని విషయాలు తప్పకుండా బయటకు వస్తాయి. » విద్యా శాఖ మంత్రిగా సాక్షాత్తు చంద్రబాబు కొడుకు ఉన్నాడు కాబట్టి, ఈ తప్పులపై విచారణ చేయడానికి చంద్రబాబు ముందుకు రాడు సరికదా, ఎదురుదాడి చేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకనే వారం రోజుల క్రితం డీఎస్సీ అభ్యర్థులంతా నా వద్దకు వచ్చినప్పుడు వారికి ఒక్కటే చెప్పాను. వారి తరఫున న్యాయ పోరాటం చేస్తానని. ఒకవేళ అప్పటికీ కాకపోతే, మేం అధికారంలోకి రాగానే ఒక కమిషన్ వేసి, రీ వెరిఫై చేసి, అన్యాయం జరిగిన వారికి న్యాయం చేస్తాం. తప్పు చేసిన వారిని శిక్షిస్తాం అని చెప్పా. » రేపు (శుక్రవారం) రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ స్థాయిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై నిరసనగా ర్యాలీలు నిర్వహిస్తున్నాం. దగాపడ్డ రైతులు, మహిళలు, నిరుద్యోగులు, పిల్లలు.. ఇలా దగాపడ్డ ప్రతి వర్గాన్ని కలుపుకొంటూ ప్రజల తరఫున నియోజకవర్గ స్థాయిలో ఈ ర్యాలీలు జరుగుతున్నాయి. చంద్రబాబు వెన్నుపోట్లను, దగాను, స్కామ్‌లను, మోసాలను గట్టిగా ప్రశ్నిస్తూ నిరసన తెలుపుతాం. దీంతోపాటు డీఎస్సీ అక్రమాల కారణంగా అన్యాయమైపోయిన వారికి సంఘీభావంగా ఈ నిరసన ర్యాలీలు చేపడతాం. » ఎవర్నీ వ్యక్తిగతంగా విమర్శించాలనో.. ఎవరినో ఎత్తిచూపాలనో కాదు. ప్రతి విషయంలో ఆధారాలతో సహా ఫ్యాక్ట్స్, ఫిగర్స్‌తో వివరించడం జరిగింది. ఇంత క్రిస్టల్ క్లియర్‌గా కన్పిస్తున్నప్పుడు సరైన సమాధానం చెప్పకపోగా, ఎదురుదాడి చేస్తూ అబద్ధాన్ని కప్పిపుచ్చుకునే కార్యక్రమం చేస్తే అది ఏరోజుకైనా దేవుడు, ప్రజలు హర్షించరు. రాబోయే రోజుల్లో చంద్రబాబుకు మొట్టికాయలు వేస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ఎంక్వైరీలో న్యాయం ఎలా జరుగుతుంది? పోలీసులు, అధికారులు వీళ్ల మనుషులే. సీఎం కుమారుడు నారా లోకేశ్ విద్యా శాఖ మంత్రి. అలాంటప్పుడు న్యాయం ఎలా జరుగుతుంది? థర్డ్ పార్టీ ఎంక్వైరీ జరగాలి. సీబీఐ లాంటి ఎంక్వైరీ సంస్థ దర్యాప్తుతోనే న్యాయం, ధర్మం జరుగుతుంది. -
వైఎస్ జగన్ ప్రెస్ మీట్ .. దుర్గయ్య ఏం అన్నారో విన్నారా
సాక్షి,తాడేపల్లి: డీఎస్సీ అభ్యర్థి, నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ దుర్గయ్య స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAAP) అధికారులకు సవాల్ విసిరారు. ‘నేను గోల్డ్ మెడల్ సాధించాను. ఎవరైనా వచ్చి నిరూపించమంటే నిరూపిస్తాను. నేను డీఎస్సీకి గోల్డ్ మెడల్ సర్టిఫికెట్లతో అప్లై చేశాను. కానీ ఎస్ఏఏపీ ఎండీ అబద్ధం చెబుతూ నేను సిల్వర్ మెడల్ పెట్టానని అన్నారు’ అని దుర్గయ్య మండిపడ్డారు.డీఎస్సీ రిక్రూట్మెంట్లో జరిగిన కుంభకోణంపై గురువారం వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో దుర్గయ్య కూడా పాల్గొన్నారు.ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. దుర్గయ్య నేషనల్ మెడలిస్ట్ (పక్కనే ఉన్నారు). డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో 1:1 రేషియోలో దుర్గయ్యకు కాల్ లెటర్ వచ్చింది. సర్టిఫికెట్లు సరిగా ఉన్నా ఉద్యోగం రాలేదు. స్పోర్ట్స్ కోటా అనేది పెద్ద స్కాం. స్పోర్ట్స్‌మెన్‌కు అన్యాయం చేశారు. చంద్రబాబు లోకేష్ కలిసి స్కీమ్‌ను స్కామ్ చేశారు..చరిత్రలో లేని విధంగా స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు డీఎస్సీ పరీక్ష రాయనక్కర్లేదని జీవో ఇచ్చారు. జీవో నెంబర్ 74 చూస్తే స్పోర్ట్ కోటా పోస్టుల అంశం తెలుస్తుంది. స్పోర్ట్స్ కోటా వాళ్లు డీఎస్సీకి ఉత్తీర్ణత సాధించాల్సిందే. స్పోర్ట్స్ సర్టిఫికెట్ చూపించి సబ్జెక్ట్ టీచర్లుగా ఉద్యోగాలిచ్చేందుకు జీవోలు తెచ్చారు. కొన్ని పోస్టులకు డీఎస్సీ పరీక్ష లేదు. డిగ్రీ కూడా అక్కర్లేదట. ఉద్యోగం వచ్చిన ఐదేళ్లలో డిగ్రీ పాస్ కావొచ్చట. క్రీడాప్రతిభతో సంబంధం లేదు.. జస్ట్ ఆటలో పాల్గొంటే చాలట. నేషనల్ గోల్డ్‌మెడలిస్ట్ అయిన దుర్గయ్యకు ఉద్యోగం ఎందుకు రాలేదు. నిజమైన క్రీడాకారులకు అన్యాయం జరిగింది’ అన్నారు. -
స్కాం కాకపోతే ఆ జీవోలు ఎందుకు రద్దు చేశారు?
సాక్షి, తాడేపల్లి: డీఎస్సీ పోస్టుల్లో సర్దుబాటు ఎవరి కోసం చేశారని కూటమి ప్రభుత్వాన్ని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నిలదీశారు. డీఎస్సీ రిక్రూట్మెంట్ కుంభకోణంపై పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన ప్రెస్మీట్లో మాట్లాడారు. దుర్గయ్య నేషనల్ మెడలిస్ట్ (పక్కనే ఉన్నారు). డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో 1:1 రేషియోలో దుర్గయ్యకు కాల్ లెటర్ వచ్చింది. సర్టిఫికెట్లు సరిగా ఉన్నా ఉద్యోగం రాలేదు. స్పోర్ట్స్ కోటా అనేది పెద్ద స్కాం. స్పోర్ట్స్‌మెన్‌కు అన్యాయం చేశారు. చంద్రబాబు లోకేష్ కలిసి స్కీమ్‌ను స్కామ్ చేశారు.. చరిత్రలో లేని విధంగా స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు డీఎస్సీ పరీక్ష రాయనక్కర్లేదని జీవో ఇచ్చారు. జీవో నెంబర్ 74 చూస్తే స్పోర్ట్ కోటా పోస్టుల అంశం తెలుస్తుంది. స్పోర్ట్స్ కోటా వాళ్లు డీఎస్సీకి ఉత్తీర్ణత సాధించాల్సిందే. స్పోర్ట్స్ సర్టిఫికెట్ చూపించి సబ్జెక్ట్ టీచర్లుగా ఉద్యోగాలిచ్చేందుకు జీవోలు తెచ్చారు. కొన్ని పోస్టులకు డీఎస్సీ పరీక్ష లేదు. డిగ్రీ కూడా అక్కర్లేదట. ఉద్యోగం వచ్చిన ఐదేళ్లలో డిగ్రీ పాస్ కావొచ్చట. క్రీడాప్రతిభతో సంబంధం లేదు.. జస్ట్ ఆటలో పాల్గొంటే చాలట. నేషనల్ గోల్డ్‌మెడలిస్ట్ అయిన దుర్గయ్యకు ఉద్యోగం ఎందుకు రాలేదు. నిజమైన క్రీడాకారులకు అన్యాయం జరిగిందిబ్యాక్డోర్ ద్వారా ఉద్యోగాలిచ్చే ప్రయత్నం చేశారు. కొన్ని పోస్టులకు డిగ్రీ కూడా అవసరం లేదన్నారు. స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల వ్యవస్థను దళారి కేంద్రంగా మార్చారు. మెడల్స్‌తో సంబంధం లేకుండా.. ఆటల్లో పాల్గొన్నట్లు సర్టిఫికెట్లు చూపించినవాళ్లకు ఇచ్చారు. ఆ సర్టిఫికెట్లు కూడా వాళ్లే ఇచ్చారు. జూడో అసోషియేషన్ గౌరవ అధ్యక్షుడు లోకేశ్ తోడల్లుడు భరత్. సాఫ్ట్‌బాల్ అసోషియేషన్ అధ్యక్షుడు కూన రవికుమార్. వీళ్లే సర్టిఫికెట్లు ఇస్తారు. వీళ్లే ఉద్యోగాలు ఇస్తారు. గోల్డ్‌మెడల్ అనే వ్యక్తి.. సిల్వర్ మెడల్ అని అప్లోడ్ చేశారట. ఆటల్లో పాల్గొన్న వారికే ఉద్యోగాలు ఇచ్చినప్పుడు.. మెడల్ వచ్చిన వారికి ఇవ్వరా?.. నిజమైన క్రీడాకారులకు ఇది అవమానం కాదా?. క్రీడాకారుల పేరుతో జరిగిన స్కామ్ కాదా ఇది? తమ వాళ్లకు ఉద్యోగుల వచ్చేలా జీవో నెంబర్ 4, జీవో 47 తెచ్చారు. వాళ్లకు ఉద్యోగం ఇచ్చి.. జీవో 23, 25, 26తో గేట్లు మూసేశారు.అసలు మీరిచ్చిన జీవో నెంబర్ 4, 47 ఎందుకు రద్దు చేశారు. ఇది స్కామ్ కాకపోతే ఇంకేంటి? కేవలం పాల్గొన్నందుకే 270 మందికి ఉద్యోగాలిచ్చారు. ఉద్యోగాలు ఇచ్చినవారికిఎలాంటి మెడల్స్ రాలేదు. ఇంటర్ కాలేజీ స్పోర్ట్స్‌లో 99 మంది టీచర్ ఉద్యోగాలొస్తే.. మెడల్ రాకపోయినా పాల్గొనందుకే 86 మందికి ఉద్యోగాలు ఇచ్చారు అని వైఎస్ జగన్ లెక్కలతో సహా వివరించారు.డీఎస్సీలో ఒక్కో ఉద్యోగాన్ని రూ.15.26 లక్షలు అమ్ముకుంటున్న బేరసారాల వీడియో బయటకు వచ్చింది. ప్రభుత్వ డీపీ లోగో ఉంది. పైగా ఆ వీడియోలో కాల్ చేసిన నెంబర్ స్పష్టంగా కనిపిస్తుంది. అయినా తూతు మంత్రంగా కేసులు పెట్టారు. స్టేషన్‌బెయిల్ ఇచ్చి బయటకు వదిలేశారు. ఆ వ్యక్తి ఎంత ముఖ్యమైన వ్యక్తో ఇక్కడే అర్థమవుతుంది. ఈ ఆధారం చాలదా స్కామ్ జరిగిందని చెప్పడానికి అని వైఎస్ జగన్ అన్నారు. -
అబద్ధాలు నిజమవుతాయా?
సాక్షి, అమరావతి: స్పోర్ట్స్ కోటా డీఎస్సీ–2025 పోస్టుల భర్తీలో అక్రమాలు వెలుగు చూడటంతో ప్రభుత్వం నిండా మునిగిపోయింది. ‘సాక్షి’లో కథనాల నేపథ్యంలో ప్రజల్లో వ్యతిరేకత రోజురోజుకూ తీవ్రం అవుతుండటంతో తప్పులను కప్పిపుచ్చుకునేందుకు అధికారుల చేత నోటికొచ్చిన అబద్ధాలు, వక్రభాష్యాలు పలికిస్తోంది. సాధారణ పరిపాలన శాఖ(సర్వీసెస్) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తమీమ్ అన్సారియా, శాప్ ఎండీ భరణితో కూడిన అధికారుల బృందం శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో సమావేశం అయ్యింది. ఈ సందర్భంగా శాప్ ఎండీ భరణి మీడియాతో మాట్లాడుతూ.. అక్రమాలు, అవినీతి లేకుండా స్పోర్ట్స్ కోటాలో 382 పోస్టులను అత్యంత పారదర్శకంగా భర్తీ చేసినట్టు ప్రకటించారు. వాస్తవానికి విరుద్ధంగా ఆయన వ్యాఖ్యలు చేయడం క్రీడాకారులను ఆందోళనకు గురి చేస్తోంది. భరణి చెప్పిన అంశాలు... ఇందుకు విరుద్ధంగా ఉన్న వాస్తవాలను పరిశీలిస్తే..1 శాప్ ఎండీ: కేంద్ర ప్రభుత్వ శాఖల్లోనూ కొన్ని చోట్ల ఏ, బీ కేటగిరీలుగా క్రీడలను విభజించారు. మేము కేంద్ర ప్రభుత్వ క్రీడలనే ఏపీలో పెట్టాం.వాస్తవం: కేంద్ర ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ (మయాస్)లో ఈ విభజన ఎక్కడా లేదు. 65 క్రీడాంశాలను సమానంగానే పరిగణిస్తున్నారు. కానీ, ఏపీలో 65 క్రీడాంశాల్లో కేవలం 63 మాత్రమే కేంద్ర ప్రభుత్వంలోనివి ఉంచారు. కుడో, ఈక్వెస్టారియాన్(గుర్రపుస్వారీ)లను తొలగించి వాటి స్థానంలో మెట్రన్ పెంటాథ్లాన్, సెయిలింగ్‌ను తీసుకొచ్చి.. వాటిని ‘ఏ’ కేటగిరీలో పెట్టారు. ఈ వాస్తవాన్ని దాచేసి మొత్తం మయాస్ను అనుసరిస్తున్నట్టు ప్రకటించడం గమనార్హం. ఎక్కువ మంది ఆడే క్రీడలను ‘ఏ’ కేటగిరీలో పెట్టామన్నారు. ఏపీలో గోల్ఫ్, సైలింగ్ ఎంత మంది ఆడుతున్నారు? దానిని ‘ఏ’ కేటగిరీలో ఎందుకు పెట్టారు? అన్నది పాలకులకే అర్థం కావాలి.2 శాప్ ఎండీ: అనిగి దుర్గయ్య దరఖాస్తు సమయంలో తప్పులు చేశారు. దీంతో ఉద్యోగాన్ని కోల్పోయారు. దరఖాస్తులో నేషనల్ గేమ్స్‌కు కాకుండా నేషనల్ చాంపియన్‌షిప్‌కు ప్రాధాన్యం ఇచ్చారు. నేషనల్ గేమ్స్‌లో బంగారు పతకం ఉన్నా ఉద్యోగం రాలేదు.వాస్తవం: దేశవ్యాప్తంగా సీనియర్ నేషనల్ చాంపియన్‌షిప్‌కు ప్రాధాన్యత తర్వాత నేషనల్ గేమ్స్ ను పరిశీలిస్తారు. కానీ, ఏపీలో క్రీడా పాలసీ సమయంలో అక్రమాలకు బీజం వేశారు. మాస్టర్‌మైండ్ చక్రం తిప్పడంతో నేషనల్ గేమ్స్ ముందు వరసలోకి వచ్చి నేషనల్ చాంపియన్ షిప్ కిందికి పోయింది. వాస్తవానికి భారత జట్టు ఎంపిక మొత్తం సీనియర్ నేషనల్స్, జూనియర్ నేషనల్స్ ఆధారంగానే జరుగుతుంది. వాటి ఆధారంగానే కేంద్రప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇస్తారు. కానీ ఏపీలో పతకం రాకున్నా నేషనల్ గేమ్స్‌లో పాల్గొంటే చాలు ఉద్యోగం ఇచ్చేసేలా పాలసీ తెచ్చి కావాల్సిన వారికి ఉద్యోగాలు కట్టబెట్టేశారు. దుర్గయ్యకు నేషనల్ చాంపియన్‌షిప్‌లో సిల్వర్, నేషనల్ గేమ్స్‌లో బంగారు పతకం ఉంది. తప్పుగా అప్లై చేయడంతో ఉద్యోగం ఇవ్వలేదని చెప్పడం దారుణం.3 శాప్ ఎండీ: సౌత్ జోన్, ఆలిండియా ఇంటర్ వర్సిటీ సర్టిఫికెట్లతో ఉద్యోగం పొందాలంటే బ్యాకప్ ఇంటర్ కాలేజియేట్ సర్టిఫికెట్ ఉండాలి. అనంతపురంలో ఎస్ఏ హిందీ ఉద్యోగం వచ్చిన వ్యక్తి ఇంటర్ కాలేజియేట్ బ్యాకప్ సబ్మిట్ చేశారు. ఉద్యోగం ఇచ్చాం.వాస్తవం: వాస్తవానికి సదరు వ్యక్తి సౌత్ జోన్లో వాలీబాల్ పార్టిసిపేషన్ సర్టిఫికెట్ సమర్పించాడు. దానికి బ్యాకప్‌గా వార్షిక స్పోర్ట్స్ మీట్ సర్టిఫికెట్ పెట్టారు. ఇది ఇంటర్ యూనివర్సిటీ/కాలేజియేట్ ఎలా అవుతుంది? ఒక వర్సిటీకి అనుబంధ కళాశాలలు లేనప్పుడు, స్పోర్ట్స్ డే జరుపుకుని అందించే సర్టిఫికెట్‌ను ఎలా బ్యాకప్‌గా పరిగణిస్తారు? ఒక వర్సిటీ జట్టును ఎంపిక చేసి సౌత్ జోన్‌కు పంపిస్తే వర్సిటీ తరఫున ఆడొచ్చు గానీ, ఆ బ్యాకప్ సర్టిఫికెట్తో ఎలా ఉద్యోగం ఇస్తారు? దీనిని కేంద్ర ప్రభుత్వ శాఖలు గుర్తిస్తాయా? ఈ విషయాన్ని శాప్ ఎండీ చాలా చాకచక్యంగా మాట్లాడి తప్పించుకోవడం గమనార్హం.4 శాప్ ఎండీ: స్పోర్ట్స్ సర్టిఫికెట్లు ప్రభుత్వం ఇచ్చేవి కావు. నేషనల్ ఫెడరేషన్, వర్సిటీలు, రాష్ట్ర అసోసియేషన్లు ఇస్తాయి. ఎవరైనా ఫేక్ సర్టిఫికెట్లు ఇస్తే, అభ్యర్థులు వాటితో ఉద్యోగాలు పొందితే కఠిన చర్యలు తీసుకుంటాం. మేము జెన్యూనిటీని పరిశీలించిన తర్వాతే ఉద్యోగాలు ఇచ్చాం.వాస్తవం: ప్రభుత్వం డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల అక్రమాలను అసోసియేషన్లపై నెట్టేసే ప్రయత్నం చేస్తోంది. పైగా జెన్యూనిటీ సర్టిఫికెట్లు పరిశీలించినట్టు చెబుతున్న ఎండీ.. సాఫ్ట్‌బాల్ ఫెడరేషన్‌కు మయాస్లో, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్‌లో గుర్తింపు లేనప్పుడు దానికి అనుబంధంగా ఏపీలో ఉండే సాఫ్ట్ అసోసియేషన్ ఇచ్చిన జెన్యూనిటీని ఎలా వాస్తవమని నిర్ధారిస్తారో చెప్పలేదు.5 శాప్ ఎండీ: ఒలింపిక్స్ నుంచి స్టేట్ చాంపియన్‌షిప్ వరకు ప్రాధాన్యత ప్రకారం 382 పోస్టులు భర్తీ చేశాం. స్టేట్ పార్టిసిపేషన్ పెడితేనే చాలా పోస్టులు మిగిలిపోయాయి. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఇంటర్ డిస్ట్రిక్ట్ ను చేర్చాం. గతంలో స్కూల్స్ గేమ్స్, డిస్ట్రిక్ట్ ఫెస్టివల్స్‌కు ప్రాధాన్యత ఇచ్చారు. వాస్తవం: ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో ఒలింపిక్స్ పెట్టినప్పటికీ పోస్టుల భర్తీలో మాత్రం అన్నీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్లే. పతకాలు గెలిచిన వారిని వేళ్లపై లెక్కించొచ్చు. పథకం ప్రకారమే క్రీడా పాలసీ, జీవోలను తీసుకొచ్చి ఇంటర్ డిస్ట్రిక్ట్ ఆడిన వారికి ఉద్యోగాలు కట్టబెట్టేశారు. స్కూల్స్ గేమ్స్‌కు, డిస్ట్రిక్ట్ ఫెస్టివల్స్‌కు గతంలో ఎక్కడా ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు లేవు. కేవలం కాలేజీ అడ్మిషన్లలో మాత్రమే క్రీడా ప్రతిభ ఆధారంగా వెయిటేజీ ఉండేది. -
కాపీ కొట్టి దొరికిపోయిన ‘శాప్’ చైర్మన్?
