కాపీ కొట్టి దొరికిపోయిన ‘శాప్‌’ చైర్మన్‌? | Individual Caught Cheating in Exams Appointed as Chairman of Sports Authority of Andhra Pradesh | Sakshi
Sakshi News home page

కాపీ కొట్టి దొరికిపోయిన ‘శాప్‌’ చైర్మన్‌?

Jun 5 2026 4:14 AM | Updated on Jun 5 2026 4:14 AM

Individual Caught Cheating in Exams Appointed as Chairman of Sports Authority of Andhra Pradesh

రవికుమార్‌ పరీక్షల్లో కాపీ కొట్టి దొరికిపోయిన ఉదంతంపై ఈనాడు ప్రచురించిన వార్త్త క్లిప్పింగ్‌

గతంలో ప్రవేశ పరీక్షలో కాపీ కొట్టి దొరికిపోయిన రవికుమార్‌ 

తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్న ఉదంతం

సాక్షి, అమరావతి: పరీక్షల్లో కాపీ కొట్టి దొరికిపోయిన వ్యక్తి స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (శాప్‌) చైర్మన్‌గా ఉన్నాడంటే ఆశ్చర్యంగా ఉంది కదూ. కానీ.. ఇది నిజమంటూ సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు బల్లగుద్ది చెబుతున్నారు. అంతేకాదు. వారు చెబుతున్న దానికి సాక్ష్యంగా టీడీపీకి నిత్యం బాకా ఊదే ఈనాడులో అప్పట్లో ప్రచురితమైన వార్తా కథనాలను సాక్ష్యంగా చూపిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు­లు చేస్తున్నారు. ఇప్పుడు ఈ అంశం నెట్టింట వైరల్‌గా మారింది.  2013లో తిరుపతిలో నిర్వహించిన శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం రీసెర్చ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌లో భాగంగా జరిగిన మాస్టర్‌ ఆఫ్‌ లైబ్రరీ సైన్స్‌ ప్రవేశ పరీక్షకు ప్రస్తుత శాప్‌ చైర్మన్‌ అనిమి రవికుమార్‌ (రవినాయుడు) హాజరయ్యారు.

ఆ సమయంలో ఆయన పరీక్షా కేంద్రంలో కాపీ కొడుతున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించినట్టు ఈనాడు సహా అప్పటి మీడియా కథనాలు పేర్కొ­న్నాయి. ఆ కథనాల ప్రకారం.. పరీక్ష చివరి దశలో విద్యార్థి సంఘాల నాయకులు పరీక్షా హాల్‌లోకి వెళ్లి ఇన్విజిలేటర్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం రవినాయుడు కాపీ కొడుతూ పట్టుబడ్డారని వార్తలు వెలువడ్డాయి. క్రీడాకారుల భవిష్యత్‌కు సంబంధించిన కీలక పదవిలో ఉన్న వ్యక్తి వెనుక ఇలాంటి గతం ఉండటం ఇప్పుడు రాష్ట్ర ప్రజలను విస్మయానికి గురి చేస్తోంది.  

ఇప్పుడేమంటారో!! 
డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటా ఎంపికలపై తీవ్ర ఆరోపణలు వెలువడుతున్న నేపథ్యంలో అవన్నీ నిరాధార ఆరోపణలని, బాధితులు కూడా లేరని, దీనిపై ఎలాంటి చర్చకైనా తాను సిద్ధమని శాప్‌ చైర్మన్‌ ప్రగల్బాలు పలికారు. ఆయన సవాల్‌కు సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు గట్టి సమాధానం ఇస్తున్నారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలకు సంబంధించి బాధితులు బయటకు వచ్చి మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి తమ గోడు చెప్పుకున్నారు. ఆ సమయంలో బంగారు పతకం సాధించిన వారికి ఉద్యోగం ఇవ్వకుండా కాంస్య పతకం, పార్టిసిపేషన్‌ సరి్టఫికెట్‌ ఉన్న వారికి స్పోర్ట్స్‌ కోటాలో టీచర్‌ పోస్టులు ఇచ్చేశారంటూ ఆధారాలతో సహా చూపించి కన్నీటి పర్యంతమయ్యారు. ఆ వీడియోలను రవికుమార్‌ సవాల్‌కు చెంపపెట్టుగా నెటిజన్లు చూపిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement