స్పోర్ట్స్ కోటాలో మెడికల్ సీట్ల కేటాయింపులో జరిగిన అక్రమాలపై ఏసీబీ మరో కేసు నమోదుచేసింది. జూడో అసోసియేషన్ సెక్రటరీ కైలాసం యాదవ్‌ను అరెస్టు చేసింది. కైలాసం యాదవ్ ద్వారా స్పోర్ట్స్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్ వెంకటరమణ డబ్బులు వసూలు చేసినట్టు ఏసీబీ నిర్ధారించింది