సాక్షి, అమరావతి: పరీక్షల్లో కాపీ కొట్టి దొరికిపోయిన వ్యక్తి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) చైర్మన్‌గా ఉన్నాడంటే ఆశ్చర్యంగా ఉంది కదూ. కానీ.. ఇది నిజమంటూ సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు బల్లగుద్ది చెబుతున్నారు. అంతేకాదు. వారు చెబుతున్న దానికి సాక్ష్యంగా టీడీపీకి నిత్యం బాకా ఊదే ఈనాడులో అప్పట్లో ప్రచురితమైన వార్తా కథనాలను సాక్ష్యంగా చూపిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేస్తున్నారు. ఇప్పుడు ఈ అంశం నెట్టింట వైరల్‌గా మారింది. 2013లో తిరుపతిలో నిర్వహించిన శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం రీసెర్చ్ ఎంట్రన్స్ టెస్ట్‌లో భాగంగా జరిగిన మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ ప్రవేశ పరీక్షకు ప్రస్తుత శాప్ చైర్మన్ అనిమి రవికుమార్ (రవినాయుడు) హాజరయ్యారు.ఆ సమయంలో ఆయన పరీక్షా కేంద్రంలో కాపీ కొడుతున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించినట్టు ఈనాడు సహా అప్పటి మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఆ కథనాల ప్రకారం.. పరీక్ష చివరి దశలో విద్యార్థి సంఘాల నాయకులు పరీక్షా హాల్లోకి వెళ్లి ఇన్విజిలేటర్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం రవినాయుడు కాపీ కొడుతూ పట్టుబడ్డారని వార్తలు వెలువడ్డాయి. క్రీడాకారుల భవిష్యత్‌కు సంబంధించిన కీలక పదవిలో ఉన్న వ్యక్తి వెనుక ఇలాంటి గతం ఉండటం ఇప్పుడు రాష్ట్ర ప్రజలను విస్మయానికి గురి చేస్తోంది. ఇప్పుడేమంటారో!! డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఎంపికలపై తీవ్ర ఆరోపణలు వెలువడుతున్న నేపథ్యంలో అవన్నీ నిరాధార ఆరోపణలని, బాధితులు కూడా లేరని, దీనిపై ఎలాంటి చర్చకైనా తాను సిద్ధమని శాప్ చైర్మన్ ప్రగల్బాలు పలికారు. ఆయన సవాల్‌కు సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు గట్టి సమాధానం ఇస్తున్నారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలకు సంబంధించి బాధితులు బయటకు వచ్చి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి తమ గోడు చెప్పుకున్నారు. ఆ సమయంలో బంగారు పతకం సాధించిన వారికి ఉద్యోగం ఇవ్వకుండా కాంస్య పతకం, పార్టిసిపేషన్ సరి్టఫికెట్ ఉన్న వారికి స్పోర్ట్స్ కోటాలో టీచర్ పోస్టులు ఇచ్చేశారంటూ ఆధారాలతో సహా చూపించి కన్నీటి పర్యంతమయ్యారు. ఆ వీడియోలను రవికుమార్ సవాల్‌కు చెంపపెట్టుగా నెటిజన్లు చూపిస్తున్నారు. -
సీబీఐతో విచారించాలి
పోరాడితేనే నిలబడగలుగుతాం. దేవుడి దయ వల్ల మూడేళ్ల తర్వాత మనం అధికారంలోకి వస్తాం. మనం రాగానే కమిషన్ ఏర్పాటు చేసి మీ కేసులన్నీ విచారించి అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తాం. తప్పు చేసిన వారిని శిక్షిస్తాం. 1998, 2008 డీఎస్సీలో కూడా అన్యాయం అయిపోయిన వారికి మనం న్యాయం చేశాం. డీఎస్సీ 2025లో అన్యాయానికి గురైన అభ్యర్థులకు కూడా న్యాయం చేస్తాం. -డీఎస్సీ బాధిత అభ్యర్థులకు వైఎస్ జగన్ భరోసా సాక్షి, అమరావతి: ఒక పోస్టుకు ఒక్కరు (1:1) నిష్పత్తిలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు పిలిచి అన్నింటా సక్సెస్ అయిన అనేక మంది డీఎస్సీ 2025 అభ్యర్థులకు ఉద్యోగాలు రాకపోవడం అత్యంత హేయం.. ఇంతకంటే దారుణం మరొకటి ఉండదని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆక్షేపించారు. పరీక్ష నిర్వహణ, ఎంపికలో అంతులేని అక్రమాలు చోటు చేసుకున్నట్లు అభ్యర్థులు చెబుతున్న విషయాలను బట్టి తెలుస్తోందని, అందుకే డీఎస్సీ 2025పై సీబీఐతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి తరలి వచ్చిన డీఎస్సీ 2025 అభ్యర్థులు బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్‌ను కలిశారు. పరీక్ష నిర్వహణ, ఎంపికలో చోటు చేసుకున్న అక్రమాలను వైఎస్ జగన్ దృష్టికి తెచ్చి తమకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. డీఎస్సీ అభ్యర్థుల ఆవేదన, బాధలను సావధానంగా విన్న వైఎస్ జగన్ వారికి న్యాయం జరిగేలా పోరాడతామని భరోసా ఇచ్చారు. ఇష్టారాజ్యంగా జీవోలు జారీ చేసి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చారని, దీనివల్ల అర్హులైన ఎందరో అభ్యర్థులకు అన్యాయం జరిగిందన్నారు. వారి తరఫున న్యాయ పోరాటం చేస్తామన్నారు. అందుకోసం పార్టీ నుంచి లీగల్ ప్యానెల్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అధికారంలోకి రాగానే ఈ డీఎస్సీపై కమిషన్ వేసి విచారణ జరిపిస్తామని చెప్పారు. అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని.. తప్పు చేసిన వారిని శిక్షిస్తామని చెప్పారు. వైఎస్ జగన్ ఏమన్నారంటే.. నాడు పారదర్శకంగా ఒకేసారి 1.30 లక్షల ఉద్యోగాలు.. వైఎస్సార్సీపీ హయాంలో అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపే 2019లో గాంధీ జయంతి నాటికి 1.30 లక్షల ఉద్యోగాలు ఇచ్చినా ఎక్కడా, ఏ వివాదం రాలేదు. అంత పారదర్శకంగా పరీక్ష నిర్వహించి, అభ్యర్థులను ఎంపిక చేసి ఉద్యోగాలు ఇచ్చాం. అదే చంద్రబాబు కేవలం 16 వేల ఉద్యోగాల్లో ఇన్ని అక్రమాలు, అవకతవకలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అందుకే మీ తరఫున న్యాయపోరాటం చేస్తాం. మీకు ఖర్చు లేకుండా మేమే భరించి, కోర్టులో పోరాడతాం. పని పూర్తి కాగానే మళ్లీ నియమావళిని మార్చేసి.. స్పోర్ట్స్ కోటా పేరిట మొదట ఒక జీవో ఇచ్చారు. ఎలాంటి పరీక్ష అవసరం లేదని, కేవలం సర్టిఫికెట్ల ఆధారంగా ఇస్తామని చెప్పారు. ఇష్టం వచ్చినట్లు భర్తీ చేసి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. ఆ తర్వాత మరో జీవో జారీ చేసి.. ఆ కోటాలో అభ్యర్థులు ఇక నుంచి పరీక్ష రాయాలని, ఇతర అర్హతలు కూడా కలిగి ఉండాలని నిర్దేశించారు. అంటే తమ పని పూర్తి కాగానే మళ్లీ నియమావళిని మారుస్తూ మరో జీవో ఇచ్చారు. డీఎస్సీ నిర్వహణలో ఎక్కడా పారదర్శకత లేదు. ఇష్టారాజ్యంగా వ్యవహరించి ఉద్యోగాలు అమ్ముకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తప్పుల మీద తప్పులు.. 1:1 పద్ధతిలో పిలిచి సర్టిఫికెట్ పరిశీలన కూడా పూర్తి చేసి, రిజెక్ట్ చేయడం ఒక తప్పు. రెండో అనైతికం ఏమిటంటే.. ఏ పరీక్షా రాయకుండా స్పోర్ట్స్ కేటగిరీ అని చెప్పి వారికి ఉద్యోగాలు ఇవ్వడం కోసం మీకు అన్యాయం చేశారు. ఆ పని పూర్తి చేయగానే గేట్లు మూసి మరో జీవో ఇచ్చారు. ఇంతకంటే దగా, మోసం మరొకటి ఉంటుందా? ఓ జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ వ చ్చిన అభ్యర్థికి ఉద్యోగం ఇవ్వలేదు. ఎందుకంటే.. అతడు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు రాలేదని చెప్పారు. కానీ అదే అభ్యర్థి తనకు ఉద్యోగం ఇవ్వలేదని కోర్టుకు వెళ్లాడు. పరీక్షకు ముందే పేపర్లు లీక్ చేయడం.. ఆ తర్వాత ఇష్టానుసారంగా జీవోలు జారీ చేయడం.. 1:1 పద్ధతిలో సర్టిఫికెట్లు వెరిఫై చేసి అన్నీ కరెక్టుగా ఉన్నా ఉద్యోగాలు ఇవ్వకపోవడం... ఆ తర్వాత మెరిట్ వాళ్లకు కాకుండా కింద ఉన్నవారికి ఇవ్వడం... వీటిపై గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేస్తే స్పష్టమైన సమాధానాలు చెప్పలేదు. మీరంతా క్వాలిఫైడ్ కాబట్టే మీకు కాల్ లెటర్స్ కూడా వచ్చాయి. మిమ్మల్ని 1:1 నిష్పత్తిలో పిలిచి అన్యాయం చేశారు. రెండు జీవోలు జారీ చేసి ఇష్టానుసారంగా ఉద్యోగాలు ఇచ్చారు. స్పోర్ట్స్ కోటా అని చెప్పి ఏ అర్హత లేకపోయినా, టెట్ క్వాలిఫై కాకపోయినా ఉద్యోగాలు ఇచ్చారు. అలా వారు అనుకున్న వారికి ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత మళ్లీ ఇంకో జీవో ఇచ్చి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీకి అన్ని అర్హతలు ఉండాలని, పరీక్ష కూడా రాయాలంటూ జీవో జారీ చేశారు. మీకు అండగా న్యాయ పోరాటం చేస్తాం.. మావైపు నుంచి మీకు పూర్తి అండగా ఉంటాం. మాకు ఇద్దరు టీచర్ ఎమ్మెల్సీలు ఉన్నారు. విద్యార్థి విభాగం ఉంది. లీగల్ టీమ్ ఉంది. వారితో ఒక ప్యానెల్ ఏర్పాటు చేసి మీ తరఫున కోర్టులో పిటిషన్ వేసి పోరాడతాం. మూడేళ్ల తర్వాత మన ప్రభుత్వం రాగానే ఒక కమిషన్ వేసి పూర్తి విచారణ జరిపించి మీకు న్యాయం జరిగేలా చూస్తాం. అప్పటి వరకు ఈ మూడేళ్లూ మీ తరఫున న్యాయపోరాటం కొనసాగిస్తాం. మీ అందరికీ ఒకటే హామీ..! పోరాడితేనే నిలబడగలుగుతాం. దేవుడి దయ వల్ల మూడేళ్ల తర్వాత మనం అధికారంలోకి వస్తాం. మనం అధికారంలోకి రాగానే కమిషన్ ఏర్పాటు చేసి మీ కేసులన్నీ విచారించి న్యాయం చేస్తాం. 1998, 2008 డీఎస్సీలో కూడా అన్యాయం అయిపోయిన వారికి మనం న్యాయం చేశాం. డీఎస్సీ 2025లో అన్యాయానికి గురైన అభ్యర్థులకు కూడా న్యాయం చేస్తాం. మన ప్రభుత్వం రాగానే విచారణ జరిపిస్తాం..రేపు వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాగానే డీఎస్సీ 2025 అక్రమాలపై విచారణ జరిపిస్తాం. కొంచెం ఓపిక పట్టండి. ఇప్పుడు సీబీఐ విచారణకు గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. మూడేళ్ల తర్వాత మన ప్రభుత్వం రాగానే మీ స్పెసిఫిక్ కేసుల మీద ఒక కమిషన్ వేసి విచారణ జరిపిస్తాం. మీకు న్యాయం జరిగేలా చూస్తాం. పోరాడితేనే న్యాయం జరుగుతుంది. న్యాయం ఆలస్యం కావొచ్చు. కానీ జరగకుండా ఉండదు. -
సెలక్షన్.. అంతా కలెక్షన్!
డీఎస్సీ క్రీడా కోటా నియామకాల్లో సాఫ్ట్‌బాల్ విభాగంలో 38 పోస్టులు భర్తీ చేశారు. వీటిల్లో అత్యధికంగా 18 పోస్టుల వరకు కేవలం పార్టిసిపేషన్ సర్టిఫికెట్లకు ఇచ్చేశారు. ఆ తర్వాత నేషనల్ గేమ్స్ సర్టిఫికెట్తో ఆరు మందికి పోస్టులు దక్కాయి. మిగిలినవి సౌత్ జోన్ చాంపియన్ షిప్, సీనియర్ నేషనల్స్, ఇంటర్ డిస్ట్రిక్ట్‌కు కట్టబెట్టేశారు. ఒకరిద్దరు మాత్రమే అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ 38 మంది క్రీడా సర్టిఫికెట్లలో ఆరింటికి ఏపీలోని వర్సిటీలు జెన్యూనిటీ ఇచ్చాయి. మిగిలిన వాటికి సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఏఐ), ఏపీ సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ జెన్యూనిటీ నిర్ధారించాయి. జెన్యూనిటీని నిర్ధారించాలంటే ఆయా ఫెడరేషన్లకు కేంద్ర యువజన సర్వీసుల శాఖ (మయాస్), ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ)లో కచ్చితంగా గుర్తింపు ఉండాలి. కానీ, కొన్నేళ్లుగా ఎస్ఏఐకు మయాస్లో గానీ, ఐఓఏలో గానీ గుర్తింపు లేదు. ఎస్ఏఐపై దేశ వ్యాప్తంగా క్రీడాకారులు ఫిర్యాదులు చేయడం గమనార్హం. ఇదిలా ఉంటే ఐఓఏలో గుర్తింపు లేనప్పటికీ, ఎస్ఏఐ తమకు తాము ఐఓఏ గుర్తించినట్టు ప్రకటించుకోడంపై ఐఓఏ లీగల్ నోటీసులు జారీ చేసింది. సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకే గుర్తింపు లేనప్పుడు రాష్ట్రంలోని సాఫ్ట్‌బాల్ అసోసియేషన్‌కు ఎలా గుర్తింపు వచ్చింది? సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఏపీ సాఫ్ట్‌బాల్ అసోసియేషన్లు ఇచ్చిన జెన్యూనిటీని రాష్ట్ర ప్రభుత్వం, క్రీడా ప్రాధికార సంస్థ ఎలా అంగీకరిస్తుంది? ఇందులో దొంగ సర్టిఫికెట్లు లేవని ఎవరు గ్యారంటీ ఇస్తారు? అనంతపురంలో 2021-22లో సాఫ్ట్‌బాల్ నేషనల్స్ స్పోర్ట్స్ మీట్లో ఆడకుండానే సర్టిఫికెట్టు తెచ్చుకుని, న్యాయస్థానంలో ఉద్యోగం పొందిన వ్యక్తిపై ఇప్పటికీ కేసులు నడవట్లేదా? ఇందులో శాప్ అధికారులు 2024 సెప్టెంబర్‌లో ముందుగా సర్టిఫికెట్‌ను ధ్రువీకరించి.. ఆ తర్వాత కాదని కోర్టుకు చెప్పలేదా? అలాంటప్పుడు ఇప్పుడు మాత్రం ఇందులో పారదర్శకత ఎక్కడుంది? టీడీపీ ఎమ్మెల్యే ఏపీ సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉండటమే అన్నింటికంటే పెద్ద అర్హతా?జూడో విభాగంలో 39 పోస్టులు భర్తీ చేశారు. ఇందులో 23 మందికి కేవలం ఇంటర్ డిస్ట్రిక్ట్, స్టేట్ మీట్ సర్టిఫికెట్లకు పోస్టులు వచ్చేశాయి. వారు రాష్ట్రం దాటి వెళ్లలేదు. మరో 16 మందికి ఆలిండియా ఇంటర్ వర్సిటీ, స్టేట్ మీట్లో కేవలం పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌కు సైతం పోస్టులు ఇచ్చేశారు. ఇందులో పీఈటీ, పీడీ పోస్టులు కాదు ఏకంగా స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ కింద బోధన పోస్టులు ఇచ్చేశారు. ఒక్కరు కూడా జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులు లేరా? అత్యంత దారుణంగా జిల్లా జట్లకు ప్రాతినిధ్యం వహించిన వారికి పతకం రాకపోయినా పాల్గొంటే చాలని ఉద్యోగాలు ఇచ్చేస్తారా? జిల్లా స్థాయిలో ఆడటమేనా క్రీడా మెరిట్? పైగా 2018 నవంబర్‌లో నిర్వహించిన సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూడో చాంపియన్ షిప్లో పతకాలు గెలిచిన క్రీడాకారులకు.. తాజాగా డీఎస్సీలో ఉద్యోగాలు పొందిన క్రీడాకారులకు పొంతనే లేదు. ఒరిజినల్ రిజల్ట్ లిస్టులోని వ్యక్తుల స్థానంలో కొత్తవారు వచ్చి ఉద్యోగాలు పొందారు.సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన డీఎస్సీ క్రీడా కోటా పోస్టుల భర్తీ అక్రమాలను సెలక్షన్ లిస్టు మరింత బలపరుస్తోంది. డీఎస్సీ నియామకాలు ముగిసిన ఎనిమిది నెలల తర్వాత ఫైనల్ సెలక్షన్ లిస్టును రెండు రోజుల కిందట ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో బయట పెట్టింది. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నీలో పాల్గొన్న వారికి ఉపాధ్యాయ ఉద్యోగం కట్టబెట్టేసింది. పతకంతో సంబంధం లేకుండా ఉద్యోగాలు ఇచ్చి ‘మెరిటోరియస్ స్పోర్ట్స్ కోటా’(ఎంఎస్క్యూ)కు సరికొత్త అర్థం చెప్పింది. దాదాపు 24 ఏళ్ల కిందట సర్టిఫికెట్లు ఉన్న వారికి రాత పరీక్ష లేకుండానే డీఎస్సీలో ఉపాధ్యాయులుగా నియమించడం సర్వత్రా విస్తుగొలుపుతోంది.విచిత్రంగా ఇంటర్ డిస్ట్రిక్ట్, ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ, యూనివర్సిటీ వార్షిక క్రీడా పోటీల్లో పాల్గొన్న సర్టిఫికెట్లతో ఉద్యోగాలు దక్కడం క్రీడాలోకాన్ని కలవరపరుస్తోంది. క్రీడా కోటా డీఎస్సీలో 421 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయగా 382 పోస్టులను భర్తీ చేసింది. ఫైనల్ లిస్టులో 36 క్రీడాంశాల్లో ఉద్యోగాలు ఇచ్చారు. పదికిపైగా పోస్టులతో నింపిన 14 క్రీడాంశాల్లో మొత్తం 308 పోస్టులను భర్తీ చేస్తే.. ఇందులో కేవలం నాలుగు క్రీడాంశాల్లో 174 పోస్టులు నింపడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అంటే, మిగిలిన 22 క్రీడాంశాల్లో భర్తీ చేసినవి కేవలం 74 పోస్టులు మాత్రమే. ఇలా ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించిన 382 మంది జాబితాలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను వేళ్లపై లెక్కపెట్టొచ్చంటే ఎంత దారుణంగా నియామకాలు చేశారో అర్థమవుతోంది. జాతీయ స్థాయిలో కేంద్ర యువజన సర్వీసుల శాఖ (మయాస్), ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ)లో గుర్తింపు లేని సంఘాలు, కోర్టు కేసుల్లో ఉన్న సంఘాల నుంచి క్రీడా సర్టిఫికెట్ల జెన్యూనిటీ తీసుకున్నట్టు ప్రభుత్వం ప్రకటించడం దుర్మార్గపు విధానాలను అవలంభిస్తున్నట్టు స్పష్టమవుతోంది. మెరిట్‌కు అర్థం మార్చేసిన ప్రభుత్వంకేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం డీఎస్సీ నియామకాలు చేసినట్టు ప్రభుత్వం పచ్చి అబద్ధాలు వల్లెవేస్తోంది. దేశ చరిత్రలో పతకాలు సాధించిన వారిని కాదని పార్టిసిపేషన్ సర్టిఫికెట్లతో కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు లేకపోయినా, ఏపీ క్రీడా కోటా డీఎస్సీలో మాత్రం 90 శాతం పార్టిసిపేషన్, ఇంటర్ డిస్ట్రిక్ట్ సర్టిఫికెట్లకే ఉద్యోగాలు కట్టబెట్టేశారు. ఇందుకు తగ్గట్టుగా క్రీడా పాలసీ రూపకల్పనలోనే దీనికి బీజం పడింది. ఒలింపిక్ మొదలకొని ఏషియన్ గేమ్స్, వరల్డ్‌కప్ (4ఏళ్లు), కామన్ వెల్త్, నేషనల్ గేమ్స్, నేషనల్ చాంపియన్‌షిప్, ఖేలో ఇండియా వర్సిటీ గేమ్స్/యూత్ గేమ్స్/ఆలిండియా ఇంటర్ వర్సిటీ చాంపియన్ షిప్, సౌత్ జోన్ చాంపియన్ షిప్, జోనల్ ఇంటర్ వర్సిటీ చాంపియన్‌షిప్, స్టేట్ చాంపియన్ షిప్‌ల ద్వారా వరుస క్రమంలో పోస్టులను భర్తీ చేస్తామని పేర్కొంది. వీటిల్లో పతకాలతో పాటు పార్టిసిపేషన్ ఉంటే ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించింది. ఇలా 12 స్థాయిల్లో క్రీడా అర్హతల్లో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి.. కేవలం ఇంటర్ డిస్ట్రిక్ట్, స్టేట్ చాంపియన్ షిప్లో అత్యధికంగా పార్టిసిపేషన్ సర్టిఫికెట్లకే ఉద్యోగాలు కల్పించడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ నుంచి జాతీయ స్థాయిలో పతకం గెలిచిన క్రీడాకారులందరూ ఏమైపోయారు? కేంద్ర ప్రభుత్వ శాఖల్లో నేషనల్ చాంపియన్ షిప్‌లకు ప్రాధాన్యం ఇస్తే.. ఇక్కడ నేషనల్ గేమ్స్‌ను ముందు వరుసలో ఎందుకు పెట్టారు? అనేదానికి ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. 65 క్రీడాంశాలను ఎందుకు విభజించారు?కేంద్ర ప్రభుత్వ క్రీడా విధానాల ప్రకారం 65 క్రీడాంశాలను పెట్టినట్టు ప్రభుత్వం చెబుతోంది. అయితే, కేంద్రంలో 65 క్రీడాంశాలను రెండుగా విభజించలేదు. ఏపీలో మాత్రం విభజించారు. 65లో రెండు, మూడు క్రీడలను మార్చి.. ‘మాస్టర్ మైండ్’ (శాప్‌లో పెద్ద తలకాయ తనకు తానుగా పెట్టుకున్న పేరు) సొంతంగా క్రీడలను చేర్చారు. ఇలా ఏ–కేటగిరీలో 36, బీ–కేటగిరీలో 29 పోస్టులను ఎందుకు విభజించారో చెప్పలేదు. ఏ–కేటగిరీలో స్టేట్, ఇంటర్ డిస్ట్రిక్ట్ సర్టిఫికెట్ ఉంటే ఉద్యోగం ఇవ్వగా.. బీ–కేటగిరీలో జాతీయ స్థాయిలో పతకం సాధించిన వారికి ఉద్యోగాలు దక్కలేదని స్పష్టంగా తెలుస్తోంది. రాత పరీక్షకు కూడా హాజరు కాని వారికి డీఎస్సీలో ఉద్యోగాలు ఇచ్చి రూ.కోట్లు కొట్టేశారు. ఆ తర్వాత తీరిగ్గా జీవోను సవరించారు. క్రీడా కోటా 3 శాతం హారిజాంటల్ రిజర్వేషన్లో పోస్టు పొందాలంటే కచ్చితంగా డిపార్ట్మెంట్ పెట్టే రాత పరీక్ష రాయాలని పేర్కొనడం దోపిడీకి సాక్ష్యంగా నిలుస్తోంది. చిత్తురు జిల్లా స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్లతో భారీ అవకతవకలు జరిగినట్టు విశ్వసనీయంగా తెలిసింది.క్రీడా ట్రయల్స్ ఎందుకు పెట్టలేదు?కేంద్ర ప్రభుత్వ శాఖలు, సంస్థలు క్రీడా కోటాలో ఉద్యోగాలను భర్తీ చేసే క్రమంలో కచ్చితంగా క్రీడా ట్రయల్స్ నిర్వహిస్తాయి. అందులో ప్రతిభను చూసి పోస్టులకు ఎంపిక చేస్తాయి. కానీ, డీఎస్సీ క్రీడా కోటా నియామకాల్లో ఎక్కడా రాత పరీక్ష లేకపోగా, కనీసం క్రీడా ట్రయల్స్‌ను నిర్వహించక పోవడం గమనార్హం. తాజాగా హైకోర్టు సైతం డీఎస్సీకి సంబంధించిన కేసులో సర్టిఫికెట్ నిర్ధారణకు సాఫ్ట్‌బాల్‌లో ట్రయల్స్ పెట్టమని ఆదేశించింది. 20– 24 ఏళ్ల కిందటి క్రీడా సర్టిఫికెట్లతో..అది కూడా కేంద్ర ప్రభుత్వంలో పెద్దగా ప్రాధాన్యం ఇవ్వని ఆలిండియా ఇంటర్ వర్సిటీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు ఇవ్వడం ఆందోళన కలిగిస్తోంది. బాల్ బ్యాడ్మింటన్‌లో 48 పోస్టులు భర్తీ చేస్తే 34 పైగా, ఖోఖో 49కి గాను 24కుపైగా, హ్యాండ్‌బాల్ 18 పోస్టులు ఉంటే 14 పోస్టులకుపైగా పార్టిసిపేషన్ సర్టిఫికెట్లతో ఇచ్చేశారు. ఫొటోలు, మెడల్స్‌ను పరిశీలించిన దాఖలాలు కూడా లేవు.సారూ.. వీటినేమంటారు?» అనంతపురంలో వాలీబాల్/బీచ్ వాలీబాల్‌లో ఓ క్రీడాకారుడికి ఎస్ఏ హిందీ పోస్టు వచ్చింది. సదరు వ్యక్తి 2011-12లో హైదరాబాద్ వర్సిటీలో వార్షిక క్రీడా పోటీల్లో పార్టిసిపేట్ చేశారు. ఆ తర్వాత అదే ఏడాది కోయంబత్తూరులో సౌత్ జోన్ వర్సిటీ టోర్నీలో పార్టిసిపేట్ చేసిన సర్టిఫికెట్తో డీఎస్సీ ఉద్యోగం దక్కింది.» చిత్తూరు జిల్లాలో హ్యాండ్ బాల్ కోటాలో ఓ మహిళకు ఎస్ఏృజీవశాస్త్రం ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం వచ్చింది. ఆమె 6వ ఇంటర్ డిస్ట్రిక్ట్ హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్ (2021 మార్చి 5-7)లో పార్టిసిపేట్ చేసింది. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్‌లో నిర్వహించిన 49వ సీనియర్ ఉమెన్ నేషనల్ హ్యాండ్‌బాల్ చాంపియన్ షిప్ (2021 మార్చి17-21)లో పార్టిసిపేట్ చేసిన సర్టిఫికెట్తో ఉద్యోగం పొందింది. ఇక్కడ 6వ ఇంటర్ డిస్ట్రిక్ట్ మీట్‌కి.. అదే ఏడాది 49వ సీనియర్ ఉమెన్ నేషనల్ మీట్‌కి మధ్య ఉన్న వ్యత్యాసం ఆశ్చర్యం కలిగిస్తోంది.» పశ్చిమగోదావరి జిల్లా ఖోఖో కోటాలో ఓ మహిళకు ఎస్ఏృఫిజికల్ ఎడ్యుకేషన్ ఉద్యోగం వచ్చింది. ఆమె 2022 డిసెంబర్ 13-22 మధ్య హైదరాబాద్‌లో జరిగిన 32వ నేషనల్ గేమ్స్‌లో మొదటి స్థానం దక్కినట్టు సర్టిఫికెట్ చూపించారు. దీనికి తోడు 2001లో డిసెంబర్ 19-23 మధ్య పుణెలో 37వ సీనియర్ నేషనల్ ఖోఖో చాంపియన్ షిప్లో పార్టిసిపేషన్ సర్టిఫికెట్ పొందుపరిచారు. వాస్తవానికి 2022 సెప్టెంబర్‌లోనే గుజరాత్లో 36వ నేషనల్ గేమ్స్ జరిగాయి. ఈ లెక్కన ఏది నిజం? సదరు క్రీడాకారిణి జెన్యూనిటీ పరిశీలించారా? » చిత్తూరు జిల్లాలో బ్యాడ్మింటన్ విభాగంలో ఓ మహిళకు ఎస్ఏృఇంగ్లిష్ పోస్టు వచ్చింది. సదరు క్రీడాకారిణికి ఇంటర్ వర్సిటీ సౌత్ జోన్ (2008-09)లో పార్టిసిపేట్ చేసిన సర్టిఫికెట్తో ఉద్యోగం ఇచ్చారు. 2008-09లో తిరుచ్చిలో ఇంటర్ వర్సిటీ సౌత్ జోన్ టోర్నీలో బాల్ బాడ్మింటన్‌లో పాల్గొన్నట్టు బ్యాకప్ సర్టిఫికెట్ చూపించారు. అసలు బ్యాడ్మింటన్‌లో బ్యాకప్ సర్టిఫికెట్ చూపించాలి కదా?» చిత్తూరు జిల్లాలో ఖోఖోలోనే ఓ క్రీడాకారిణికి ఎస్జీటీ ఉద్యోగం వచ్చింది. ఆమె 2019-20లో తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో వార్షిక స్పోర్ట్స్ మీట్లో పార్టిసిపేట్ చేశారు. ఆ తర్వాత అదే ఏడాది శ్రీకాకుళం అంబేడ్కర్ వర్సిటీలో సౌత్‌జోన్ ఇంటర్ వర్సిటీ టోర్నీలో పార్టిసిపేట్ చేసిన సర్టిఫికెట్తో ఉద్యోగం పొందారు. ఇక్కడ అండర్ ఏజ్, సీనియర్ చాంపియన్ షిప్‌లలో పాల్గొనకుండానే ఉద్యోగం వచ్చేసింది.» తూర్పుగోదావరి జిల్లాలో బాక్సింగ్ విభాగంలో ఓ క్రీడాకారిణికి ఎస్జీటీ ఉద్యోగం వచ్చింది. ఆమెకు 2006 అక్టోబర్‌లో 7వ సీనియర్ స్టేట్ ఉమెన్ బాక్సింగ్ చాంపియన్ షిప్(విశాఖ)లో 2వ స్థానం దక్కింది. అంతకు ముందు ఆమె గెలిచిన ఒక్క పతకానికి సంబంధించి ఎటువంటి సర్టిఫికెట్లు పొందుపరచలేదు. జూనియర్ స్థాయిలో ఆడకుండానే సీనియర్ చాంపియన్ షిప్‌కు వెళ్లిపోయారా? -
డీఎస్సీలో కప్పిపుచ్చుకునే ‘గేమ్స్’
సాక్షి, అమరావతి: క్రీడా కోటా డీఎస్సీ పోస్టుల భర్తీలో అక్రమాలు చోటుచేసుకోవడంతో అర్ధరాత్రి వేళ శాప్‌లో హైడ్రామా నడిచింది. సోమవారం ఉదయం విధులకు హాజరైన ఉద్యోగులు (సెక్షన్ ఆఫీసర్లు) మురుసటి రోజు మంగళవారం ఉదయం 7 గంటల తర్వాతే ఇళ్లకు వెళ్లారు. శాప్ ఉన్నతాధికారి సైతం సోమవారం అర్ధరాత్రి 3 గంటల తర్వాత కార్యాలయం నుంచి ఇంటికి వెళ్లగా.. తిరిగి ఉదయం 7 గంటలకే కార్యాలయానికి తిరిగి వచ్చినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఉద్యోగులకు షిప్టులు వేసి మరీ కార్యాలయం పని వేళల కంటే ముందుగా రప్పించి.. అర్ధరాత్రి వరకు పని చేయించడం గమనార్హం. తాము చెప్పిన సమయానికి రాకపోతే.. చెప్పిన పని చేయకపోతే సస్పెషన్ వేటు వేయడంతోపాటు బదిలీ చేస్తామని సాక్షాత్తూ శాప్ చైర్మన్ బెదిరింపులకు పాల్పడినట్టు ఉద్యోగులు వాపోతున్నారు. మంగళవారం రాత్రి వరకూ ఇదే తంతు నడిచింది. డీఎస్సీ ముగిసి 8 నెలల దాటిన తర్వాత ఇప్పుడు శాప్‌లో కూర్చుని డేటాను తయారు చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.జాబితా ఎందుకు మారింది?రాత్రంతా క్రీడా కోటా డీఎస్సీలో అభ్యర్థుల డేటాపై మల్లగుల్లాలు పడినట్టు తెలుస్తోంది. ఉద్యోగుల ఫోన్లు సైతం సదరు అధికారి వద్దనే పెట్టుకుని పని చేయించడం చర్చనీయాంశమైంది. డీఎస్సీలో రాత పరీక్ష లేకుండా పోస్టులు పొందిన 382 మంది జాబితాను మంగళవారం ఉదయానికి ఓ ప్రత్యేక లింక్ ద్వారా విడుదల చేశారు. దీంతో కొద్ది గంటల్లోనే ఆ లింక్‌లోని డేటాలో మార్పులు కనిపించాయి. 382 మంది సెలక్షన్ లిస్టులో తొలుత ట్రయథ్లాన్‌లో ముగ్గురు క్రీడాకారులు ఉద్యోగాలకు ఎంపికైనట్టు చూపించారు. ఇందులో జరుబుల రాము అనే వ్యక్తి పేరును సవరించిన జాబితా నుంచి తొలగించారు. అతనికి ఉద్యోగం రాలేదా? ఒకవేళ వచ్చి ఉంటే ఎందుకు తొలగించారు? ఉద్యోగం రాకపోతే ఎందుకు జాబితాలోకి పేరు చేరింది? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరో విచిత్రం ఏమంటే.. కృష్ణా జిల్లా తోట్లవల్లూరులో స్కూల్ అసిస్టెంట్ పీఈటీగా పని చేస్తున్న వ్యక్తి పేరు ముందుగా అప్లోడ్ చేసిన జాబితాలో లేకపోవడం గమనార్హం. సదరు క్రీడాకారిణి ఏషియన్ ఉమెన్ చాంపియన్ షిప్లో పతకం సాధించారు. నియామక సమయంలో తొలుత ఆమెకు పోస్టు ఇవ్వడానికి నిరాకరిస్తే ఏకంగా హైకోర్టులో కేసు వేసి ఆధారాలతో సహా సమర్పించగా కోర్టు ఆదేశాలతో పోస్టింగ్ ఇచ్చారు. ఇలా జాతీయ స్థాయిలో రాణించి క్రీడా కోటాలో ఉద్యోగం దక్కని అర్హులైన ఎందరో క్రీడాకారులు రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. కానీ, 382 మంది జాబితా చూస్తే క్రీడల్లో పతకాలు సాధించిన వారి కంటే పార్టిసిపేషన్, ఇంటర్ డిస్ట్రిక్, స్టేట్ చాంపియన్ షిప్లో పాల్గొన్న వ్యక్తులకు మాత్రమే పోస్టులు రావడంపై క్రీడాకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తామంతా పాదర్శకంగా చేశామని చెప్పుకుంటున్న చంద్రబాబు ప్రభుత్వంలో అర్ధరాత్రి హడావుడి పడుతూ డేటాను మార్చాల్సిన అవసరం ఏమిటని క్రీడాకారులు ప్రశ్నిస్తున్నారు. ముందుగా పబ్లిక్ డొమైన్లో జాబితాలు పెట్టకుండా ఇప్పుడు ఉరుకుల పరుగులపై విడుదల చేయడాన్ని వారంతా తప్పుపడుతున్నారు. ఇక్కడ ఎంపిక జాబితా ఇచ్చారే తప్ప 1:5 నిష్పత్తిలో ఉద్యోగాలకు ప్రాథమికంగా ఎంపిక చేసిన 2వేల మంది క్రీడాకారుల జాబితాను ఎందుకు ప్రదర్శించడం లేదని ఉద్యోగాలు దక్కని అర్హులైన క్రీడాకారులు నిలదీస్తున్నారు. -
అర్హులను తొక్కేసి.. అడ్డగోలు డ్రామాలు!
సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ –2025లో అక్రమాలను కప్పిపుచ్చేందుకు చంద్రబాబు సర్కారు పడరాని పాట్లు పడుతోంది! అడ్డదారిలో ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా అవన్నీ సక్రమమే అంటూ అడ్డగోలుగా అబద్ధాలు చెబుతోంది. ఓ అభ్యర్థి గతంలో తప్పుడు జనన ధ్రువీకరణ పత్రాలతో (రెండు వేర్వేరు పుట్టిన తేదీలు) సంపాదించిన క్రీడల సర్టిఫికెట్తో ఉద్యోగానికి దరఖాస్తు చేస్తే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పోస్టల్ శాఖ నిర్ద్వందంగా తిరస్కరించింది. అలాంటి అభ్యర్థికి ఈ డీఎస్సీలో ఏకంగా స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టు కట్టబెట్టేసి ఎలాంటి తప్పులేదంటూ రాష్ట్ర ప్రభుత్వం సమర్థించుకోవడం విస్తుగొలుపుతోంది.సోమవారం సచివాలయంలో పర్యాటక, యుజవన సర్వీసుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్, శాప్ ఎండీ భరణిని ముందుపెట్టి ప్రభుత్వం తన తప్పులను ఒప్పులుగా చిత్రీకరించేందుకు యత్నించి భంగపడింది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మభ్యపెట్టే యత్నం చేసింది. క్రీడా సర్టిఫికెట్లు ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిది, శాప్ అధికారులది కాదని.. క్రీడా సంఘాలు మాత్రమే ఇస్తాయంటూ అర్థంలేని వాదన వినిపించింది. డీఎస్సీ క్రీడా కోటాలో ఎంపికైన అభ్యర్థుల మెరిట్ జాబితాను వెబ్సైట్లో, బహిరంగంగా ప్రదర్శించకుండా దాచిపెట్టిన ప్రభుత్వం.. ఇప్పుడు ‘క్రిడయ్’ యాప్‌లో పెట్టామంటూ సమర్థించుకోవడం దుర్నీతిని బట్టబయలు చేస్తోంది.కోర్టు కేసులను ఎదుర్కొని పారదర్శకంగా నియామకాలు చేపట్టినట్లు స్పెషల్ సీఎస్ అజయ్‌జైన్ గొప్పగా ప్రకటించారు. అయితే, అంతర్ జిల్లా స్థాయిలో సర్టిఫికెట్లు తెచ్చుకున్న క్రీడాకారులకు యథేచ్ఛగా టీచర్ ఉద్యోగాలు ఇచ్చేసిన ప్రభుత్వం.. అంతర్జాతీయ క్రీడాకారులకు మాత్రం పోస్టులు ఇచ్చేందుకు ఎందుకు నిరాకరించిందో మాత్రం చెప్పడం లేదు. ఆయా అంతర్జాతీయ క్రీడాకారులు హైకోర్టును ఆశ్రయించగా అధికారుల తీరును తప్పుబట్టి అక్షింతలు వేసిన తరువాతే డీఎస్సీలో ఉద్యోగం ఇచ్చారు.మరి పారదర్శకత ఎక్కడ పాటించారు? హైకోర్టు ఆదేశాలతో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి ఫిర్యాదులను పరిష్కరించామని చెప్పుకొచ్చారు. మరి నియామకాల సమయంలోనే తప్పుడు పత్రాలతో ఉద్యోగాలు పొందుతున్న వారి వివరాలతో సహా అర్హులైన అభ్యర్థులు శాప్‌కు ఫిర్యాదు చేస్తే ఎందుకు పట్టించుకోలేదో చెప్పలేక నీళ్లు నమిలారు. ఇక ఈ డీఎస్సీ తర్వాత క్రీడా కోటాలో రాత పరీక్షను తప్పనిసరి చేస్తూ జీవోను సవరించడంపై అధికారులు వివరణ ఇస్తూ.. ప్రభుత్వ పాలసీ పర్మినెంట్‌గా ఉండదని సమర్థించుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.ప్రభుత్వానికి పాలసీ పర్మినెంట్‌గా ఉండదట!మీడియా: డీఎస్సీ ముగిసిన తర్వాత స్పోర్ట్స్ కోటా 3 శాతం హారిజాంటల్ రిజర్వేషన్ జీవోను ఎందుకు సవరించారు? మళ్లీ రాత పరీక్షను ఎందుకు తప్పనిసరి చేశారు? క్రీడా సర్టిఫికెట్లు, డిగ్రీల జెన్యూనుటీని ఎలా పరిశీలించారు?స్పెషల్ సీఎస్, శాప్ ఎండీ: ప్రభుత్వానికి పాలసీలు పర్మినెంట్‌గా ఉండవు. క్రీడా పాలసీ కూడా అంతే. క్షేత్రస్థాయి ఫీడ్ బ్యాక్‌ను బట్టి పాలసీ మారిపోతుంది. అప్పటి పాలసీ ప్రకారం రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు ఇచ్చాం. కొన్నిసార్లు చట్టాలకు అనుగుణంగా ఉద్యోగ నియామకాలు చేపట్టాలి. శాప్‌లో ప్రత్యేక స్రూ్కటినీ బృందాలను పెట్టి ఆ తర్వాత స్క్రీనింగ్ కమిటీ ద్వారా 1 : 5 నిష్పత్తిలో జాబితా తయారు చేశాం. వాటిని వారం రోజులు వెబ్సైట్లో పెట్టి అభ్యంతరాలు స్వీకరించి తర్వాత తుది జాబితాను సిద్ధం చేశాం. 421 పోస్టులకుగాను 382 పోస్టులు భర్తీ చేశాం. క్రీడా సంఘాలు, ఫెడరేషన్ల నుంచి జెన్యూనుటీ సర్టిఫికెట్లు తీసుకొచ్చాం. స్రూ్కటినీ కమిటీలో ఆయా వర్సిటీల అధికారులు పరిశీలించి ఓకే చేశారు.ఇదీ వాస్తవం: ప్రభుత్వం చెబుతున్నట్లుగా క్రీడా సంఘాలు, ఫెడరేషన్ల నుంచి క్రీడాకారుల జెన్యూనుటీ సర్టిఫికెట్లను తీసుకుంటే ఒక్కటి కూడా మీడియాకు చూపించలేదు. వాస్తవానికి ధ్రువపత్రాల పరిశీలన సమయంలో క్రీడా సంఘాల ప్రతినిధులకు భాగస్వామ్యం కల్పించాలి. జాతీయ స్థాయిలో అయితే ఫెడరేషన్ సభ్యులు ప్రభుత్వ నియామకాల్లో కచ్చితంగా పాల్గొంటారు. గత ప్రభుత్వంలో సచివాలయ ఉద్యోగాల భర్తీ సమయంలో తొలుత జిల్లా స్థాయిలో ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో వడపోత చేపట్టారు. పైగా అçప్పుడు రాత పరీక్షల్లో అర్హత సాధిస్తే ఉద్యోగం కల్పించారు. డీఎస్సీ మాదిరిగా క్రీడా సర్టిఫికెట్ చూసి ఉద్యోగం ఇవ్వలేదు. 1.34 లక్షల మందితో సచివాలయాల ఉద్యోగాల భర్తీ నిర్వహించినప్పుడు రాని ఆరోపణలు ఇప్పుడు 2025 డీఎస్సీలో మాత్రమే ఎందుకు వస్తున్నాయో ఈ ప్రభుత్వం చెప్పలేకపోతోంది. పైగా ఇతర రాష్ట్రాల్లో చదివిన ఉద్యోగార్థుల వివరాలను ఆయా వర్సిటీల్లో పరిశీలించకుండానే చేసేసినట్టు చెబుతోంది.శాప్.. పూటకో మాట!డీఎస్సీ ఉద్యోగార్థుల క్రీడా సర్టిఫికెట్లను పారదర్శకంగా స్రూ్కటీని చేసినట్లు స్పెషల్ సీఎస్ అజయ్ జైన్ బల్లగుద్ది చెప్పారు. సర్టిఫికెట్ల పరిశీలనలో ‘శాప్’ పారదర్శకత ఏపాటిదో చెప్పేందుకు ఈ ఉదంతమే ఓ నిదర్శనం. 2024 సెప్టెంబర్‌లో న్యాయస్థానాల్లో ఉద్యోగాల భర్తీ సందర్భంగా ప్రకాశం జిల్లాకు చెందిన ఓ క్రీడాకారుడు ‘ప్రాసెస్ సర్వర్ పోస్టు’ కోసం క్రీడా కోటాలో దరఖాస్తు చేసుకున్నారు. 2021 డిసెంబర్ 24–28 వరకు అనంతపురంలో జరిగిన సాఫ్ట్‌బాల్ నేషనల్ మీట్లో పాల్గొని తన టీమ్ రజత పతకం సాధించినట్లు అతడు పేర్కొన్నారు.ఈ క్రీడా సర్టిఫికెట్లు శాప్ పరిశీలనకు రావడంతో ‘మాస్టర్‌మైండ్’ తన వాటా కింద రూ.3 లక్షలు వసూలు చేసి అంతా సక్రమమేనంటూ అధికారులతో చెప్పించడంతో సదరు క్రీడాకారుడికి ఉద్యోగం వచ్చేసింది. అయితే దీనిపై ఓ అభ్యర్థి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఉద్యోగానికి ఎంపికైన సదరు క్రీడాకారుడు ఆ సమయంలో సాఫ్ట్‌బాల్ నేషనల్ మీట్లో పాల్గొనలేదని, ఆ సమయంలో అతడు ఓ కళాశాలలో బీపీఈడీ కోర్సు చదువుతున్నట్లు ఆధారాలు సమర్పించారు.దీనిపై సింగిల్ బెంచ్ ధర్మాసనం ఆదేశాల మేరకు మరోసారి సర్టిఫికెట్లను పరిశీలించిన శాప్ అధికారులు అవి సరైనవి కాదని తేల్చారు. దీనిపై సదరు క్రీడాకారుడు డివిజనల్ బెంచ్‌ను ఆశ్రయించగా శాప్ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. తాము ఆ క్రీడాకారుడికి నోటీసులు ఇచ్చినప్పటికీ ఫిజికల్ టెస్టుకు హాజరు కాలేదని, ఆటలో నైపుణ్యం లేదని పేర్కొంది. దీనిపై తాజాగా హైకోర్టు శాప్ అధికారులతో ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ నేపథ్యంలో స్పెషల్ సీఎస్ చెబుతున్నట్లుగా శాప్ నిజంగానే అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తుంటే కోర్టు ఉద్యోగాల భర్తీకి సంబంధించి సర్టిఫికెట్ల పరిశీలనపై పూటకో మాట ఎందుకు చెబుతోంది? ఏ రాజకీయ శక్తి చేతుల్లో శాప్ బందీగా మారిపోయింది? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.తొలుత సదరు సాఫ్ట్‌బాల్ క్రీడాకారుడి సర్టిఫికెట్ సరైనదే అంటూ ధ్రువీకరించిన శాప్.. ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో మరోసారి ఆ సర్టిఫికెట్లు నిజమైనవి కావంటూ మాట మార్చినట్లు స్పష్టం చేస్తున్న హైకోర్టు ఆర్డర్ సర్వీసు రూల్స్‌కు ముందు జీవో సవరణ?కూటమి ప్రభుత్వం తన తప్పులను సమర్థించుకునే క్రమంలో అడ్డగోలుగా వ్యవహరిస్తోంది. డీఎస్సీ 2025 ముగియడమే ఆలస్యం.. స్పోర్ట్స్ కోటాలో రాత పరీక్షలు లేకుండా ఉద్యోగాలు ఇవ్వటాన్ని ఎత్తివేసింది. తొలుత డీఎస్సీకి ముందు ఏపీ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీసు రూల్స్‌ను సవరిస్తూ 19–04–2025న అప్పటి సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. దాని ప్రకారం డీఎస్సీలో పరీక్ష లేకుండా క్రీడా కోటాలో ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించారు.డీఎస్సీ ముగిసిన తర్వాత ఈ ఏడాది మే 15న ఏపీ సబార్డినేట్ అండ్ సర్వీసు రూల్స్‌ను మళ్లీ సవరిస్తూ సీఎస్ సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. కచ్చితంగా డిపార్ట్మెంట్ పెట్టే రాత పరీక్షలో అర్హత సాధించాలని పేర్కొన్నారు. విచిత్రం ఏమిటంటే.. ఈ ఏడాది మే 15న సబార్డినేట్ అండ్ సర్వీసు రూల్స్ సవరణ కంటే ముందే.. మే 14 క్రీడా శాఖలో జీవోను సవరిస్తూ స్పెషల్ సీఎస్ అజయ్‌జైన్ ఉత్తర్వులు ఇవ్వడం!నేషనల్ గేమ్స్‌కు ప్రాధాన్యమా?క్రీడా పాలసీ 2024–29 రూపకల్పనలో కూటమి ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరించింది. ‘మాస్టర్‌మైండ్’ చెప్పినట్టే పాలసీ పురుడు పోసుకుంది. డీఎస్సీలో అక్రమాలకు మార్గం సుగమం అయింది. పాలసీ రూపకల్పన సమయంలోనే క్రీడా సంఘాలను ప్రభుత్వం సంప్రదించి ఉంటే.. సీనియర్ నేషనల్స్‌కు ప్రాధాన్యం దక్కాల్సిన చోట నేషనల్ గేమ్స్ పెట్టడంపై క్రీడా సంఘాలు ఇప్పుడు ఎందుకు ప్రశ్నిస్తాయి? పదేపదే జీవోలను సవరించామని ఎందుకు డిమాండ్ చేస్తాయి? వీటికి ప్రభుత్వం దగ్గర సరైన సమాధానం లేదు.గొప్పగా 65 క్రీడలకు అవకాశం కల్పించాలని చెబుతున్న ప్రభుత్వం.. ఏపీలో అంతగా ప్రాచుర్యంలో లేని క్రీడలను ఎందుకు చేర్చింది? ఫెడరేషన్లలో గుర్తింపు పొందిన ఏపీ క్రీడా సంఘాలకు కచ్చితంగా శాప్ గుర్తింపు ఇవ్వాల్సి ఉండగా వాటిని ఎందుకు ఇబ్బందులకు గురి చేస్తోంది? మాస్టర్‌మైండ్ మాట వింటేనే క్రీడా సంఘాలు మనుగడ సాగించే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇవన్నీ డీఎస్సీ స్పోర్ట్స్ కోటా పోస్టుల భర్తీపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. ఇవన్నీ పరిశీలిస్తుంటే అర్హులకు పోస్టులు ఇవ్వకుండా అన్యాయం చేసినట్లు స్పష్టమవుతోంది.పోస్టల్ శాఖలో రిజెక్ట్.. డీఎస్సీలో పోస్టింగ్మీడియా: విజయనగరం జిల్లాలో వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి ఒకరు తప్పుడు డేట్ ఆఫ్ బర్త్‌లతో ఉద్యోగం పొందారని ప్రభుత్వానికి ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తే ఏం చేశారు? గతంలో పోస్టల్ శాఖ ఆమెకు ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించింది కదా? పోలీసులు సైతం ఆమె తప్పుడు జనన ధ్రువీకరణ పత్రాలతో మోసం చేసినట్టు ధ్రువీకరించారు?స్పెషల్ సీఎస్, శాప్ ఎండీ: విజయనగరం జిల్లా వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణిపై ఎటువంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. ఆ జిల్లా ఎస్పీ సైతం దీన్ని ధ్రువీకరిస్తూ పత్రం ఇచ్చారు. సదరు క్రీడాకారిణి నేషనల్ గేమ్స్‌లో కాంస్య పతకం సాధించారు. ఆమె 20–5–1992 డేట్ ఆఫ్ బర్త్‌తో క్రీడల్లో పాల్గొంది. ఆమె స్కూల్లో డేట్ ఆఫ్ బర్త్ కూడా అదే. మేం క్రీడా సంఘాలు, ఫెడరేషన్ నుంచి సైతం జెన్యూనుటి తీసుకున్నాం.ఇదీ వాస్తవం: విజయనగరం జిల్లాకు చెందిన వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి రెండు పుట్టిన తేదీలతో చలామణి అయినట్లు జిల్లా ఎస్పీకి 08–4–2016న స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ నివేదిక సమర్పించారు. ఎస్వీఆర్ మూర్తి అనే వ్యక్తి సదరు క్రీడాకారిణిపై విశాఖ రేంజ్ డీఐజీకి ఆధారాలతో సహా 19–02–2016లో ఫిర్యాదు చేశారు. దీనిపై డీఐజీ ఆదేశాలతో విజయనగరం ఎస్పీ విచారణ చేపట్టారు. విచారణ చేసిన స్పెషల్ బ్రాంచ్ అధికారులు 08–04–2016న సదరు క్రీడాకారిణి 20–05–1992, 10–05–1993 డేట్ ఆఫ్ బర్త్‌లతో చలామణి అయినట్టు ధ్రువీకరిస్తూ నివేదిక సమర్పించారు.తొలుత 10–05–1993 పుట్టిన తేదీతో (10–11–2010న) పాస్‌పోర్టు పొందగా, తర్వాత 06–08–2015న రూ.ఐదు వేలు జరిమానా చెల్లించి పుట్టిన తేదీ 20–05–1992తో కొత్త పాస్‌పోర్టు పొందినట్టు వెల్లడించారు. అయితే 10–05–1993 (తప్పుడు పుట్టిన తేదీ)తోనే ఆమె 2012లో కామన్వెల్త్ జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో 53 కిలోల మహిళల విభాగంలో ప్రాతినిధ్యం వహించింది. ఇలా అండర్ ఏజ్‌లో తప్పుడు డేట్ ఆఫ్ బర్త్‌తో జాతీయ పోటీల్లోనూ పాల్గొంది. ఇక 2015 సమయంలో 20–05–1992 పుట్టిన తేదీతో నేషనల్ గేమ్స్‌లో పాల్గొని పతకం సాధించింది.డీఎస్సీ నోటిఫికేషన్‌కు ముందు సదరు క్రీడాకారిణి పోస్టల్ శాఖలో ‘పోస్టల్ అసిస్టెంట్’ (రిజిస్టర్ నం, ఎస్పీ3ఈ153ఏ149బీఈ5ఎఫ్) ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంది. తప్పుడు ధ్రువీకరణ పత్రాలపై ఫిర్యాదులు అందడంతో పోస్టల్ శాఖ విచారించి ఆమెను ఉద్యోగానికి ఎంపిక చేయకుండా తిరస్కరించింది. అలా పోస్టల్ శాఖ సదరు అభ్యర్థి మోసాన్ని గుర్తించి ఎంపికకు నిరాకరిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నేషనల్ గేమ్స్‌లో 20–05–1992 తేదీతో ఆడారని, ఎటువంటి పోలీసు కేసులు లేవని చెబుతూ తన తప్పిదాన్ని సమర్థించుకుంటోంది.ఈ ఏడాది ఏప్రిల్ 24న ‘డీఎస్సీ డీల్స్’ కథనంలో సదరు క్రీడాకారిణి నియామకంపై ఆధారాలతో ‘సాక్షి’ కథనాన్ని ప్రచురించింది. అప్పటి నుంచి ఆమె క్రీడా సర్టిఫికెట్ జెన్యూనుటీ నిజమైనదేనని చెప్పాలంటూ క్రీడా సంఘాలపై ప్రభుత్వం ఒత్తిడి చేయడం వాస్తవం కాదా? 2025 ఆగస్టు 11న ఓ క్రీడాకారుడు ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తే అప్పుడు పట్టించుకోని ప్రభుత్వం.. ఇప్పుడు తప్పును దాచేందుకు మల్లగుల్లాలు పడుతోంది. 2016లో విజయనగరం జిల్లాకు చెందిన వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి వేర్వేరు పుట్టిన తేదీలతో చలామణి అయినట్టు ధ్రువీకరించిన నివేదిక -
అంతర్ జిల్లా క్రీడా సర్టిఫికెట్తో టీచర్ పోస్టా?
సాక్షి, అమరావతి: డీఎస్సీ నియామక ప్రక్రియపై రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు మండిపడుతున్నారు. ముఖ్యంగా క్రీడా కోటాలో రాత పరీక్ష అవసరం లేకుండా భర్తీ చేసిన టీచర్ పోస్టుల్లో భారీ అవినీతి చోటు చేసుకుందని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. అత్యంత దారుణంగా ఇంటర్ డిస్ట్రిక్ట్ (అంతర్ జిల్లా) క్రీడా పోటీల సర్టీ ఫికెట్లతో ఉపాధ్యాయ పోస్టులు కట్టబెట్టేయడం విస్తుగొల్పుతోంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులకు మొండిచెయ్యి చూపించి కేవలం ఒక జిల్లాకు క్రీడల్లో ప్రాతినిథ్యం వహించిన వారి సర్టీ ఫికెట్లకు ప్రాధాన్యం ఇవ్వడం డీఎస్సీ క్రీడా కోటా పోస్టుల భర్తీలో పారదర్శకతకు పాతరగా నిలుస్తోంది. ‘ముఖ్య’నేత బంధువు, మాస్టర్ మైండ్ అవినీతి వ్యూహంలో భాగంగానే పోస్టుల భర్తీలో ప్రాధాన్యతలు మారిపోయినట్లు అభ్యర్థులు పేర్కొంటున్నారు. మెరిట్ జాబితా ఎక్కడ? క్రీడా కోటా డీఎస్సీలో 421 పోస్టుల్లో 97 శాతం భర్తీ చేశారు. అయితే ఎక్కడా మెరిట్ జాబితాను ప్రదర్శించలేదు. తొలుత టెంటేటివ్ (తాత్కాలిక) జాబితాను పెట్టిన శాప్ దానిపై అభ్యర్థులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో పాటు కోర్టులను ఆశ్రయిస్తుండటంతో వెంటనే తొలగించింది. ఆ తర్వాత తుది జాబితాను ఎక్కడా ప్రదర్శించకుండా కొందరు అభ్యర్థులకు వ్యక్తిగతంగా సమాచారం చేరవేసింది. విచిత్రం ఏమిటంటే.. తాత్కాలిక జాబితాలో ఉన్న చాలా మంది అభ్యర్థుల పేర్లు తుది జాబితాలో లేకపోవడం.అంతా పారదర్శకంగా చేశామని, పబ్లిక్ డొమైన్లో ప్రతి డేటాను అందుబాటులో ఉంచామని శాప్ చైర్మన్ రవినాయుడు ప్రకటించారు. అయితే శాప్ వెబ్సైట్ మొత్తం జల్లెడ పట్టినా ఎక్కడా ఎంపికైన ఒక్క అభ్యర్థి వివరాలు కానరాలేదు. శాప్‌కు వచి్చన దరఖాస్తులను తొలుత స్క్రీనింగ్ కమిటీ పరిశీలించి జాబితాను రాష్ట్ర స్థాయి కమిటీకి పంపగా సమీక్షించి తుది జాబితాను ఆమోదించింది. ఇదంతా లోపాయికారిగా చేయడంలో మాస్టర్‌మైండ్ కీలక చక్రం తిప్పినట్టు తెలుస్తోంది! బ్యాక్‌గ్రౌండ్ జల్లెడ పడుతున్న అభ్యర్థులు.. క్రీడా కోటా డీఎస్సీలో అవినీతి బాగోతాన్ని కప్పిపుచ్చేందుకు ‘మాస్టర్‌మైండ్’ ఉద్యోగాలు పొందిన కొందరు ఉపాధ్యాయులను రంగంలోకి దించి వీడియోలతో ప్రజల దృష్టిని దారి మళ్లించేందుకు చేసిన యత్నం బెడిసికొడుతోంది. వారి బ్యాక్ గ్రౌండ్‌ను నిరుద్యోగ అభ్యర్థులు జల్లెడ పడుతున్నారు. అన్ని అర్హతలు ఉండి కూడా ఉద్యోగం దక్కని క్రీడాకారులు దీన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దీంతో వీడియోలు చేస్తే తమ గుట్టు రట్టవుతుందని ఫేక్ సర్టీ ఫికెట్లతో ఉద్యోగం పొందిన వారు బెంబేలెత్తుతున్నారు. ఇదిలా ఉంటే డీఎస్సీ గురించి చిన్న పేపర్ కూడా బయటకు వెళ్లడానికి వీల్లేదంటూ తమపై మాస్టర్‌మైండ్ విరుచుకుపడటాన్ని శాప్ వర్గాలు జీరి్ణంచుకోలేకపోతున్నాయి. మూటలు దోచుకుని తమపై చిందులేయడం ఏమిటని చర్చించుకుంటున్నాయి. సర్టీ ఫికెట్ల పరిశీలన ఏది? పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ క్రీడాకారిణి ఖోఖోలో జాతీయ స్థాయిలో రాణించారు. ఆమెకు డిగ్రీ సర్టీ ఫికెట్ లేకున్నా స్పోర్ట్స్ కోటా డీఎస్సీలో ఉద్యోగం వచ్చింది. తొలుత జిల్లా జాబితాలో 10వ స్థానంలో ఉన్న ఆమె తర్వాత టాప్‌లోకి వచ్చేసింది. పొరుగు రాష్ట్రంలో డిగ్రీ చదివినట్లు ఓ ఫేక్ సర్టీ ఫికెట్‌ను సృష్టించి పోస్టు అమ్మేశారు. అదే శాప్.. క్రీడా సర్టీ ఫికెట్తోపాటు అభ్యర్థి డిగ్రీ సర్టీ ఫికెట్ నిజమైనదేనా? అని పరిశీలించి ఉంటే అక్రమాలు జరిగేవి కావని అవకాశం కోల్పోయిన అర్హులైన అభ్యర్థులు స్పష్టం చేస్తున్నారు. పొరుగు రాష్ట్రాల్లో బీపీఈడీ, బీఈడీలు చేసినట్లు బోగస్ సర్టీ ఫికెట్లతో ఉద్యోగాలిచ్చారని, ఒక్క అభ్యర్థి విషయంలో కూడా శాప్ ఆయా వర్సిటీలకు వివరాలను పంపించి వాస్తవాన్ని ధ్రువీకరించుకున్న పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రీడా సర్టీ ఫికెట్లే కాదు.. దొంగ డిగ్రీలతోనూ టీచర్ ఉద్యోగాలు అమ్మేయడం ‘మాస్టర్‌మైండ్’ స్కెచ్‌కు నిదర్శనమని పేర్కొంటున్నారు.సర్టిఫికెట్‌కు రూ.5 లక్షలు.. పోస్టుకు రూ.15–20 లక్షలు!క్రీడా కోటా డీఎస్సీలో ఫేక్ సర్టిఫికెట్లు సృష్టించి టీచర్ ఉద్యోగాలను అంగట్లో సరుకుల మాదిరిగా అమ్మేశారని తొలి నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రూ.5 లక్షలకు ఇంటర్ డిస్ట్రిక్ట్ సర్టిఫికెట్లను విక్రయించడంతో పాటు పోస్టుకు రూ.15–20 లక్షలు చొప్పున వసూలు చేసినట్లు అభ్యర్థులు పేర్కొంటున్నారు. ఇలా మూడొంతులు పోస్టులు అమ్ముకుని రూ.40–50 కోట్లు వసూలు చేసినట్లు క్రీడాకారులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. అందుకే ఎక్కడా తుది మెరిట్ లిస్టును ప్రదర్శించ లేదని.. దొడ్డి దారిన ఉద్యోగాలు పొందిన వారి గుట్టు, మాస్టర్‌మైండ్ బండారం బయటపడుతుందనే భయంతోనే దాన్ని దాచేసినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. -
ఖేల్ ఖతం
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ‘డీఎస్సీ’ క్రీడా కోటా పోస్టుల భర్తీలో అవకతవకలు పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు కట్టి మరీ అమ్మేసుకోవడం నిరుద్యోగ యువతలో అలజడి రేకెత్తిస్తోంది. ఏకంగా 421 పోస్టుల్లో 97 శాతం పోస్టులు భర్తీ చేయగా ఇందులో వంద పోస్టులూ నిజమైన అర్హులకు దక్కలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.సాక్షాత్తూ ముఖ్యనేత బంధువు, శాప్ పాలకవర్గంలోని ఓ కీలక వ్యక్తిని మాస్టర్‌మైండ్‌గా ముందు పెట్టి సాగించిన దందా సాక్ష్యాలతో సహా బయటకొచ్చే సరికి ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరవుతోంది. నిజమైన అర్హత కలిగిన క్రీడాకారులకు తీవ్ర అన్యాయం చేస్తూ ముడుపులు తీసుకుని క్రీడలంటే తెలియని వ్యక్తులకు పోస్టింగ్ ఆర్డర్లు జారీ చేయడం దుర్మార్గ పాలనకు అద్దం పడుతోంది. దీనికితోడు డీఎస్సీ ముగిసిన తరువాత తాజాగా క్రీడా పాలసీని సవరించడం అనుమానాలకు తావిస్తోంది. సర్టీఫికెట్ చాలదు.. పరీక్ష రాయాల్సిందే! ప్రభుత్వ క్రీడా విధానం 2024–29 ప్రకారం.. 3 శాతం హారిజాంటల్ రిజర్వేషన్ ద్వారా ప్రతిభగల క్రీడాకారులకు వారి సర్టీఫికెట్ల ఆధారంగా నేరుగా ప్రభుత్వ శాఖల్లో పోస్టింగ్ ఇవ్వాలని సర్కారు నిర్దేశించింది. దీని ప్రకారమే డీఎస్సీలో 421 పోస్టుల్లో 97శాతం పోస్టులను భర్తీ చేసింది. ఎటువంటి రాత పరీక్ష లేకుండా క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ, ఇతర స్థాయిల్లో సాధించిన పతకాలు, సర్టిఫికెట్ల ఆధారంగా నియామకాలు పూర్తిచేసింది. దీనిని అనువుగా చేసుకునే ముఖ్యనేత బంధువు, మాస్టర్‌మైండ్ పోస్టుకో రేటు పెట్టి ముడుపులు దండుకున్నారు.అర్హులకు పోస్టులు దక్కకుండా చేశారు. ఇంత జరిగాక.. డీఎస్సీ అయిపోయిన తర్వాత ఇప్పుడు క్రీడాపాలసీ 2024–29ను చంద్రబాబు సర్కారు సవరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇప్పుడు, 3శాతం హారిజంటల్ రిజర్వేషన్లో అభ్యర్థి కచ్చితంగా ఆయా శాఖల్లో పోస్టులకు నిర్వహించే రాతపరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తేనే క్రీడా కోటాలో సర్టీఫికెట్లు పరిగణనలోకి తీసుకుని నియామకాలు చేపట్టనున్నట్టు సర్కారు ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. అంటే, ఇక్కడ ఒక పథకం ప్రకారం మెగా డీఎస్సీలో పోస్టులను విచ్చలవిడిగా అమ్మేసుకుని, ఆ తంతు ముగిసిపోయిన తర్వాత తీరిగ్గా క్రీడా పాలసీని సవరించినట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఎవరికిచ్చిన అభయం కోసం!! ఇదిలా ఉంటే రాత పరీక్షను తప్పనిసరి చేస్తూ క్రీడా కోటా పాలసీని సవరించిన సర్కారు శాప్‌లో గ్రేడ్–3 కోచ్‌ల నియామకానికి మాత్రం దీనిని వర్తింపజేయకపోవడం, ఇక్కడ పాత పద్ధతిలోనే సర్టీఫికెట్ల మెరిట్ ఆధారంగానే చేస్తుండటం గమనార్హం. డీఎస్సీ క్రీడా కోటాలో తనకు అన్యాయం జరిగిందని న్యాయపోరాటానికి సిద్ధమైన అనంతపురానికి చెందిన ఓ ఫెన్సింగ్ క్రీడాకారిణిని బెదిరించి నిలువరించిన శాప్,, శాశ్వత కోచ్‌ల నియామకంలో కచ్చితంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది. దీనిని బట్టి డీఎస్సీలో మాస్టర్‌మైండ్ చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు శాప్ కోచ్‌ల నియామకానికి రాతపరీక్ష అర్హతలు పెట్టలేదని స్పష్టమవుతోంది.ఇలా వందల మంది పోస్టుల రాని క్రీడాకారులను మభ్యపెట్టినట్టు సమాచారం. ఇదిలా ఉంటే డీఎస్సీలో రెండేళ్లకోసారి, అసలు ఎప్పుడు జరుగుతుందో తెలియని నేషనల్ గేమ్స్‌ను ముందు వరుసలో పెట్టి సీనియర్ నేషనల్స్ ప్రాధాన్యాన్ని వెనక్కి నెట్టేసింది. నేషనల్స్‌లో పాల్గొన్నట్లు సర్టీఫికెట్లు తెచ్చుకున్న వారికి రూ.15 లక్షల చొప్పున పోస్టులు అమ్మేశారు. వాస్తవానికి నేషనల్ గేమ్స్ అనేవి ఒక్కోసారి ఒక్కో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఇందులో ఒక్కో క్రీడాంశంలో కేవలం టాప్–8 ఉండే రాష్ట్రాల జట్లు మాత్రమే పాల్గొంటాయి. ఏటా జరిగే సీనియర్ నేషనల్స్‌లో దేశం మొత్తం నుంచి ఆయా రాష్ట్రాల్లో వడపోసిన క్రీడాకారులు ప్రదర్శనకు వస్తారు. సీనియర్ నేషనల్స్‌లో నెగ్గుకురావడం చాలా కష్టం. అలాంటి సీనియర్ నేషనల్స్‌ను పక్కన పడేసి నేషనల్ గేమ్స్‌కు డీఎస్సీలో ప్రాధాన్యం ఇవ్వడం సర్కారు దుర్నితికి అద్దం పడుతోంది. క్రీడల విభజనతో మొత్తం గోల్మాల్దేశ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో క్రీడలను కూటమి ప్రభుత్వం రెండు రకాలుగా వర్గీకరించింది. ఇందులో ఏపీలో ప్రాధాన్యంలో ఉన్న క్రీడలను తక్కువ కేటగిరీలోకి నెట్టేసింది. జీవోలో 65 క్రీడలను చేరిస్తే ఏ–కేటగిరీలో 36, బీ–కేటగిరీలో 29 క్రీడలను పెట్టింది. ఇది క్రీడా ప్రమాణాలకు విరుద్ధమని క్రీడా సంఘాల ప్రతినిధులు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నా ప్రభుత్వంలో కదలిక రాలేదు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ క్రీడల విభజన లేదు. శాప్ గుర్తింపు లేని సంఘాలను ఏ– కేటగిరిలో ఉంచి, శాప్ గుర్తింపు ఉన్న కొన్ని సంఘాలను బీ కేటగిరిలోకి తేవడం కొసమెరుపు. ఉద్యోగాల భర్తీలో ఏ–కేటగిరి పూర్తయిన తరువాత బీ–కేటగిరి క్రీడలకు ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించి ఆ ప్రకారం డీఎస్సీలో పోస్టులు ఇష్టారీతిన భర్తీ చేసేశారు.ఉదాహరణకు.. బీ–కేటగిరీలో ఉన్న క్రీడలో సదరు క్రీడాకారుడు జాతీయ స్థాయిలో పతకాలు సాధించినా.. ఏ–కేటగిరిలో ఉన్న క్రీడాకారుడు రాష్ట్ర స్థాయి ఆటల్లో పాల్గొన్న సర్టీఫికెట్‌తో వస్తే చాలు అతనికే ప్రాధాన్యం ఇచ్చి పోస్టులు భర్తీ చేశారు. దీనిపైనా హైకోర్టులో కేసులు కొనసాగుతున్నాయి. మరోవైపు రాష్ట్రంలో గోల్ఫ్ కోర్టులు ఎక్కడా లేవు, గోల్ఫ్ ఆడే క్రీడాకారులూ లేరు, ఈ క్రీడను ఏ–కేటగిరిలో చేర్చి రాష్ట్రంలో యువత రాణించే సెపక్తక్రా, నెట్‌బాల్, క్యారమ్స్, ఆత్యా పాత్యా, బాడీ బిల్డింగ్, కరాటే, టెన్నిస్‌బాల్ క్రికెట్, సాఫ్ట్ టెన్నిస్, యోగాసన క్రీడలను బీ–కేటగిరిలో పెట్టి డీఎస్సీని అడ్డుపెట్టుకుని దోచేశారు. క్రీడా సర్టీఫికెట్లకు గతంలో ఉన్న 10 ఏళ్ల కాలపరిమితిని ఎత్తివేశారు. -
డీఎస్సీ ‘డీల్స్’.. తప్పించుకునే ‘డ్రిల్స్’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో క్రీడా కోటా డీఎస్సీ–2025 ఎంపికల్లో పారదర్శకతకు సమాధి కట్టేశారు. పోస్టుల భర్తీ కంటే ముందే దొంగ సర్టిఫికెట్లు, తప్పుడు జనన ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులపై ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోలేదు. ఇక్కడ సాక్షాత్తు సర్టీఫికెట్లు పరిశీలించి, వాటి వాస్తవికతను ధ్రువీకరించిన శాప్ అధికారులకే ఫిర్యాదులు అందాయి. అయితే.. సీఎం బంధువు, మాస్టర్‌మైండ్ తన రాజకీయ బలంతో ఫిర్యాదులను తొక్కిపెట్టేశారు. తాను ముందుగా డీల్ కుదుర్చుకున్న వ్యక్తులకే ఉద్యోగాలు అమ్మేయడం ద్వారా దాదాపు రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్లు దోచేశారు.ఇంతటి దుర్మార్గపు నియామకాలను సాక్ష్యాలతో సహా ఎండగడుతూ శుక్రవారం ‘సాక్షి’లో ప్రచురించిన ‘డీఎస్సీ డీల్స్’ కథనంతో శాప్ కార్యాలయం ఉలిక్కిపడింది. డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో అత్యంత పారదర్శకంగా పోస్టులను భర్తీ చేశామంటూ చెబుతూనే తప్పించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆరోపణలు, ఫిర్యాదులు వచ్చిన ఉద్యోగులను 27న విచారించి సమగ్ర నివేదికను నియామక సంస్థ అయిన పాఠశాల విద్యా శాఖకు సమర్పించనున్నట్టు శాప్ పేర్కొనడం గమనార్హం. ఆగస్టులో ఫిర్యాదులొస్తే ఏం చేసినట్టు? విజయనగరానికి చెందిన వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి పోస్టల్ శాఖలో ఉద్యోగానికి అనర్హురాలిగా తేలడంతో పోలీసులు ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పైగా సదరు క్రీడాకారిణి స్కూల్లో చేరినప్పటి డేట్ ఆఫ్ బర్త్, పాస్‌పోర్టులోని డేట్ ఆఫ్ బర్త్‌లో ఏడాదికిపైగా వ్యత్యాసం ఉంది. ఈ ఆధారాలతోనే ఆగస్టులో శాప్‌కు ఫిర్యాదు అందింది. కానీ.. దీని వెనుక చక్రం తిప్పిన ‘మాస్టర్ మైండ్’ ఆదేశాలతో ఆ ఫిర్యాదు గాలిలో కలిసిపోయింది. అప్పుడే విచారణ చేసి ఉంటే తప్పుడు నియామకం జరిగేది కాదు. కానీ, శాప్ ఇప్పుడు విచారణ చేసి తప్పులేదని తేల్చే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది.పైగా ప్రభుత్వ ఉద్యోగం పొందే క్రమంలో అభ్యర్థుల ప్రవర్తన (కాండక్ట్)ను పరిశీలించాలి. కానీ, సదరు క్రీడాకారిణిపై స్పష్టంగా ఎఫ్ఐఆర్ నమోదై ఉన్నా.. ఆ విషయాన్ని కావాలనే దాచిపెట్టారా? లేదా వాస్తవం తెలిసినా ఉద్యోగం ఇచ్చేశారా? అనే ప్రశ్నలొస్తున్నాయి. ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఫిర్యాదులు, అభ్యంతరాలను పారదర్శకంగా పరిష్కరించాలి. కానీ, ఆగస్టులో నమోదైన ఫిర్యాదుపై నేటికీ శాప్ నుంచి స్పందన లేదు. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చాక ‘విచారణ చేస్తాం.. నివేదిక ఇస్తాం’ అంటూ తప్పును కప్పిపుచ్చుకునేందుకు నానా పాట్లు పడుతోంది. పోనీ, ఇప్పుడు నియామకం తప్పని రుజువైతే నష్టపోయిన అర్హతగల అభ్యర్థులకు రోస్టర్ ప్రకారం ఆ పోస్టును భర్తీ చేస్తారా? లేదో స్పష్టత ఇవ్వలేదు. ధ్రువీకరణ పత్రాల పరిశీలనలో క్రీడా సంఘాలు ఎక్కడ? వాస్తవానికి శాప్, క్రీడా సంఘాల సమన్వయంతోనే క్రీడలు అభివృద్ధి చెందుతాయి. కానీ, డీఎస్సీ పోస్టుల భర్తీలో క్రీడా సంఘాలను ప్రణాళిక ప్రకారం దూరం పెట్టారు. కేవలం మాస్టర్‌మైండ్ తనకు అనుకూల అధికారులను దగ్గర పెట్టుకుని ధ్రువీకరణ పత్రాల పరిశీలన ముగించేశారు. ఆ తర్వాత మొక్కుబడిగా క్రీడా సంఘాల నుంచి జెన్యూన్ సర్టీఫికెట్లు తెప్పించారు. కుల ధ్రువీకరణ, జనన ధ్రువీకరణ పత్రాల ఆమోదం మొత్తం శాప్లోనే నిర్ధారించేశారు. దీనికోసం బహుళ స్థాయిల్లో పరిశీలన చేసినట్టు శాప్ పేర్కొనడం చూస్తుంటే మాస్టర్ మైండ్ చేసింది తప్పని నిర్ధారణ అయితే అందరినీ బలిచేసే కుట్ర చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇక్కడంతా ‘మాస్టర్‌మైండ్’ సీఎం పేరుతో బెదిరింపులకు పాల్పడుతూ విచ్చలవిడిగా దోపిడీ చేయడంపై క్రీడాకారులు, క్రీడా సంఘాలు బహిరంగంగానే విమర్శిస్తున్నాయి.జీవో–4 సవరణపై దాటవేత సీనియర్ నేషనల్స్‌లో ప్రతిభ చాటిన క్రీడాకారులే నేషనల్ గేమ్స్‌లో పాల్గొంటారంటూ శాప్ వింత వాదన తెరపైకి తెచ్చింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా నేషనల్ గేమ్స్‌కు ప్రాధాన్యం కలి్పంచి పోస్టుల భర్తీ అనంతరం ఆ క్లాజ్‌ను సవరించే ప్రయత్నాల్లో భాగంగా జీవో–4 మార్పుపై సమాధానం దాటవేసింది. ఇక్కడ సీనియర్ నేషనల్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏటా నిర్వహిస్తారు. కానీ, నేషనల్ గేమ్స్ మాత్రం రెండేళ్లకు ఒకసారి నిర్వహిస్తారు. కానీ, చరిత్ర చూస్తే నాలుగేళ్ల పాటు నేషనల్ గేమ్స్‌ను వాయిదా వేసిన దాఖలాలున్నాయి.అంటే, ఒక ఈవెంట్లో పతకం సాధించిన వ్యక్తి నాలుగేళ్లు ఆ పతకంతో కొనసాగితే.. సీనియర్ నేషనల్స్‌లో ఏటా పతకాలు సాధిస్తున్న వ్యక్తులు మారిపోతుంటారు. అంటే, ఇక్కడ ప్రతిభ ఎప్పుడూ ఒకరి దగ్గరే ఉండదు. ఈ క్రమంలో నేషనల్ గేమ్స్‌కు ప్రాధాన్యాన్ని తెరపైకి తెచ్చి యువ అర్హులైన క్రీడాకారులకు అన్యాయం చేశారు. పైగా నేషనల్ గేమ్స్ ఆధారంగా జాతీయ జట్టును ఎంపిక చేయనప్పుడు ఎలా ప్రాధాన్యత ఇస్తారో శాప్ చెప్పకపోవడం గమనార్హం. నాన్ లోకల్ కోటాతో తమకు అన్యాయం చేశారని అభ్యర్థులు కోర్టులో వేసిన కేసులు విచారణ దశలో ఉంటే.. శాప్ మాత్రం గతంలో నాన్‌లోకల్ కోటా కింద దాఖలైన పిటిషన్లను కోర్టులు కొట్టేసినట్టు పేర్కొనడం గమనార్హం. -
డీఎస్సీలో ‘డీల్స్’!
డీఎస్సీలో స్థానికంగా మెరిట్ అభ్యర్థులను పక్కన పెట్టి.. నాన్–లోకల్ కోటాలో బయట జిల్లా వ్యక్తికి ఉద్యోగం ఇచ్చేశారు. నాన్ లోకల్లో పోటీపడే వారు స్థానికుల కంటే మెరిట్ జాబితాలో అగ్రస్థానంలో ఉండాలి. కానీ, సదరు ఉద్యోగి స్థానికుల కంటే రెండు స్థానాలు దిగువన ఉన్నప్పటికీ రాయలసీమ జిల్లాలో నాన్‌లోకల్ కోటాలో పోస్టు కట్టబెట్టేశారు. ఈ విషయం పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులకు తెలిసినా మిన్నకుండిపోయారు. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో డీఎస్సీ–2025 పోస్టుల భర్తీలో అవినీతి, అక్రమాల దందా రాజ్యమేలింది. అర్హులకు తీవ్ర అన్యాయం చేస్తూ... నకిలీ ధ్రువపత్రాలతో అనర్హులకు చంద్రబాబు సర్కార్ ఉద్యోగాలు కట్టబెట్టినట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ‘ముఖ్య’నేతకు బంధువుగా చెప్పుకుంటూ క్రీడాశాఖలో కీలక పదవిని అనుభవిస్తున్న వ్యక్తి ఈ వసూళ్ల దందాలో మాస్టర్ మైండ్‌గా వ్యవహరించినట్లు చెబుతున్నారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం కొందరు అభ్యర్థులతో డీల్ కుదుర్చుకుని ఒక్కొక్కరి నుంచి పోస్టును బట్టి రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. మొత్తం రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు దండుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే జీవోలో అప్రాధాన్య నేషనల్ గేమ్స్‌ను చేర్చారని స్పష్టం చేస్తున్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ కంటే ముందే వ్యూహాత్మకంగా క్రీడా విధానం (స్పోర్ట్స్ పాలసీ) 2024–25 ప్రకటించి ఉపాధ్యాయ పోస్టులను అంగట్లో సరుకులు మాదిరిగా విక్రయించినట్లు పేర్కొంటున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా 421 డీఎస్సీ పోస్టులను క్రీడా కోటాలో పరీక్ష లేకుండా భర్తీ చేయడం ఒక ఎత్తయితే.. భారీగా ముడుపులు తీసుకుని అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టడం మరో ఎత్తు. క్రీడా విధానం రూపకల్పన సమయంలో అక్రమాలకు తెర తీస్తూ జీవో నంబర్ 4లో స్పోర్ట్స్ ప్రాధాన్యతలను ఇవ్వడం.. డీఎస్సీ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇప్పుడు ఆ ప్రాధాన్యతలను మార్పు చేస్తుండటం తీవ్ర చర్చనీయాంశమైంది. తమ జీవితాలతో చంద్రబాబు సర్కారు గేమ్స్ ఆడిందని అభ్యర్థులు వాపోతున్నారు. సీబీఐతో విచారణకు డిమాండ్..కొన్ని క్రీడా సంఘాలను భయపెట్టి క్రీడాకారుల పోస్టులకు అనుగుణంగా అవసరమైన పత్రాలు రూపొందించడంలో మాస్టర్ మైండ్ చక్రం తిప్పారు. ఈ అవినీతి బాగోతాన్ని నడిపించడంలో క్రీడా ప్రాధికార సంస్థలోని ఓ డీఎస్డీవో రేయింబవళ్లు మాస్టర్‌మైండ్‌కు సహాయ సహకారాలు అందించారు. చిన్నాచితకా సర్టిఫికెట్లు ఉన్నవారికి ఉద్యోగాలు కట్టబెట్టేశారు. అందులోనూ రెండేసి డేట్ ఆఫ్ బర్త్‌లు ఉన్నా, సబ్ జూనియర్ స్థాయి నుంచి వరస క్రమంలో సర్టిఫికెట్లు లేకున్నా పోస్టులు ఇచ్చేశారు. ఐదు నుంచి పది పోస్టులు మినహా చాలావరకు క్రీడా కోటాలోనే భర్తీ చేయడం గమనార్హం. దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో సమగ్ర విచారణ చేయించి అక్రమార్కులను కఠినంగా శిక్షించాలని క్రీడాకారులు డిమాండ్ చేస్తున్నారు.ప్రతిభకు ప్రాధాన్యం ఎక్కడ?క్రీడా విధానం 2024–29లో భాగంగా క్రీడా కోటా రిజర్వేషన్లు కల్పిస్తూ చంద్రబాబు సర్కార్ జీవో 4 జారీ చేసింది. ఇందులో విచిత్రంగా సీనియర్ నేషనల్ విభాగం కంటే ‘నేషనల్ గేమ్స్’కు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఇదంతా ముందస్తు పథకం ప్రకారం చేశారు. ఫెడరేషన్ల ఆధ్వర్యంలో జరిగే సీనియర్ నేషనల్స్ సర్టిఫికెట్‌కు అత్యధిక ప్రాధాన్యం ఉంటుంది. జాతీయ జట్టు ఎంపికలు సైతం వాటి ఆధారంగానే చేస్తారు. రెండేళ్లకు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహించే ‘నేషనల్ గేమ్స్’ను పెద్దగా ఎవరూ పరిగణనలోకి తీసుకోరు. జాతీయ జట్ల ఎంపికలతో వీటికి సంబంధం ఉండదు. ఇందులో చాలా రాష్ట్రాలు తమ ప్రాతినిధ్యాన్ని సైతం పెద్దగా ప్రోత్సహించవు. అలాంటి ‘నేషనల్ గేమ్స్’ను చంద్రబాబు సర్కారు జీవో 4లో ప్రాధాన్యంగా పెట్టి డీఎస్సీ క్రీడా కోటాలో అక్రమాలకు తెర తీసింది. డీఎస్సీ నోటిఫికేషన్ కంటే ముందే క్రీడా కోటాలో పోస్టులను అమ్ముకునేందుకు ముఖ్యనేతకు బంధువుగా చెప్పుకునే ‘మాస్టర్‌మైండ్’ పక్కా స్కెచ్ వేశారు. కేవలం పోస్టులు అమ్ముకోవడం కోసమే జీవో 4లో నేషనల్ గేమ్స్‌ను చేర్చి.. వసూళ్ల దందా పూర్తి కావడంతో ఆ జీవోను సవరించి చేతులు దులుపుకొనే యత్నం చేస్తున్నట్టు సమాచారం.హైకోర్టు ఆదేశాలు బేఖాతర్...⇒ చంద్రబాబు సర్కారు జారీ చేసిన డీఎస్సీ–2025 నోటిఫికేషన్‌కు సంబంధించి పలు న్యాయవివాదాలు రేకెత్తాయి. డీఎస్సీ ప్రక్రియలో పలు లోపాలు ఉన్నాయని, పోస్టుల భర్తీలో తప్పులు దొర్లాయని పెద్ద ఎత్తున అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో డీఎస్సీపై 104కుపైగా కేసులు దాఖలయ్యాయి. రిజర్వేషన్లు అమలు, స్పోర్ట్స్ కోటాతో పాటు దరఖాస్తు దశలోనే పోస్టుల ప్రాధాన్యం తీసుకోవడం లాంటి వాటిల్లో తమకు అన్యాయం జరిగిందని కోర్టుకు ఫిర్యాదు చేశారు. కీలకమైన పోస్టుల ప్రాధాన్యంపై అప్పట్లో హైకోర్టు స్పందిస్తూ ప్రతిభ గల అభ్యర్థులు నష్టపోకుండా ఉన్నతమైన ఉద్యోగం పొందడం వారి హక్కు అని తీర్పునిచ్చింది. అయితే, ఆ తీర్పు ఇచ్చిన రోజే.. ఆర్డర్ కాపీ రాకుండా హడావుడిగా ఫలితాలను ప్రకటించి చంద్రబాబు సర్కారు పోస్టులను భర్తీ చేసింది. కాగా ‘మాస్టర్‌మైండ్’కు చెందిన ఓ అసోసియేషన్ నుంచి సర్టిఫికెట్లు పొందిన వారికి తగిన అర్హతలు లేకున్నా టీచర్ పోస్టులు కట్టబెట్టేశారు. అనంతరం ఆ మాస్టర్‌మైండ్ సన్మానం కూడా చేయించుకున్నారు. అయితే ఆ నియామక పత్రాలు ఇచ్చేలోగా ప్రతిభ గల కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో వెనక్కి తగ్గారు.⇒ విజయనగరం జిల్లాకు చెందిన ఓ వెయిట్ లిఫ్టర్ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పోస్టల్ శాఖలో క్రీడా కోటాలో ఉద్యోగానికి అనర్హురాలిగా తేలింది. తప్పుడు జనన ధ్రువీకరణ పత్రాలతో మోసగించేందుకు యత్నించినట్లు గుర్తించడంతో విజయనగరం జిల్లాలో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే అనూహ్యంగా ఆమె ఏపీ డీఎస్సీ–2025లో క్రీడా కోటాలో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా ఎంపికైంది. దీనిపై సామాజిక కార్యకర్తలు ‘శాప్’కు సైతం ఫిర్యాదు చేశారు.⇒ విజయనగరానికి చెందిన మరో క్రీడాకారుడు జాతీయ స్థాయిలో అద్భుత ప్రతిభ కనబరిచి పతకాలు పొందారు. ఏపీ డీఎస్సీలో క్రీడా కోటాలో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంటే నిర్ద్వందంగా తిరస్కరించారు. ఆ తర్వాత ఆయన పోస్టల్ శాఖలో అదే క్రీడా కోటాలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పొందారు. -
క్రీడాకారులకు ఎంఎల్ఆర్ఐటీ చేయూత
సాక్షి, హైదరాబాద్: జాతీయ, అంతర్జాతీయ వేదికలపై రాష్ట్ర, దేశ ప్రతిష్టను ఇనుమడింపజేస్తున్న క్రీడాకారులకు తమ వంతుగా చేయూత ఇస్తున్నామని మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఎల్ఆర్ఐటీ) విద్యా సంస్థ తెలిపింది. రెండుసార్లు ప్రపంచ చాంపియన్, తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్‌తో సహా ఇప్పటి వరకు 146 మంది ప్రతిభావంతులైన క్రీడాకారులకు స్పోర్ట్స్ కోటా కింద బీటెక్, ఎంబీఏ, ఎంటెక్ కోర్సులలో పూర్తిగా ఉచిత విద్య అందించినట్టు ఎంఎల్ఆర్ఐటీ కార్యదర్శి మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ‘యువ క్రీడాకారుల ప్రతిభను ప్రోత్సహించడానికి, వారికి ఉన్నత విద్యలో అవకాశాలు అందించడానికి 2017–18లో ఈ ఉచిత ప్రవేశాలు ప్రారంభించాం. చదువు, క్రీడల మధ్య సరైన సమతుల్యత పాటిస్తూ, అర్హులైన విద్యార్థులు రెండు రంగాల్లోనూ రాణించేలా చూడటమే మా లక్ష్యం’ అని రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. గతంలో నిఖత్‌కు ఐదు లక్షల రూపాయల స్కాలర్షిప్ అందించామని, భవిష్యత్‌లోనూ మరింత మంది క్రీడాకారులకు ఉచిత విద్య, స్కాలర్షిప్ అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. -
అగ్రిసెట్ ద్వారా స్పోర్ట్స్ కోటా, మిగిలిన సీట్ల భర్తీకి కౌన్సెలింగ్
గుంటూరు రూరల్: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల్లో అగ్రిసెట్ 2024 ర్యాంకు ద్వారా బీఎస్సీ అగ్రికల్చర్ ప్రవేశాలకు మిగిలిన సీట్ల భర్తీకి, స్పోర్ట్స్ కోటాలో సీట్ల భర్తీకి ఫైనల్ మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని రిజిస్ట్రేషన్ డాక్టర్ రామచంద్రరావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 7వ తేదీ ఉదయం 10 గంటల నుంచి లాంఫాంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామన్నారు. వివరాలకు ఏఎన్జీఆర్ఏయూ.ఏసీ.ఇన్ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. -
ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా 3 శాతానికి పెంపు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెస్తున్న కొత్త ‘స్పోర్ట్స్ పాలసీ’ అన్నిరాష్ట్రాల కంటే మిన్నగా ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్ర సచివాలయంలో సోమవారం సీఎం అధ్యక్షతన నూతన స్పోర్ట్స్ పాలసీపై సమీక్ష నిర్వహించారు. చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని క్రీడా కేంద్రంగా మార్చేందుకు స్పోర్ట్స్ ఫర్ ఆల్, నర్చర్ టాలెంట్, స్పోర్ట్స్ ఎకో సిస్టం, గ్లోబల్ విజిబిలిటీ ప్రాతిపదికగా పాలసీని రూపొందించామన్నారు. గ్రామస్థాయి నుంచి క్రీడల ప్రోత్సాహకానికి ప్రణా ళిక పొందుపరిచినట్టు చెప్పారు. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉద్యోగాల్లో ఉన్న క్రీడా కోటా రిజర్వేషన్ 2 నుంచి 3 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. శాప్‌లో గ్రేడ్–3 కోచ్‌ల కోసం ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించిన వారికి 50 శాతం రిజర్వేషన్ కల్పించనున్నట్టు ప్రకటించారు. ఒలింపిక్స్ విజేతలకు భారీ ప్రోత్సాహకాలుఒలింపిక్స్లో బంగారు పతకానికి ప్రస్తుతం రూ.75 లక్షలు ఇస్తుండగా, ఇకపై రూ.7 కోట్లు ఇవ్వాలని నిర్ణయించినట్టు సీఎం ప్రకటించారు. రజత పతకానికి రూ.50 లక్షలు నుంచి రూ.5 కోట్లు, కాంస్యానికి రూ.30 లక్షల నుంచి రూ.3 కోట్లు, పాల్గొన్న వారికి రూ.50 లక్షల చొప్పున ప్రోత్సాహకం ఇవ్వాలని ఆదేశించారు. ఏషియన్ గేమ్స్ బంగారు çపతకానికి రూ.4 కోట్లు, రజత పతకానికి రూ.2 కోట్లు, కాంస్య పతకానికి రూ.కోటి, పాల్గొన్న వారికి రూ.10 లక్షల ప్రోత్సాహకం ఇవ్వాలన్నారు. వరల్డ్ ఛాంపియన్షిప్, వరల్డ్ కప్ పోటీల్లో బంగారు పతకం సాధించిన వారికి రూ.50 లక్షలు, రజతానికి రూ.35 లక్షలు, కాంస్యానికి రూ.25 లక్షలు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. నేషనల్ గేమ్స్‌లో బంగారు పతకం సాధించిన వారికి రూ.10 లక్షలు, రజతానికి రూ.5 లక్షలు, కాంస్య పతకానికి రూ.3 లక్షలు ఇవ్వాలన్నారు. ఖేలో ఇండియా గేమ్స్, నేషనల్ స్కూల్ గేమ్స్‌లో బంగారు పతకం సాధించిన వారికి రూ.2.50 లక్షలు, రజత పతకం సాధించిన వారికి రూ.2 లక్షలు, కాంస్యం సాధించిన వారికి రూ.లక్ష చొప్పున ప్రోత్సాహకం చెల్లించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు, అధికారులు పాల్గొన్నారు.సాగు ఖర్చులు తగ్గాలిసాగును మరింత ప్రోత్సహించేందుకు అవసరమైనన్ని నూతన విధానాలను రాష్ట్రంలో అమలు చేయాలని సీఎం చంద్రబాబు వ్యవసాయశాఖ అధికారులకు సూచించారు. సాంకేతికతను వినియోగించి రైతులకు సాగు ఖర్చులు గణనీయంగా తగ్గించవచ్చని చెప్పా రు. ఆయన సోమవారం వ్యవసాయశాఖపై సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ రాను న్న రోజుల్లో ప్రకృతి వ్యవసాయం గేం చేంజర్ అవుతుందని చెప్పారు. ప్రకృతి సేద్యంలో ఏపీ పయనీర్‌గా నిలవాలన్నారు. పంట ల సాగులో డ్రోన్ల వాడకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలన్నారు. కేబినెట్ సబ్ కమి టీ సూచనల ప్రకారం ఈ రబీ నుంచి పాత పద్ధతిలో పంటల బీమాను అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. జూలైలో జరిగిన పంట నష్టానికి రూ.37 కోట్లు రైతులకు పరి హారం కింద చెల్లించేందుకు సీఎం అంగీకా రం తెలిపారు. మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. -
హైకోర్టు ఆదేశాలా.. అయితే మాకేంటి!
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు ఆదేశాలన్నా కొందరు అధికారులు లెక్కలేనట్లు వ్యవహరిస్తున్నారు. తాము ఆదేశాలిచ్చే వరకు ఫలితాలు ప్రకటించవద్దని చెప్పినా బేఖాతర్ చేశారు. ఫలితాలు వెల్లడించడమే కాదు ఏకంగా పోస్టింగ్‌లు కూడా ఇచ్చేశారు. ఇదేమని అడిగితే అసలు కోర్టు ఆదేశాలే లేవంటూ విద్యాశాఖ అధికారులు సెలవిస్తున్నారు. దీంతో టీచర్ల నియామకంలో అన్యాయం జరిగిందని కోర్టుకెక్కిన స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా 11,062 టీచర్ పోస్టుల భర్తీ కోసం 2024, ఫిబ్రవరి 29న ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. వీటిలో స్పోర్ట్స్ కోటాకు సంబంధించి 2018లో ప్రభుత్వం జీవో 107ను విడుదల చేసింది. దీని ప్రకారం ఫామ్–1.. ఇంటర్నేషనల్ గేమ్స్, ఫామ్–2.. నేషనల్ గేమ్స్(అసోసియేషన్), ఫామ్–3.. నేషనల్ గేమ్స్(యూనివర్సిటీ లెవెల్), ఫామ్–4.. నేషనల్ గేమ్స్(సూ్కల్/స్టేట్ లెవెల్)గా పరిగణిస్తారు. ఆయా ఆటల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు నియామకాల్లో సంబంధిత ఫామ్‌లను సమరి్పంచాల్సి ఉంటుంది. దీన్ని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్) పరిశీలించి డైరెక్టరేట్‌కు పంపిస్తుంది. ప్రాధాన్యత ఆధారంగా స్పోర్ట్ కోటాలో వీరిని భర్తీ చేశారు. అయితే తాజా డీఎస్సీలో ఫామ్–1, ఫామ్–2 ఉన్న అభ్యర్థులకు మాత్రమే కొన్ని జిల్లాల్లో పోస్టింగ్ ఇవ్వగా.. మరికొన్ని జిల్లాల్లో ఫామ్–3, ఫామ్–4 వారికి కూడా ఇచ్చారని, ఫామ్–3, ఫామ్–4 ఉన్నా తమకు ఇవ్వలేదనేది బాధితుల ప్రధాన ఆరోపణ. ఇంకొందరు రాష్ట్రస్థాయి క్రీడాకారులే అయినా జాతీయ స్థాయి ఫామ్ అందజేశారని.. శాట్ పరిశీలించకుండానే డైరెక్టరేట్‌కు అందజేయడంతో అలాంటి వారు కూడా ఉద్యోగాలు పొందారని అంటున్నారు. టీచర్ పోస్టులకు సంబంధించి శాట్‌కు దాదాపు 390 దరఖాస్తులు వచ్చాయి. వీటిని సమగ్రంగా పరిశీలించి నిజంగా వారు ఆయా రంగాల్లో ప్రతిభ కనబరిచారా? లేదా? అనేది చూడాలి. కానీ శాట్ వచ్చినవి వచ్చినట్లు పంపేయడంతో అవకతవకలు చోటుచేసుకున్నాయని వారు చెబుతున్నారు. నవంబర్ 21 వరకు..జీవో సరిగా లేదంటూ నల్లగొండ జిల్లా కేతేపల్లికి చెందిన ఆర్.రమేశ్‌తోపాటు మరో 9 మంది హైకోర్టును ఆశ్రయించగా.. జస్టిస్ పుల్ల కార్తీక్ ధర్మాసనం వీరి పిటిషన్‌పై సెపె్టంబర్ 25న విచారణ చేపట్టింది. ఎస్జీటీ పోస్టుల భర్తీకి పిటిషనర్ల నుంచి సరి్టఫికెట్లన్నీ తీసుకుని పరిశీలించాలని, తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు పిటిషనర్ల ఫలితాలు వెల్లడించవద్దని ఆదేశించింది. తదుపరి విచారణ నవంబర్ 21కి వాయిదా వేసింది. అయినా ఈలోపే ఫలితాలు వెల్లడించారు. పిటిషనర్లలో ఒక్కరు మాత్రమే ఎంపికైనట్లు ప్రకటించి ఉద్యోగం ఇచ్చారు.ఎలాంటి జీవో లేకుండా..ప్రభుత్వంగానీ, శాట్గానీ, నియామక డైరెక్టరేట్గానీ ఫామ్–1, ఫామ్–2 ఉన్న వాళ్లకే స్పోర్ట్స్ కోటా కింద పోస్టింగ్‌లు ఇస్తామని చెప్పలేదు. ఎలాంటి జీవో ఇవ్వలేదు. ప్రాధాన్యత ఆధారంగా మొదట ఫామ్–1 వారికి.. లేకుంటే ఫామ్–2 వారికి.. లేకుంటే ఫామ్–3 వారికి.. లేకుంటే ఫామ్–4 వారికి ఉద్యోగం ఇవ్వాలి. మాకు హైకోర్టు ఉత్తర్వులిచి్చనా వాటిని డైరెక్టరేట్ పాటించలేదు. నల్లగొండ జిల్లాలో స్పోర్ట్స్ కోటాలో లేరంటూ ఆ పోస్టులు జనరల్ అభ్యర్థులకు ఇచ్చారు. – ఆర్.రమేశ్, బాధితుడుఇదెక్కడి న్యాయం... ఎంసెట్ లాంటి వాటికే స్పోర్ట్స్ సర్టిఫికెట్లను ఫిజికల్‌గా తనిఖీ చేస్తున్నప్పుడు.. పోస్టింగ్‌లకు దాన్ని ఎందుకు అమలు చేయరు? ఆన్లైన్లో ఎవరు ఏది పెడితే అది పంపిస్తారా? స్కూల్ అసిస్టెంట్‌ను గ్రూప్–1 స్థాయిగా, ఎస్జీటీని గ్రూప్–2 స్థాయి పోస్టులుగా ప్రభుత్వం పేర్కొంటోంది. మరి ఇంత ప్రాధాన్యమున్న ఉద్యోగాల భర్తీలో పారదర్శకత ఏదీ? ప్రభుత్వం బాధితులతో మాట్లాడి పరిష్కారం చూపాలి. – కృష్ణమూర్తి, బాధితుడు శాట్ పరిశీలన ప్రకారమే.. స్పోర్ట్స్ అథారిటీ ఫైనల్ చేసిన తర్వాతే మేం నిర్ణయం తీసుకుంటాం. 393 దరఖాస్తులను పంపిస్తే శాట్ పరిశీలన చేసి 35 మంది అర్హులను మాకు పంపారు. ఫామ్–1, ఫామ్–2 వారికి అవకాశం ఇచ్చారు. ఇద్దరు నాన్ లోకల్, 33 మంది లోకల్ వారికి పోస్టింగ్‌లు వచ్చాయి. ఇతరులు కూడా తమకు అర్హత ఉందని చెబుతున్నారు. అనుమానం ఉంటే మరోసారి అప్లికేషన్లు ఇస్తే శాట్‌కు పంపించి పరిష్కరిస్తాం. హైకోర్టు నుంచి మాకు ఎలాంటి ఆదేశాల్లేవు. పోస్టింగ్‌లు ఇచ్చాక ఇప్పుడు చేసేదేం లేదు. – డైరెక్టర్, పాఠశాల విద్య -
మద్రాస్ ఐఐటీలో స్పోర్ట్స్ కోటా
న్యూఢిల్లీ: అండర్గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు తొలిసారిగా స్పోర్ట్స్ కోటాను ప్రవేశపెట్టిన ఐఐటీగా మద్రాస్ ఐఐటీ నిలిచింది. 2024–25 అకడమిక్ సెషన్ నుంచి ప్రతి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులో అదనంగా రెండు సీట్లను ఇందుకోసం సృష్టించాలని నిర్ణయించినట్లు ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వి.కామకోటి తెలిపారు. స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అడ్మిషన్(ఎస్ఈఏ) ప్రోగ్రాం కింద సృష్టించిన ఈ రెండు సీట్లలో భారతీయ విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తామని చెప్పారు. ఇందులో ఒకటి విద్యార్థినులకు రిజర్వు చేస్తామన్నారు. ఐఐటీల్లో ప్రస్తుతం స్పోర్ట్స్ కోటా లేదు. -
ఆశగా ఆటగాళ్లు..! తెలంగాణలో ఉద్యోగాల భర్తీలో స్పోర్ట్స్ కోటా అమలు
ఖమ్మం స్పోర్ట్స్: చాన్నాళ్ల తర్వాత ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. ఈక్రమంలో రెండు శాతం స్పోర్ట్స్ కోటా అమలుచేయడమే కాక, ఎలాంటి నిబంధనలు లేకుండా, ఎప్పుడు సాధించిన సర్టిఫికెట్లనైనా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉండడంతో జిల్లా క్రీడాకారుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా విద్యా, ఉద్యోగ రంగాల్లో స్పోర్ట్స్ కోటా అమలుచేయాలని క్రీడా రంగ ప్రతినిధులు పోరాటాలు చేశారు. ఈనేపథ్యాన ఉమ్మడి రాష్ట్రంలో విడుదల చేసిన జీఓను ఈసారి నోటిఫికేషన్లలో అమలుచేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఉద్యోగాల పోటీ పరీక్షల్లో సత్తా చాటేందుకు నిరుద్యోగులు క్రీడాకారులు సిద్ధమవుతున్నారు. చదవండి👉 తెలంగాణలో ఇంటర్ పరీక్షలు.. ప్రిన్సిపల్ సంతకం లేకున్నా.. తొలిసారిగా 2012లో... క్రీడాకారులు, క్రీడాసంఘాల పోరాట ఫలితంగా తొలిసారిగా 2012లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 84 జీఓ విడుదల చేశారు. ఈ జీఓ ఆధారంగా అన్ని ఉద్యోగ ఖాళీల భర్తీలో రెండు శాతం స్పోర్ట్స్ కోటా అమలుకు అవకాశం దక్కింది. ఇదే జీఓను ఇప్పుడు అమలుచేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం విశేషం. సీనియర్స్, జూనియర్స్, సబ్ జూనియర్, ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ, అండర్ – 14, 17, 19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీల్లో ఆడి సర్టిఫికెట్లు పొందిన క్రీడాకారుల ఈ కోటా ద్వారా అవకాశం దక్కనుండడంతో ఉద్యోగం సాధించాలనే తపనతో చదువులో నిమగ్నమయ్యారు. నిబంధనలు లేకుండా... రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలవుతుండగా, స్పోర్ట్స్ కోటా అమలుచేయనున్న ప్రభుత్వం ఈసారి మాత్రం మూడేళ్ల నిబంధన లేకుండా అన్ని సర్టిఫికెట్లను పరిగణనలోకి తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. ఏదైనా జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో సాధించిన సర్టిఫికెట్ మూడేళ్ల వరకు అమల్లో ఉంటుందని గతంలో ప్రకటించారు. కానీ ఈసారి పలు ఉద్యోగాలకు వయస్సు నిబంధనలు సడలించినందున స్పోర్ట్స్ కోటా అమలులోనూ ఎప్పటి సర్టిఫికెట్లనైనా పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. దీంతో చాన్నాళ్ల క్రితం సర్టిఫికెట్లు సాధించి, ఇప్పటికీ ఉద్యోగాలు రాని అభ్యర్థులు మేలు చేకూరుతుందని చెబుతున్నారు. అయితే, అత్యధిక సర్టిఫికెట్లు కలిగిన వారికి తొలి ప్రాధాన్యత ఇచ్చే అవకాశమున్నట్లు తెలిసింది. చదవండి👉🏻 దిమాక్ దొబ్బిందా!.. త్రిబుల్ రైడింగ్.. ఆపై మద్యం కూడా.. ఖేలో ఇండియా ఎలా? నాలుగేళ్ల నుంచి దేశంలో ఖేలో ఇండియా పేరిట ఏటా జాతీయస్థాయి క్రీడాపోటీలు నిర్వహిస్తున్నారు. అయితే, ఈ పోటీల్లో పాల్గొని సర్టిఫికెట్లు సాధించిన వారికి కూడా స్పోర్ట్స్ కోటా అమలవుతుందా, లేదా అనే విషయమై ఇంకా స్పష్టత రావడం లేదు. దీనికి తోడు ఐదారేళ్లలో కొత్తగా పుట్టుకొచ్చిన క్రీడల పరిస్థితి ఏమిటన్నది కూడా తెలియరావడం లేదు. కొన్ని క్రీడాంశాల్లో జిల్లా నుంచే నేరుగా అంతర్జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశముండడంతో ఆయా క్రీడాకారులకు అవకాశం ఇచ్చేది, లేనిది ఇంకా వెల్లడించలేదు. ఈ అంశంపై ప్రత్యేక కమిటీ నియమించాలని క్రీడావర్గాలు కోరుతున్నాయి. ఇది మంచి పరిణామం ఎన్నో ఏళ్లనుంచి స్పోర్ట్స్ కోటాను అన్ని ఉద్యోగాల్లో అమలు చేయాలని పోరాడుతున్నాం. ఇందులో భాగంగా రాష్ట్రప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో స్పోర్ట్స్ కోటా అమలుకు నిర్ణయించడం మంచి పరిణామం. ఇక నుంచి అన్ని నోటిఫికేషన్లలో అమలుచేస్తే బాగుంటుంది. – పుట్టా శంకరయ్య, ఆర్చరీ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి క్రీడాకారులకు ప్రోత్సాహం క్రీడాకారులను ప్రోత్సహించేలా స్పోర్ట్స్ కోటాను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో అమలు చేయడం బాగుంది. ఇప్పటి వరకు కొన్ని శాఖల్లో మాత్రమే నేరుగా స్పోర్ట్స్ కోటా ద్వారా ఉద్యోగాకాశాలు లభిస్తున్నాయి. ఈసారి అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి అవకాశం కల్పించడం ఆనందంగా ఉంది. – కె.ఆదర్శ్‌కుమార్, జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి యువకులకే అవకాశం ఇవ్వాలి రాష్ట్రప్రభుత్వం స్పోర్ట్స్ కోటా ద్వారా యువ క్రీడాకారులకే ఉద్యోగావకాశాలు కల్పిస్తే బాగుంటుంది. ఏది ఏమైనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. రాష్ట్రంలోని యువత క్రీడలపై దృష్టి సారించేందుకు ఇది ఉపయోగపడుతుంది. మరింత మంది ఉత్తమ క్రీడాకారులు వెలుగులోకి వస్తారు. – జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షలు, మందుల వెంకటేశ్వర్లు ఉద్యోగం సాధిస్తాననే నమ్మకముంది ఉద్యోగాల భర్తీలో రాష్ట్రప్రభుత్వం స్పోర్ట్స్ కోటా అమలుచేయాలని నిర్ణయించడంపై సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు. ఇప్పటి వరకు జాతీయస్థాయి పోటీల్లో సాధించిన సర్టిఫికెట్లు పనికి రాకుండా పోతాయమోనని ఆవేదన చెందాను. కానీ ప్రభుత్వం నిర్ణయంతో ఈసారి ఉద్యోగం సాధిస్తాననే నమ్మకం వచ్చింది. – ఎం.జైనాద్ బేగ్ -
తెలంగాణలో 172 జూనియర్ పంచాయతీ సెక్రటరీ పోస్టులు
తెలంగాణ ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్‌లోని పంచాయతీ రాజ్, గ్రామీణ ఉపాధి కమీషనర్ కార్యాలయం.. స్పోర్ట్స్ కోటా కింద రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ పంచాయతీ సెక్రటరీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ► పోస్టులు: జూనియర్ పంచాయతీ సెక్రటరీలు ► మొత్తం పోస్టుల సంఖ్య: 172 ► అర్హత: డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.స్పోర్ట్స్ కోటా అర్హత సాధించి ఉండాలి. ► వయసు: 18 ఏళ్ల నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీలకు ఐదేళ్లు, ఎక్స్ సర్వీస్మెన్లకు మూడేళ్లు, పీహెచ్ అభ్యర్థులకు పదేళ్లు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. ► జీత భత్యాలు: నెలకు రూ.28,719 వేతనం అందిస్తారు. ► ఎంపిక విధానం: రాత పరీక్షతోపాటు క్రీడలకు సంబంధించిన సర్టిఫికెట్ల ఆధారంగా ఎంపిక జరుగుతుంది. రాత పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్ 1లో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ, కల్చర్, తెలంగాణ హిస్టరీ నుంచి 100 మార్కులకు 100 ప్రశ్నలు ఉంటాయి. అలాగే పేపర్2లో తెలంగాణ పంచాయతీ రాజ్ యాక్ట్ 2018,రూరల్ డవలప్మెంట్ ప్రోగ్రామ్స్, ఇతర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై 100 మార్కులకు 100ప్రశ్నలు అడుగుతారు.ప్రతి పేపర్లో కనీసం 35మార్కులు సాధించాల్సి ఉంటుంది.ప్రశ్న పత్రం తెలుగు,ఇంగ్లిష్, ఉర్దూల్లో ఉంటుంది. (ఐటీ నిరుద్యోగులకు శుభవార్త.. భారీగా ఉద్యోగాలు!) ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 08.10.2021 ► వెబ్సైట్: https://epanchayat.telangana.gov.in/cs -
స్పోర్ట్స్ కోటా అమలుపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: వృత్తివిద్యా కోర్సుల ప్రవేశాల్లో స్పోర్ట్స్ కోటా అమలుపై ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సి. పార్థసారథి శనివారం ఉత్త ర్వులు జారీ చేశారు. ఈ కమిటీకి చైర్మన్‌గా సాట్స్ వీసీఎండీ నియమితులయ్యారు. సభ్యులుగా ఉన్న త విద్యామండలి ప్రతినిధి, జేఎన్టీయూ, కాళోజీ వర్సిటీ, ప్రొఫెసర్ జయశంకర్ వర్సిటీల రిజిస్ట్రార్ లేదా వర్సిటీ నియమించిన ప్రతినిధులు, తెలంగాణ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి, ఉస్మానియా యూనివర్సిటీ స్పోర్ట్స్ డైరెక్టర్లను నియమించింది. -
పోలీసు నియామకాల్లో ‘స్పోర్ట్స్ కోటా’ గందరగోళం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీసు నియామకాల్లో ఎమ్మెస్పీ (మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్) కోటాలో గందరగోళం నెలకొంది. ఈ కోటా ప్రకారం జాతీయ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్)కు ఆడినవారు ఎమ్మెస్పీ అర్హులు. ఇదే విషయాన్ని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) నోటిఫికేషన్లోనూ పేర్కొంది. కానీ, అమలు విషయం లో పోలీసు ఉన్నతాధికారుల్లోనే సమన్వయం కొరవడిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వీరందరినీ ఎమ్మెస్పీ కోటా కింద అనుమతించాలి. కానీ, ఒక్కో జిల్లాలో అధికారులు ఒక్కోలా వ్యవహరించడంతో స్పోర్ట్స్ కోటా కింద జాబ్ ఆశించే అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. దీంతో తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకునేందుకు అభ్యర్థులు డీజీపీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. అభ్యర్థులు ఏమంటున్నారంటే.. సంగారెడ్డి జిల్లా కోహిర్‌కు చెందిన విజయలక్ష్మి.. ఛత్తీస్‌గఢ్‌లో 59వ నేషనల్ స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సాఫ్ట్‌బాల్ పోటీల్లో పాల్గొంది. ఎమ్మెస్పీ కోటాకు అర్హత ఉంది. కానీ, ఈమెకు పోలీసు కానిస్టేబుల్ సర్టిఫికెట్ వెరిఫికేషన్‌లో ఎమ్మెస్పీ విభాగం కింద అధికారులు అనుమతించలేదు. కానీ, ఆమెతోపాటు ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన ఆటల్లో పాల్గొన్న వారికి ఇతర జిల్లాల్లో ఎమ్మెస్పీ రిజర్వేషన్ కింద అనుమతి లభించింది. సూర్యాపేట జిల్లా కల్లూరుకు చెందిన విజయ్‌కుమార్.. స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన క్రికెట్ పోటీల్లో తెలంగాణ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. ఇతనికి సర్టిఫికెట్ వెరిఫికేషన్‌లో ఎమ్మెస్పీ కోటా కింద అనుమతించలేదు. ఇతడి తర్వాత సర్టిఫికెట్ వెరికేషన్‌కు హాజరైన అభ్యర్థులను ఎమ్మెస్పీ కోటాలో అనుమతించారని వాపోతున్నాడు. ఇలాంటి బాధిత అభ్యర్థులు ప్రతీ జిల్లాకు ఉన్నారు. ప్రతీ 100 పోస్టులకు 2 సీట్లు ఎమ్మెస్పీ కోటా కింద భర్తీ చేస్తారు. రాష్ట్రం తరఫున జాతీయ పోటీల్లో పాల్గొన్న ఆశావహులంతా ఇప్పుడు అధికారుల తీరుతో నీరుగారిపోతున్నారు. జీవో 74 ఏం చెబుతోంది? క్రీడా విధానం, ఎమ్మెస్పీ కోటాకు సంబంధించి విధివిధానాలను రూపొందిస్తూ 2012లో జీవో నం 74ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది. దీని ప్రకారం స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి స్కూల్ క్రీడల్లో పాల్గొన్న విద్యార్థులకు 2 శాతం కోటా అమలు చేయాలి. ఫుట్‌బాల్, హాకీ, వాలీబాల్, హ్యాండ్‌బాల్, బాస్కెట్ బాల్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, బాడ్మింటన్, కబడ్డీ, అథ్లెటిక్స్, స్విమ్మింగ్, జిమ్నాస్టిక్స్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్, బాక్సింగ్, సైక్లింగ్, రోయింగ్, షూటింగ్, ఫెన్సింగ్, రోలర్ స్కేటింగ్, సెయిలింగ్/యాట్చింగ్, ఆర్చరీ, క్రికెట్, చెస్, ఖో–ఖో, జుడో, టైక్వాండో, సాఫ్ట్‌బాల్, బాడీ బిల్డింగ్ మొత్తం 29 క్రీడలకు ఇందులో చోటు కల్పించారు. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక సంస్థ (టీఎస్ఎల్పీఆర్బీ) ఎమ్మెస్పీ కోటా కింద కూడా ఇవే 29 క్రీడాంశాలను పరిగణనలోకి తీసుకుంటామని గతేడాది పోలీసు నియామకాల సందర్భంగా విడుదల చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది. కానీ, ఇప్పుడు అది పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని అభ్యర్థులు గగ్గోలు పెడుతున్నారు. ముమ్మాటికీ సమన్వయ లోపమే.. వాస్తవానికి మా వద్ద నుంచి జాతీయ స్థాయికి ప్రాతినిధ్యం వహించాలంటే చాలా దశలుంటాయి. స్కూలు హెడ్మాస్టర్, పీఈటీ ఆమోదం, జిల్లా అధికారుల ఆమోదం పొందాక మేం కూడా అనుమతించాలి. ఇంత ప్రక్రియ తర్వాత వారు జాతీయ స్థాయిలో ఆడతారు. ఈ వివరాలన్నీ వెబ్స్డైట్లలో ఉంటాయి. నిబంధనల ప్రకారం ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన టోర్నీలో అండర్–14 నుంచి అండర్–19 వరకు పాల్గొన్నవారు ఎమ్మెస్పీ కోటాకు అర్హులు. అధికారులు ఒక చోట అనుమతించి, మరోచోట అనుమతించకపోవడం దురదృష్టకరం. రామ్‌రెడ్డి, సెక్రటరీ,స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్), తెలంగాణ -
‘క్రీడల కోటా’లో సర్కారుకు షాక్
సాక్షి, హైదరాబాద్: క్రీడల కోటా జాబితా విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది. మెడికల్, డెంటల్ కోర్సుల్లో 2018–19 విద్యా సంవత్సరానికి క్రీడల కోటా కింద ప్రవేశాల కోసం ప్రభుత్వం ఈ ఏడాది జూన్ 21న జారీ చేసిన జీవో 7ను హైకోర్టు కొట్టేసింది. వైద్య విద్యలో క్రీడల కోటా కొందరి ధనార్జనకు ఉపయోగపడుతోందని, అలాంటి కోటాను రద్దు చేస్తే క్రీడా, వైద్య రంగాలకు మేలు చేసినట్లు అవుతుందని వ్యాఖ్యానించింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రానికి పతకాలు రానప్పుడు, నైపుణ్యం ప్రదర్శించలేనప్పుడు, కొందరు వ్యక్తుల ధనార్జన కోసం క్రీడల కోటా కొనసాగించడంలో అర్థం లేదంది. సామాజిక, రాజకీయ కారణాల చేత కోటా రద్దు నిర్ణయం తీసుకోలేని పక్షంలో కనీసం ఎప్పుడూ వినని క్రీడలను జాబితా నుంచి తొలగించి క్రీడలు ఆడకుండానే లబ్ధి పొందుతున్న వ్యక్తులకు అడ్డుకట్ట వేయాలంది. తగిన మార్పులతో క్రీడల కోటాను కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తే వచ్చే విద్యా సంవత్సరం నుంచి వాటిని అమలు చేయాలని ఆదేశించింది. జీవో 334 ద్వారా ఏర్పాటు చేసిన కమిటీ లేదా మరో కమిటీని ఏర్పాటు చేసి అధ్యయం నిర్వహించి, ఆ తరువాత కోటా కొనసాగింపుపై నిర్ణయం తీసుకోవాలని తేల్చి చెప్పింది. రాష్ట్రంలో ఆడుతున్న ప్రధాన క్రీడలేంటి.. 14–18 ఏళ్ల మధ్య ఉన్న విద్యార్థులు ఎంత మంది వీటిని ఆడుతున్నారు.. ఈ క్రీడల్లో ఎన్నింటికి సంబంధిత క్రీడా సంస్థల గుర్తింపు ఉంది.. ఈ క్రీడల్లో ఎంత మంది విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రికార్డులు సాధించారు.. క్రీడల కోటా కింద వైద్య విద్యలో ప్రవేశాలు పొందిన వారిలో ఎంత మంది ఆ క్రీడల్లో కొనసాగుతున్నారు.. ఎంత మంది జాతీయ, అంతర్జాతీయ ఈవెంట్లలో పాల్గొన్నారు.. తదితర అంశాలపై అధ్యయనం నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ జె.ఉమాదేవిల ధర్మాసనం తీర్పు వెలువరించింది. జూలై 6న మధ్యంతర ఉత్తర్వులు మెడికల్, డెంటల్ కోర్సుల్లో క్రీడల కోటా కింద ఈ విద్యా సంవత్సరం సీట్ల భర్తీకి కొన్ని మార్గదర్శకాలతో ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాలు చేస్తూ టి.శ్రియా మరో నలుగురు విద్యార్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన జస్టిస్ రామసుబ్రమణియన్ నేతృత్వంలోని ధర్మాసనం.. ఈ ఏడాదికి క్రీడల కోటా కింద ప్రవేశాలు చేపట్టవద్దంటూ ఈ ఏడాది జూలై 6న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. ఆ తరువాత ఈ వ్యాజ్యంతో తుది విచారణ జరిపిన ధర్మాసనం 4 రోజుల క్రితం తీర్పు వెలువరించింది. ఎప్పుడూ వినని ఆటలకూ.. గత 25 సంవత్సరాలుగా ఏటా క్రీడల జాబితాలో మార్పులు చేస్తూ వివిధ రకాల క్రీడలను ప్రభుత్వం జాబితాలో చేరుస్తుండటాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. జాబితాలో 48 క్రీడలకు సర్కారు స్థానం కల్పించిందని, వీటిల్లో కొన్నింటి పేర్లు ఎన్నడూ వినలేదని, ఇలాంటి క్రీడలను జాబితాలో చేర్చడంలో తర్కం ఏమిటో అర్థం కావడం లేదంది. జాబితాలో ఏకపక్షం గా మార్పులు చేయడం తదనుగుణంగా ఆయా క్రీడా సంస్థలు ఇష్టమొచ్చినట్లు సర్టిఫికెట్లు జారీ చేస్తున్న విధానం ఆందోళన కలిగిస్తోందని కోర్టు పేర్కొంది. జీవో 8ని పునరుద్ధరించలేం ప్రస్తుతం జారీ చేసిన జీవో 7ను రద్దు చేసి 2015లో జారీ చేసిన జీవో 8ని పునరుద్ధరించాలని కోరుతున్నారు. జీవో 7ను రద్దు చేయడానికి ఇబ్బంది లేదు. అయితే జీవో 8ని పునరుద్ధరించడం సాధ్యం కాదు. ఒకవేళ పునరుద్ధరిస్తే తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ అధికారులు అవినీతిని పట్టించుకోనట్లవుతుంది. క్రీడల కోటా అక్రమాలపై స్పోర్ట్స్ అథారిటీ అధికారులపై ఏసీబీ అధికారులు కేసులు కూడా నమోదు చేశారు. కాబట్టి పాత జీవోను పునరుద్ధరించడం లేదు. అలాగే ఈ ఏడాది జారీ చేసిన జీవో 7ను రద్దు చేస్తున్నాం. తిరిగి ఈ మొత్తం వ్యవహారంపై అధ్యయనం అనంతరం నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నాం’అని ధర్మాసనం తీర్పులో తేల్చి చెప్పింది. షార్ట్‌కట్ అవలంబిస్తున్నారు వైద్య విద్యలో క్రీడల కోటా కింద ప్రవేశాలు కల్పించడం క్రీడలకు ఏ రకంగా ప్రోత్సాహం కల్పించినట్లు అవుతుందో ఏ మాత్రం అర్థం కావడం లేదని హైకోర్టు పేర్కొంది. ‘అంతగా ప్రతిభ లేని అభ్యర్థులు వైద్య విద్యలో ప్రవేశాల కోసం దేశంలో ఏ మూలన కూడా ఇంతవరకు వినని క్రీడలను ఎం చుకుంటున్నారు. విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం ఇలాంటి షార్ట్‌కట్ పద్ధతులు అవలంభిస్తున్న అభ్యర్థులు.. చదువు పూర్తయ్యాక కూడా ఇలాంటి పద్ధతులు అనుసరించకుండా ఉండలేరు. క్రీడల కోటాలో ప్రవేశాల నిమిత్తం ప్రభుత్వం రెండు కమిటీలను ఏర్పాటు చేయడంలో ఎంత మాత్రం తప్పులేదు. మొదటి కమిటీలో క్రీడలకు సంబంధించి వ్యక్తులు ఉంటే, రెండో కమిటీలో వర్సిటీ అధికారులు ఉన్నారు. కాబట్టి ఈ కమిటీల ఏర్పాటును తప్పుబట్టలేం’అని ధర్మాసనం స్పష్టం చేసింది. -
చింతపిక్కల ఆటను కూడా చేర్చాల్సింది
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, వైద్యం వంటి వృత్తి విద్యలకూ, క్రీడల కోటాకూ సంబంధం ఏమిటో తెలియడం లేదు. క్రీడల జాబితాలో ఆటల పేర్లు వింటే ఆశ్చర్యంగా ఉంది. చింతపిక్కల ఆటను కూడా ఆ జాబితాలో చేరిస్తే సరిపోయేది కదా.. అని హైకోర్టు వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. రాజ్యాంగంలో క్రీడల కోటా ఎక్కడా లేదని, రాజ్యాంగం ద్వారా సిద్ధించిన రిజర్వేషన్లు, ప్రభుత్వాలిచ్చే క్రీడల కోటా రిజర్వేషన్లకు సమతుల్యత ఉండాల్సిన అవసరం ఎంతో ఉందని అభిప్రాయపడింది. వృత్తి విద్యలో క్రీడల కోటా రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 7ను సవాల్ చేస్తూ శ్రీయ సహా అయిదుగురు దాఖలు చేసిన పిల్‌పై సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్ల ధర్మాసనం ఎదుట మరోసారి విచారణకు వచ్చింది. ఈ విద్యా సంవత్సరంలో క్రీడల కోటా కింద వృత్తి విద్యలో రిజర్వేషన్లు అమలు చేయరాదని గతంలో ధర్మాసనం ఇచ్చిన మధ్యంతర ఆదేశాలపై కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జీవో 7 అమలు చేయరాదని కొందరు సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ కేసుల్ని హైకోర్టులో పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు తెలిపింది. దీంతో హైకోర్టు వ్యాజ్యాలను విచారిస్తూ.. ఇంతకీ ఇందులో ప్రజాప్రయోజనం ఏముందని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. క్రీడల కోటాలో వైద్య విద్య సీటు పొందిన వ్యక్తి క్రీడల అభివృద్ధికి ఏం చేయగలరని, క్రీడలకు, వైద్య విద్యకు సంబంధం ఏమిటని ప్రశ్నించింది. ప్రభుత్వం జారీ చేసిన జాబితాలోని క్రీడల పేర్లు విన్న ధర్మాసనం.. చింత పిక్కల ఆటనూ అందులో చేర్చితే సరిపోయేదని వ్యాఖ్యానించింది. బుధవారం సమగ్రంగా విచారిస్తామని హైకోర్టు పేర్కొంది. -
ఆట.. బతుకుదెరువుకు బాట!
సాక్షి, వికారాబాద్/కుల్కచర్ల: ఇది ఒక ఊరి కథ. కథ అంటే కథ కాదు, యథార్థగా«థ. మారుమూల పల్లె యువకుల సక్సెస్ స్టోరీ. ఇరవై ఏళ్ల క్రితం మాట. పనీపాటాలేని పన్నెండు మంది యువకులు ఒక చోట చేరారు.. కాలక్షేపం కోసం ఓ ఆట ఆడడం మొదలుపెట్టారు. కాలక్రమేణా మంచి ప్రావీణ్యం సంపాదించారు. జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి క్రీడాకారులుగా గుర్తింపు సంపాదించారు. ఆ ఊరు యువకులంతా ఒకరిని చూసి మరొకరు వారి బాటే పట్టారు, ఆ ఆటే వారికి ఆరో ప్రాణమైంది. అదే వారి బతుకుదెరువుకు బాట అయింది. ఆ ఆటను ఆలంభనగా చేసుకొని ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించారు. ఒకరుకాదు, ఇద్దరు కాదు. ఇప్పటివరకు 210 మంది యువకులు పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. వాలీబాల్ ఆట ఆ గ్రామ ముఖచిత్రాన్నే మార్చేసింది. ఇదీ ఇప్పాయిపల్లి అనే మారుమూల పల్లె యువత సాధించిన ఘనత. రికార్డు సృష్టించిన పల్లె... వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలో మారుమూలన ఉండే ఇప్పాయిపల్లి జనాభా 2,400. ఓటర్లు 1,740. సాగుయోగ్యమైన భూములు తక్కువ. వర్షాధార పంటలే ఆ ఊరిజనానికి జీవనాధారం. రాగులు, జొన్నలు, మొక్కజొన్న పంటలు వేసేవారు. ఆరుగాలం కష్టించినా వచ్చే ఆదాయం అంతంతమాత్రమే. దీంతో అత్యధికులు బతుకుదెరువు కోసం వలసబాట పట్టేవారు. మట్టి పనులు చేయడం కోసం ఇతర ప్రాంతాలకు కూలీలుగా వెళ్లేవారు. ఈ నేపథ్యంలో వాలీబాల్ ఆటలో మంచి ప్రావీణ్యం సంపాదించారు. జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో గుర్తింపు పొందారు. ఎక్కడ టోర్నమెంటు జరిగినా ఇప్పాయిపల్లి వాలీబాల్ క్రీడాకారులు బహుమతులు గెలవడం ఆనవాయితీ అయింది. ఈ క్రమంలో ఇద్దరు వాలీబాల్ క్రీడాకారులు పోలీసు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని మిగతా క్రీడాకారులు అదే బాట పట్టారు. పోలీసు ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా వారికి వరమైంది. జిల్లాలోనే అత్యధికంగా పోలీసు ఉద్యోగాలు సాధించిన గ్రామంగా ఇప్పాయిపల్లి రికార్డు సృష్టించింది. ఈ గ్రామంలోని ప్రతి ఇంటిలో ఒకరు లేదా ఇద్దరు పోలీసు ఉద్యోగంలో కొనసాగుతున్నారు. మంత్రుల దగ్గర, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిదుల వద్ద ఈ గ్రామానికి చెందిన పోలీసులే గన్మెన్లుగా ఉన్నారు. ఆ విధంగా రాష్ట్రంలోనే ఇప్పాయిపల్లికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రస్తుతం 210 మంది యువకులు పోలీసు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఒకప్పుడు వలసకూలీలకు నిలయంగా ఉన్న ఇప్పాయిపల్లి ఇప్పుడు ఖాకీవనమైంది. ‘మా పిల్లలు రాష్ట్రంలో శాంతి భద్రత పరిరక్షణకే కాకుండా ప్రజాప్రతినిధుల వద్ద రక్షణ కోసం గన్మెన్లుగా పనిచేస్తున్నారు’అని వారి తల్లిదండ్రులు గర్వంగా చెప్పుకుంటున్నారు. వాలీబాల్ క్రీడ ద్వారా ఉద్యోగాలు సంపాదించిన వారందరూ కలసి ఇప్పాయిపల్లి వాలీబాల్ అసోసియేషన్ ఏర్పాటు చేసి గ్రామం మధ్యలో అర ఎకరం భూమిని కొనుగోలు చేసి పెద్ద గ్రౌండ్‌ను ఏర్పాటు చేశారు. అందులో యువకులకు ప్రతిరోజు శిక్షణ ఇప్పిస్తున్నారు. ప్రతి దఫా జరుగుతున్న పోలీసు ఉద్యోగాల ఎంపికలో కనీసం 10 మందికి తక్కువ కాకుండా ఈ గ్రామ వాలీబాల్ క్రీడాకారులు ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. వాలీబాల్.. జీవనాధారమైంది.. ఆటవిడుపు కోసం ఆడిన వాలీబాల్ ఆటనే మాకు బతుకుదెరువైంది. వ్యాయామం, కాలక్షేపం కోసం ప్రతిరోజు ఆట ఆడే సీనియర్ల వెంట మేము కూడా వెళ్లి ఆడుతుండేవాళ్లం. ఆటలో ప్రావీణ్యం సంపాదించడంతో స్పోర్ట్స్ కోటా కింద చాలామందికి పోలీసులు ఉద్యోగాలు వచ్చాయి. ఇప్పటికీ వస్తున్నాయి. – రాంచందర్, బొంరాస్‌పేట్ పోలీస్ స్టేషన్ గ్రామపెద్దలే ఆదర్శం మా గ్రామంలో మొదటగా పోలీసు ఉద్యోగాలు సాధించినవారే మాకు ఆదర్శం. వారిని చూసే వాలీబాల్ ఆట నేర్చుకున్నాం. వారి స్ఫూర్తితో, సలహాలతోనే పోలీసు ఉద్యోగాలు సంపాదించాం. ఇప్పుడు కూడా వాలీబాల్ ఆటకు ప్రాధాన్యతనిస్తున్నాం. – నర్సింహులు, కానిస్టేబుల్, వికారాబాద్ పోలీస్ స్టేషన్ మంత్రుల వద్ద గన్మెన్లు మా ఊరు పోలీసులే... జిల్లాలో ఏ పోలీస్ స్టేషన్లో చూసినా మా గ్రామానికి చెందిన పోలీసులు ఒకరో, ఇద్దరో ఉంటారు. రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధుల వద్ద కూడా గన్మెన్లుగా పనిచేస్తున్నారు. పండుగలు వస్తే గ్రామం అంతా పోలీసు ఉద్యోగస్తులతో నిండిపోతుంది. మా గ్రామ పెద్దలే మాకు ఆదర్శం. – శ్రీనివాస్, కానిస్టేబుల్, దోమ పోలీస్ స్టేషన్ -
ఏసీబీ అదుపులో ‘జూడో’ కార్యదర్శి
-
స్పోర్ట్స్ కోటా కేసులో మరొకరి అరెస్టు
సాక్షి, హైదరాబాద్/వరంగల్ క్రైం/ఖిలావరంగల్: స్పోర్ట్స్ కోటాలో మెడికల్ సీట్ల కేటాయింపులో జరిగిన అక్రమాలపై ఏసీబీ మరో కేసు నమోదుచేసింది. జూడో అసోసియేషన్ సెక్రటరీ కైలాసం యాదవ్‌ను అరెస్టు చేసింది. కైలాసం యాదవ్ ద్వారా స్పోర్ట్స్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్ వెంకటరమణ డబ్బులు వసూలు చేసినట్టు ఏసీబీ నిర్ధారించింది. స్పోర్ట్స్ కోటాలో 12 సీట్లు కేటాయించగా.. అందులో నాలుగు సింగిల్ జూడో విభాగంలో ఉన్నట్టు ఏసీబీ తెలిపింది. ఈ నాలుగు సీట్లు వరంగల్ జిల్లాకు చెందిన విద్యార్థులకే ఇచ్చారని గుర్తించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఎల్బీ స్టేడియంలోని స్పోర్ట్స్ అథారిటీ కార్యాలయంలో సోదాలు నిర్వహించింది. ఈ మొత్తం వ్యవహారంలో కీలక సూత్రధారి డిప్యూటీ డైరెక్టర్ వెంకట రమణే అని ఏసీబీ అధికారులు వెల్లడించారు. రూ.4 లక్షల డీల్ సింగిల్ జూడో స్పోర్ట్స్ కోటా కింద నాలుగు సీట్లు అలాట్ అయ్యాయి. ఈ విభాగంలో ఉన్న వరంగల్‌కు చెందిన విద్యార్థి తోటా రుద్రేశ్వర్ నుంచి రూ.4 లక్షలను జూడో అసోసియేషన్ సెక్రటరీ కైలాసం యాదవ్ డిమాండ్ చేశాడు. దీంతో రుద్రేశ్వర్ తండ్రి సునీల్ కుమార్ ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. రూ.2 లక్షలు కైలాసం యాదవ్‌కు ఇచ్చామని, మరో రూ.2 లక్షల కోసం ఒత్తిడి చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కేసు నమోదు చేసిన ఏసీబీ.. వరంగల్‌లోని కైలాసం యాదవ్ నివాసంతో పాటు స్పోర్ట్స్ కార్యాలయంలో సోదాలు నిర్వహించి కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది. ఈనేపథ్యంలో జూడో అసోసియేషన్ కార్యదర్శి కైలాసం యాదవ్‌ను ఏసీబీ అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. దైర్యంగా ఫిర్యాదు చేయండి: ఏసీబీ క్రీడా కోటాలో మెడికల్ సీట్లకు సంబంధించి బాధితులు దైర్యంగా ఫిర్యాదు చేయాలని ఏసీబీ డైరెక్టర్ జనరల్ శుక్రవారం ఓ ప్రకటనలో కోరారు. టోల్‌ఫ్రీ నంబర్ 1064కు కాల్చేసి ఫిర్యాదు చేయాలని, ఈ వ్యవహారానికి సంబంధించి నెలరోజులపాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న 7382629283 నంబర్‌కు వాట్సాప్ చేయాలని కోరారు. -
వృత్తి విద్యాకోర్సుల ప్రవేశాల్లో నో స్పోర్ట్స్ కోటా
సాక్షి, హైదరాబాద్: స్పోర్ట్స్ కోటా కింద వృత్తి విద్యా కోర్సుల్లో ఈ ఏడాది ప్రవేశాలు జరపరాదని ఉమ్మడి హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. మెడికల్, ఇంజనీరింగ్ వంటి వృత్తి విద్యా కోర్సుల్లో క్రీడా కోటా రిజర్వేషన్లలో అక్రమాలు జరిగాయని.. ఆ కోటా జీవోను రద్దు చేయాలన్న వ్యాజ్యంపై హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించింది. స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది జూన్ 21న జారీ చేసిన జీవో 7ను టి.శ్రియతో పాటు మరో నలుగురు సవాల్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరు వారాల్లోగా తమ వాదనతో కౌంటర్ వ్యాజ్యాన్ని దాఖలు చేయాలని విచారణ సందర్భంగా ధర్మాసనం ఆదేశించింది. ‘వృత్తి విద్యా కోర్సుల్లో స్పోర్ట్స్ కోటా ప్రవేశాల్ని ఈ ఏడాదికి నిలిపివేస్తున్నాం. ఈ నిర్ణయం బాధాకరమే అయినా విస్తృత అంశాలతో ముడిపడినందున ఆదేశాలు ఇస్తున్నాం. గతేడాది స్పోర్ట్స్ కోటా ప్రవేశాలపై స్టే విధిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు రద్దు చేసినా.. అది గత విద్యా సంవత్సరానికే పరిమితం. స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధం కాదు. ఇందులో అక్రమాలకు తెర లేస్తున్నప్పుడు కోర్టులు కళ్లు మూసుకుని ఉండవు’అని కోర్టు వ్యాఖ్యానించింది. నీట్ నోటిఫికేషన్ తర్వాత జీవోనా? విచారణలో పిటిషనర్ల తరఫు న్యాయవాది బి.రచనారెడ్డి వాదిస్తూ.. ‘క్రీడా కోటా కింద 2017–18 విద్యా సంవత్సరంలో జరిగిన ప్రవేశాల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై సీఎం విచారణ ఆదేశాల ఫలితంగా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దర్యాప్తు చేపట్టింది. లంచం డిమాండ్ చేశారనే ఆరోపణలపై క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) డిప్యూటీ డైరెక్టర్‌ను ఏసీబీ అరెస్ట్ చేసింది. అప్పటికే క్రీడా కోటాపై ఉన్న కమిటీ చేసిన సిఫార్సుల మేరకు జీవో 7జారీ అయింది. అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం అలాంటి అధికారులతో కూడిన కమిటీ సిఫార్సులకు అనుగుణంగా ఇచ్చిన జీవో 7ను అమలు చేయడం అన్యాయం’అని అన్నారు. పైగా, నీట్ నోటిఫికేషన్ వెలువడ్డాక జీవో వచ్చిందని.. దీని వెనుక స్వార్థపూరిత ఉద్దేశాలున్నాయని చెప్పారు. దేశంలో ఎప్పుడూ వినని క్రీడలను జీవో ద్వారా ప్రభుత్వం గుర్తించిందని.. స్పోర్ట్స్ కోటాలో సీటు పొందిన విద్యార్థి ఏ ఒక్కరూ అంతర్జాతీయ స్థాయిలో ఒక్క పతకమైనా సాధించలేదని ఆమె వెల్లడించారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. స్పోర్ట్స్ కోటాను ఈ ఏడాది రద్దు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. -
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్-7 వల్ల స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని నీలేరాయ్, కాలేశ్రేయ అనే ఇద్దరు స్పోర్ట్స్ అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రొఫెషనల్ కోర్సు(మెడికల్, ఇంజనీరింగ్, అగ్రికల్చర్ తదితర)లలో స్పోర్ట్స్ కోటాను ఎత్తివేయాలని పిటిషనర్ తరపు న్యాయవాది రచనా రెడ్డి కోర్టును కోరారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్-7లో స్పోర్ట్స్ కోటాలో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయని న్యాయవాది రచనారెడ్డి కోర్టుకు తెలిపారు. దీంతో గత నెల ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్-7పై కోర్టు స్టే ఇచ్చింది. ఏడాది పాటు ప్రొఫెషనల్ కోర్సులలో స్పోర్ట్స్ కోటాను పరిగణనలోనికి తీసుకోవద్దని హైకోర్టు సూచించింది. -
‘శాట్స్’ కేసును సీబీఐకి అప్పగించాలి: గట్టు
సాక్షి, హైదరాబాద్: మెడికల్ సీట్ల కేటాయింపులో అర్హులైన స్పోర్ట్స్ కోటా విద్యార్థులకు సీట్లు కేటాయించకుండా శాట్స్ అవినీతికి పాల్పడిందని వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాం త్‌రెడ్డి ఆరోపించారు. స్పోర్ట్స్ కోటా కింద సిఫారసుకు విద్యార్థులు సమర్పించిన పత్రాలను క్రీడలు, యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శి సారథ్యంలో ఏర్పాటైన కమిటీ పరిశీలించకుండా శాట్స్‌కు చెందిన డిప్యూటీ డైరెక్టర్, కోచ్‌లు పరిశీలించి సంతకాలు చేశారన్నారు. ఈ కేసును ఏసీబీ నుంచి సీబిఐకి అప్పగించాలని శ్రీకాంత్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
ఏసీబీ విచారణకు సహకరిస్తున్నాం..
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ స్పోర్ట్స్ కోటాలో గత సంవత్సరం మెడికల్ సీట్లు అమ్ముకున్నారనే ఆరోపణల నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ అధికారుల ఇళ్లపై దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఏసీబీ విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తామని సాట్స్ ఎండీ దినకర్ బాబు చెప్పారు. ఆయన గురువారం మాట్లాడుతూ.. సాట్స్‌లో అక్రమాలు జరగలేదని పేర్కొన్నారు. కొంతమంది అధికారులు చేసిన తప్పులకు క్రీడాకారులు బలయ్యారని తెలిపారు. ‘ ఫెన్సింగ్‌ని 2016లోనే కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఫెన్సింగ్ బాండ్ కారణంగానే ఫెన్సింగ్ సర్టిఫికెట్లను పరిగణలోకి తీసుకోలేదు. ఏ విధమైన ప్రాక్టీస్ లేని వాళ్లను అసోసియేషన్‌లో ఎంపిక చేస్తున్నారు. ఏసీబీ వాళ్లు అడిగిన అన్ని వివరాలకి సమాధానం ఇచ్చాం. అసోసియేషన్‌లో ఉన్న లోపాల వల్ల క్రీడా విద్యార్థులకు న్యాయం జరగడం లేదు. అసోసియేషన్ లే బాక్ డోర్‌ను ప్రోత్సహిస్తున్నాయి. సాట్స్ ద్వారా ఒక్క క్రీడాకారునికి కూడా అన్యాయం జరగలేదు. ఇప్పటికీ ప్రభుత్వం రెండుసార్లు కమిటీలు వేసి విచారణ జరిపింది. వాటిలో కొన్ని లోపాలు బయటపడ్డాయని’ సాట్స్ ఎండీ పేర్కొన్నారు. ఇటాంటి ఘటనలు భవిష్యత్‌లో పునరావృతం కాకుండా కొత్త విధానాన్ని రూపొందించబోతున్నామని ఎండీ చెప్పారు. ‘అసోసియేషన్ సెలెక్షన్ల ప్రాసెస్ పూర్తిగా లోపభూయిష్టంగా ఉంది. ఎవరికి నచ్చినట్లుగా వాళ్లు ఎంపిక చేసుకుని టీంలను పంపిస్తున్నారు. కొన్ని అసోసియేషన్లను ప్రభుత్వాలు నిషేధించినప్పటికీ అవి కొనసాగుతూ టీం సెలక్షన్ చేస్తున్నాయి. సాట్స్‌లో ఎవరు డబ్బులు తీసుకున్న శిక్షార్హులే. ప్రతి ఏడాది కొన్ని వందలమందిని సెలక్షన్ చేసి పంపిస్తున్నారు. ఏసీబీ విచారణ పూర్తికాగానే ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో నివేదిక సమర్పిస్తాం. తప్పుడు వ్యక్తులు టీమ్‌లోకి వచ్చినా వెంటనే వాళ్లను నిషేధిస్తున్నామని’ సాట్స్ ఎండీ తెలిపారు. ఆరోపణలు చేస్తున్న ఆ నలుగురు క్రీడా విద్యార్థుల వ్యవహారంలో నేను సరిగానే వ్యవహరించానన్నారు. వాళ్ళని అసోసియేషన్లు తప్పుదోవ పట్టించాయని ఆయన చెప్పారు. భాగ్యశ్రీతో పాటుగా మరికొందరి విషయంలో మాకు చాలా బాధాకరంగా ఉందని చెప్పారు. నిషేధించిన ఫెన్సింగ్ సర్టిఫికెట్ తీసుకువచ్చి మెరిట్ జాబితాలో పెట్టమంటే చాలా కష్టమని సాట్స్ ఎండీ దినకరన్ పేర్కొన్నారు. -
స్పోర్ట్స్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్ అరెస్టు..
సాక్షి, హైదరాబాద్ : గత సంవత్సరం తెలంగాణ స్పోర్ట్స్ కోటాలో మెడికల్ సీట్లు అమ్ముకున్నారనే ఆరోపణల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) బుధవారం తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ అధికారుల ఇళ్లపై ఒకేసారి మెరుపు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఏసీబీ డైరెక్టర్ జనరల్ పూర్ణచందర్ రావు మాట్లాడుతూ.. శాప్ డిప్యూటీ డైరెక్టర్ వెంకట రమణ నివాసం సహా మరో ఐదు చోట్ల తనిఖీలు నిర్వహించామన్నారు. ‘స్పోర్ట్స్ కోటాలో 12 మందికి మెడికల్ సీట్లు అమ్ముకున్నట్లు గుర్తించాం. బాధితులు భరత్ చంద్రారెడ్డి, హర్షితారాజ్ల ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని’ ఏసీబీ డీజీ చెప్పారు. అధికారులు వెంకట రమణ, శోభ, చంద్రారెడ్డి, విమలాకర్లు లంచం డిమాండ్ చేశారని ఏసీబీ డీజీ తెలిపారు. 2017 స్పోర్ట్స్ సర్టిఫికెట్లకు సంబంధించిన డాక్యుమెంట్లు సేకరించామన్నారు. శాప్ డిప్యూటీ డైరెక్టర్ వెంకట రమణను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. ఇంకా ఎవరైనా బాధితులుంటే ఏసీబీని సంప్రదించాలని ఏసీబీ డైరెక్టర్ జనరల్ పూర్ణచందర్ రావు సూచించారు. -
స్పోర్ట్స్ కోటాపై ఏసీబీ విచారణ
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్ స్పోర్ట్స్ కోటా సీట్ల భర్తీలో అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని సీఎం కేసీఆర్ గురువారం అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)ని ఆదేశించారు. అక్రమాలకు బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఎంబీబీఎస్ సీట్లకు డిమాండ్ దృష్ట్యా ఏ, బీ కేటగిరీ సీట్లు దక్కని పరిస్థితులో సీ కేటగిరీ సీట్లు పొందేందుకు కోట్ల రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది. ‘సీ’కేటగిరీ(ఎన్ఆర్ఐ)లో సీటు వచ్చిన విద్యార్థి కోర్సు పూర్తి చేసేందుకు కోటి రూపాయలకుపైగా ఖర్చు చేయా ల్సి ఉంటోంది. ‘బి’కేటగిరీలో సీటు వస్తే ఏడాదికి రూ.11.50 లక్షల వరకు ఫీజు చెల్లించాలి. స్పోర్ట్స్ కోటాలో సీటు తెచ్చుకుంటే ప్రైవేటు కాలేజీల్లో ఏటా రూ.60 వేలు, ప్రభుత్వ వైద్య కళాశాలలో అయితే ఏడాదికి రూ.10 వేలు చెల్లిస్తే సరిపోతుంది. మెరిట్ ప్రాతిపదికన సీట్లు రాని అభ్యర్థులు అధికారుల సహకారంతో స్పోర్ట్స్ కోటాలో సీట్లు సంపాదిస్తున్నారు. కొన్నేళ్ల నుంచి ఈ వ్యవహారం జరుగుతోంది. వైద్య కోర్సులో క్రీడాకారులకు సీట్లు కేటాయించాలని 2008లో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే విధానం తెలంగాణలోనూ కొనసాగుతోంది. దీని ప్రకారం, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఆడిన వారి కంటే అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొన్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఒకే సీటుకు ముగ్గురు క్రీడాకారులు పోటీ పడితే అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయి క్రీడాకారులకు వరుసగా అవకాశం ఇవ్వాలి. వ్యక్తిగతంగా పాల్గొన్నా, జట్టు పరం గా పాల్గొన్నా ఇదే ప్రాధాన్యత ఉంటుంది. స్పోర్ట్స్ కోటా వైద్య సీటు పొందాలనుకునే విద్యార్థి ముందుగా స్పోర్ట్స్ అథారిటీకి దరఖాస్తు చేసుకోవాలి. ఏ ఆటలో, ఏ స్థాయిలో పాల్గొన్నారనే విషయాలను ధ్రువీకరిస్తూ సంబంధిత పత్రాలను జత చేయా లి. వీటిని పరిశీలించాక స్పోర్ట్స్ అథారిటీలోని ప్రత్యేక కమిటీ అర్హుల జాబితాను సిద్ధం చేస్తుంది. ప్రతిభ ఆధారంగా కాకుండా పైరవీలోనే ఈ జాబితా తయారవుతోందనే ఆరోపణలు పెరుగుతున్నాయి. 2010 నుంచి 2016 వరకు ఎంబీబీఎస్ సీట్ల అడ్మిషన్ల ప్రక్రియలో అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొన్నవారికి ప్రాధాన్యత ఇచ్చారు. 2017లో అంతర్జాతీయ స్థాయి లో పాల్గొన్న క్రీడాకారుడిని పక్కనబెట్టి, జాతీయ స్థాయి లో ఆడిన అభ్యర్థికి సీటు ఇచ్చేలా చేశారు. దీంతో అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొని, చదువుల్లో ప్రతిభ చూపిన అభ్యర్థి సీటు కోల్పోయారు. దీనిపై సీటు దక్కని అభ్యర్థి తండ్రి స్పోర్ట్స్ అథారిటీ అధికారులను కలిసి వివరించారు. అధికారులు పట్టించుకోకపోవడంతో విజిలెన్స్ విభాగానికి ఫిర్యా దు చేశారు. తొలి జాబితాలో తన కుమారుడి పేరు ఉందని, తర్వాత దాన్ని మార్చారని పేర్కొంటూ వివరాలను అందజేశారు. అయినా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. రూ. 50 లక్షలు ఇస్తే సీటు వచ్చేలా చేస్తామని స్పోర్ట్స్ అథారిటీ అధికారులు చెప్పారన్నారు. దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. -
ఉద్యోగ నియామకాల్లో స్పోర్ట్స్ కోటా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు 2% కోటా కల్పించాలనే ప్రతిపాదనను పరిశీలిస్తోంది. విద్యావకాశాల్లో స్పోర్ట్స్ కోటా అమలవుతున్నా.. ఉద్యోగ నియామకాల్లో క్రీడాకారులకు ప్రత్యేక కోటా రిజర్వేషన్లు అమలవడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో 2012లోనే ఉద్యోగ నియామకాల్లో 2 శాతం స్పోర్ట్స్ రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవో 74 విడుదల చేసింది. కానీ సాంకేతిక కారణాలతో అమల్లోకి రాలేదు. కొద్ది రోజుల కిందట ఏపీ ప్రభుత్వం ఉద్యోగ నియామకాల నిబంధనలను సవరించింది. ఉద్యోగ నియామకాల్లో స్పోర్ట్స్ కోటాకు రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కానీ తెలంగాణలో ఇప్పటికీ స్పోర్ట్స్ కోటా అమలవలేదు. సవరణల కోసం ప్రతిపాదనలు.. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ పలుమార్లు హామీ ఇచ్చారు. దీంతో తెలంగాణలో స్పోర్ట్స్ కోటా అమలులోకి తెచ్చేందుకు స్పోర్ట్స్ అథారిటీ కసరత్తు ప్రారంభించింది. ఉద్యోగ నియామకాల్లో స్పోర్ట్స్ రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి టీఎస్పీఎస్సీకి లేఖ రాశారు. స్పందించిన కమిషన్.. ఉద్యోగ నియామక నిబంధనలకు సవరణలు చేస్తేనే స్పోర్ట్స్ కోటా అమలు సాధ్యమని ప్రత్యుత్తరం రాసింది. స్పోర్ట్స్ కోటా కల్పించేందుకు సర్వీసు రూల్స్, చట్ట సవరణ చేసి రిజర్వేషన్లు అమలు చేయాలంటూ సిద్ధం చేసిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ పంపించింది. క్రీడా, న్యాయ శాఖల పరిశీలన తర్వాత సాధారణ పరిపాలన శాఖలోని సర్వీసెస్ విభాగానికి ఫైలు చేరింది. ఈ నెలలోనే ఉత్తర్వులు..! ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో తరహాలోనే ప్రస్తుత సర్వీసు రూల్స్‌ను సవరించి ఉద్యోగ నియామకాల్లో స్పోర్ట్స్ కోటా కింద 2% రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. సీఎం నిర్ణయం మేరకు వీలైనంత త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మరో ఏడాది వ్యవధిలో దాదాపు 84 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. భారీ రిక్రూట్మెంట్ నేపథ్యంలో క్రీడాకారులకు మేలు జరిగేలా స్పోర్ట్స్ కోటా ఉత్తర్వులను ఈ నెలలోనే విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. -
దొంగాట
⇔ ప్రతిభకు పాతరేస్తూ సర్టిఫికెట్ల ప్రదానం ⇔ ఫెన్సింగ్.. జూడో.. సాఫ్ట్‌బాల్ ⇔ అసోసియేషన్ల పాత్రపై అనుమానం ⇔ ఈ ఏడాది స్పోర్ట్స్ కోటాలో మెడిసిన్‌కు 15 మంది విద్యార్థులు ⇔ నేతల జోక్యంతో గుట్టుగా వ్యవహారం ⇔ ఉన్నత స్థాయి విచారణతో కలకలం మెడిసిన్ కోటా లక్ష్యంగా క్రీడలు ⇔ జూడో ఓపెన్ కేటగిరీ కింద జిల్లాకు చెందిన రెడ్డప్పరెడ్డి 100 కేజీల విభాగంలో బంగారు పతకాన్ని సాధిస్తే.. దీన్ని చిత్తూరు జిల్లాకు చెందిన రుత్విక్ అనే విద్యార్థికి కట్టబెట్టారు. ప్రస్తుతం ఈ విద్యార్థి ఎస్వీ మెడికల్ కళాశాలలో మెడిసిన్ చదువుతుండటం గమనార్హం. ⇔ క్రీడా వ్యాపారం అనంతను కుదిపేస్తోంది. దొడ్డిదారిలో మెడిసిన్ సీటు దక్కించుకునేందుకు ఆడిన ‘ఆట’.. ప్రతిభ కలిగిన విద్యార్థుల కంట తడి పెట్టిస్తోంది. గెలుపొందిన క్రీడాకారులకు.. సర్టిఫికెట్‌లోని పేర్లకు పొంతన లేకుండా సాగించిన దొంగాట క్రీడాలోకంలో చర్చనీయాంశంగా మారింది. స్పోర్ట్స్ అసోసియేషన్ నాయకులు.. ప్రజాప్రతినిధుల కన్నుసన్నల్లోనిదే ఈ తంతు. అనంతపురం సప్తగిరి సర్కిల్: ప్రతిభకు స్పోర్ట్స్ కోటా పాతరేసింది. మెడిసిన్ సీటు సాధించడమే లక్ష్యంగా కొందరు తల్లిదండ్రులు, స్పోర్ట్స్ అసోసియేషన్ల ప్రతినిధులతో పాటు నేతలు రంగ ప్రవేశం చేయడంతో సర్టిఫికెట్ల వ్యాపారం మొదలైంది. అనంతపురంలోనే జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీలు నిర్వహించి సర్టిఫికెట్లను ప్రధానం చేశారు. క్రీడాకారుడు ఒకరయితే.. సర్టిఫికెట్‌ను మరో విద్యార్థి పేరిట ఇవ్వడం ద్వారా దొంగాటకు తెర తీశారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రధాన క్రీడా మైదానం కేంద్రంగా ఈ తంతు సాగింది. చిత్తూరుకు చెందిన రుత్విక్ విషయంలో ఆయా క్రీడా సంఘాల ప్రతినిధులు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ, యూత్ అఫైర్స్‌కు ఫిర్యాదు చేయడంతో వ్యవహారం బట్టబయలయింది. ఇంటర్ పూర్తి చేసిన ఈ విద్యార్థి సీనియర్ నేషనల్ క్రీడాంశాల్లో పాల్గొనేందుకు అనర్హుడు. అయితే ధనార్జనే ధ్యేయంగా ఇతనికి సర్టిఫికెట్‌ను ప్రదానం చేయడం గమనార్హం. గతేడాది తెలంగాణలో నిర్వహించిన స్పోర్ట్స్ కోటా సీట్ల విషయంలో ఆ ప్రాంత రాష్ట్ర ఫెన్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు ధన్కిషన్ను దోషిగా తేల్చారు. ఈ ఏడాది అనంతపురం జిల్లా కేంద్రంగా ప్రధాన క్రీడాంశాలైన ఫెన్సింగ్.. జూడో.. సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ల రాష్ట్ర కార్యదర్శుల పాత్ర జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. నకిలీ ధ్రువీకరణ పత్రాల జారీ వెనుక వీరి హస్తం ఉందనే అనుమానం పలువురు క్రీడాకారులతో పాటు తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు. నలుగురు బోగస్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఎంసెట్‌లో మెడిసిన్‌కు 0.05 స్పోర్ట్స్ కోటాలో 16 మెడిసిన్, 4 డెంటల్ సీట్లు కేటాయిస్తుం ది. ఇందులో మిగతా క్రీడాంశాలతో పోలిస్తే ఫెన్సింగ్, జూడో, సాఫ్ట్‌బాల్ క్రీడాకారులకే అధిక లబ్ధి చేకూర్చడం అనుమానాలకు తావిస్తోంది. ఇదే విషయమై గత ఏడాది పలువురు తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించడంతో విచారణకు ఈ ఏడాది ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటయింది. ఆ మేరకు నలుగురు క్రీడాకారులు బోగస్ అని వెల్లడయింది. ఈ ఏడాది స్పోర్ట్స్ కోటాలో 15 మంది రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల నిర్వహణకు సంబం ధించి స్పోర్ట్స్ అథారిటీకి, ఒలంపిక్స్ అసోసియేషన్‌కు పూర్తి నివేదికలను, రెఫరీల వివరాలను అం దించాల్సి ఉంది. అయితే అంతర్జాతీయ క్రీడలకు వెళ్లే క్రీడాకారులకు ఇండియా ఫెడరేషన్, యూత్ అఫైర్స్ నుంచి ఎలాంటి అప్రూవల్ ఉండదు. అ యినప్పటికీ అంతర్జాతీయ క్రీడలకు ఆయా జిల్లా ల నుంచి క్రీడాకారులను పంపుతుండటం గమనార్హం. గత ఏడాది వరకు ఎంసెట్‌కు ఎంత మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారనే వివరాలు కూడా ఆయా జిల్లాల క్రీడా ప్రాధికార సంస్థ వద్ద లేకుండానే క్రీడాకారులకు హైదరాబాద్, విజయవాడలోని ప్రధాన కేంద్రాల్లో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ ఏడాది అనంతపురం జిల్లా నుంచి 15 మంది క్రీడాకారులు ఎంసెట్‌కు స్పోర్ట్స్ కోటాలో దరఖాస్తు చేసుకున్నారు. అయితే వీరిలో ఎంత మంది అర్హులనే విషయం విచారణలో వెల్లడి కావాల్సి ఉంది. నేతకు సలాం క్రీడల్లో రాజకీయ జోక్యం మీతిమిరితే ప్రతి భ పక్కకు తప్పుకుంటుందనే విషయం అందరికీ తెలిసిందే. మంత్రి పరిటాల సునీ త కుమారుడు శ్రీరాంను జిల్లా ఒలంపిక్స్ సంఘం అడ్హాక్ కమిటీ అధ్యక్షునిగా గత జూలైలో ఎన్నుకోవడంలో ఫెన్సింగ్, జూ డో, సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ల రాష్ట్ర కార్యదర్శులు కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ అండదండలు ఉండటంతోనే నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంలో క్రీడా ప్రతినిధులు దూకుడు ప్రదర్శించినట్లు చర్చ జరుగుతోంది. జిల్లాకు చెందిన ముఖ్య ప్రభుత్వ శాఖల అధికారుల పిల్లలకు నకిలీ సర్టిఫికెట్లను కట్టబెట్టిన నేపథ్యంలో ఈ దొంగాట గుట్టుగా సాగినట్లు సమాచారం. -
ఆర్బీఐలో అసిస్టెంట్ మేనేజర్‌గా ఉమేశ్
నాగ్‌పూర్: ఒకప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ ఉద్యోగం కోసం ప్రయత్నించిన భారత జట్టు పేస్ బౌలర్ ఉమేశ్ యాదవ్ ఇప్పుడు ఏకంగా ప్రతిష్టాత్మక రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)లో ఉన్నతోద్యోగిగా మారాడు. నాగ్‌పూర్ కార్యాలయంలో అతడికి అసిస్టెంట్ మేనేజర్‌గా ఉద్యోగం లభించింది. సోమవారం దీనికి సంబంధించిన లాంఛనాలను పూర్తి చేశాడు. చాంపియన్స్ ట్రోఫీకన్నా ముందే మేలో ఉమేశ్ ఆర్బీఐ అధికారులను కలిశాడు. స్పోర్ట్స్ కోటా కింద అతడికి అనుమతి లభించినా వెంటనే ఇంగ్లండ్‌కు వెళ్లడంతో అప్పుడు అపాయింట్మెంట్ తీసుకోవడానికి వీలు కాలేదు. ఉమేశ్ ఇంట్లో దొంగతనం: మరోవైపు ఆదివారం ఉమేశ్ యాదవ్ ఫ్లాట్‌లో దొంగతనం జరిగింది. ఆదివారం రాత్రి ఆగంతకులు అతడి ఇంట్లో చొరబడి రూ.45 వేల నగదుతో పాటు రెండు మొబైల్ ఫోన్లను తస్కరించారు. ఆ సమయంలో ఉమేశ్ కుటుంబం ఇంట్లో లేదు. ఇప్పటికే ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
క్రీడా విభాగంలో లక్ష్మీచైతన్యకు ట్రిపుల్ ఐటీ సీటు
భీమవరం : పట్టణంలోని సెయింట్ మెరీస్ విద్యార్థిని కేతా లక్ష్మీ చైతన్య క్రీడా విభాగంలో నూజివీడు ట్రిపుల్ ఐటీలో సీటు సాధించింది. హెచ్ఎం వలసమ్మ జార్జి సోమవారం వివరాలు వెల్లడించారు. లక్ష్మీ చైతన్య ఆరో తరగతి నుంచి సెయింట్ మేరీస్ స్కూల్లో హాకీ క్రీడను విద్యనభ్యసిస్తూ వివిధ అంతర జిల్లాల హాకీ పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపింది. ఈ ఏడాది మే నెలలో జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీ నగరంలో నిర్వహించిన జాతీయస్థాయి మహిళా హాకీ పోటీల్లో రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహించిన లక్ష్మీచైతన్య ట్రిపుల్ ఐటీ సీటు సాధించిందన్నారు. హెచ్ఎం వలసమ్మ జార్జి, కరస్పాండెంట్ సిస్టర్ లీల, వ్యాయామ ఉపాధ్యాయులు అల్లు అప్పారావు, పాలా దుర్గారావు తదితరులు అభినందించారు. -
క్రీడాకారులకు చేయిచ్చారు!
మంచిర్యాల సిటీ, న్యూస్‌లైన్: చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని, ఉద్యోగాల్లో ప్రత్యేక కోటా ఉంటుందని చెబుతున్న సర్కారు ఈసారి ప్రభుత్వ ఉద్యోగాల్లో మాత్రం నిరాశపరిచింది. తాజాగా రెవెన్యూశాఖ ప్రకటించిన వీఆర్వో, వీఆర్ఏ.. ఏపీపీఎస్సీ ప్రకటించిన పంచాయతీరాజ్ కార్యదర్శుల నియామకాల్లో స్పోర్ట్స్ కోటాకు పోస్టులు కేటాయించలేదు. అన్ని స్థాయిల్లోని ప్రభుత్వ నియామకాల్లో క్రీడాకారులకు 2 శాతం కోటా కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఏడాది క్రి తం ఆదేశాలు జారీ చేసింది. తాజాగా నోటిఫికేషన్ ప్రకటించిన శాఖలు ఈ ఆదేశాలు పట్టించుకోలేదు. వీఆర్వో, వీఆర్ఏ, పంచాయతీ కార్యదర్శి నోటిఫికేషన్లో వికలాం గులకు, మాజీ సైనికోద్యోగులకు రిజర్వేషన్ ప్రకటిం చాయి. కానీ క్రీడాకారులకు రిజర్వేషన్ ప్రకటించకపోవడం శోచనీయం. జిల్లావ్యాప్తంగా వీఆర్వో, వీఆర్ఏ 136 పోస్టులు, పంచాయతీ కార్యదర్శి 241 పోస్టులకు ఇటీవల నోటిఫికేషన్ జారీ అయింది. ఈ పోస్టుల్లో రెండు శాతం క్రీడాకారుల కోటా అమలు కాకపోవడంతో 8 పోస్టులు నష్టపోతున్నారు. డెరైక్ట్ నియామకాల్లో రెండు శాతం క్రీడాకారుల రిజర్వేషను వర్తింపజేయడంలో అధికారులు నిబంధనలను సవరించాల్సి ఉండగా ప్రభుత్వం పట్టించుకోలేదు. జిల్లాలో అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రస్థాయి క్రీడాకారులు దాదాపు 2వేలకు పైగా ఉంటారు. వీరందరూ కూడా ఉద్యోగ నియామకానికి దరఖాస్తు చేసుకోవడం లేదు. ఉత్తర్వులు వచ్చి ఏడాది అయినా అధికారులు సవరించకపోవడంతో ఆటల్లో నైపుణ్యం ఉన్న నిరుద్యోగులకు శాపంగా పరిణమించింది. విషయం : స్పోర్ట్స్ కోటా లేకపోవడం పోస్టులు : వీఆర్వో 53, వీఆర్ఏ 83, పంచాయతీ కార్యదర్శి 241.. వికలాంగుల కోటా(2 శాతం) : వీఆర్వో 1, వీఆర్ఏ 2, కార్యదర్శి 5 పోస్టులు జిల్లాలో అంతర్జాతీయ క్రీడాకారులు : 30 మందికిపైగా.. జాతీయస్థాయి.. : 100 మందికిపైగా.. రాష్ట్రస్థాయి.. : 2 వేలకుపైగా.. ఏమి చేయాలి : {పభుత్వం క్రీడాకారులకు కోటా కేటాయించాలి.. అధికారుల వ్యవహారం సరికాదు.. కష్టపడి చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తున్న క్రీడాకారులకు అధికారుల నిర్లక్ష్యం శాపమైంది. ఉన్నత హోదాలో ఉన్న వారు ఈ విధం గా వ్యవహరించడం సరికాదు. - అరవింద్,హ్యండ్‌బాల్ జాతీయస్థాయి క్రీడాకారుడు, మంచిర్యాల రిజర్వేషన్ అమలు చేయాలి.. అన్ని వర్గాలకు రిజర్వేషన్ ప్రకటించిన అధికారులకు క్రీడాకారులకు రిజర్వేషన్ గుర్తుండకపోవడం శోచనీయం. వీఆర్ఏ, వీఆర్వో, కార్యదర్శి నియామకాల్లో క్రీడాకారుల రిజర్వేషన్ అమలు చేయాలి. - మానస, ఫుట్‌బాల్ క్రీడాకారిణి, లక్సెట్టిపేట


