భారీగా తగ్గుతున్న బంగారం ధరలు: కారణం ఇదే.. | Gold Price Down Check The Reason Here | Sakshi
Sakshi News home page

భారీగా తగ్గుతున్న బంగారం ధరలు: కారణం ఇదే..

May 2 2025 8:11 PM | Updated on May 2 2025 8:31 PM

Gold Price Down Check The Reason Here

గ్లోబల్ మార్కెట్లలో టారిఫ్ భయం తగ్గిపోతున్న క్రమంలో.. బంగారం ధరలు కుప్పకూలుతున్నాయి. దీంతో గోల్డ్ రేటు లక్ష రూపాయల నుంచి సుమారు రూ. 7000 తగ్గింది. దీంతో కొనుగోలుదారుల్లో కూడా బంగారం కొనాలా? వద్దా? అనే ప్రశ్న మొదలైపోయింది. ఎందుకంటే ఇంకా తగ్గుముఖం పడుతుందేమో అనే ఆలోచన వారిలో తలుపుతట్టింది.

గత వారం గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 3500.05 డాలర్ల వద్ద ఉంది. అయితే గురువారం రోజు 2.2 శాతం క్షీణించి 3216.41 డాలర్లకు పడిపోయింది. ప్రస్తుతం భారతదేశంలో కూడా బంగారం ధరలు రూ. 95510 వద్ద ఉన్నాయి. ఏప్రిల్ నెలతో పోలిస్తే.. ఈ ధరలు కొంత తక్కువే అని స్పష్టమవుతోంది.

బంగారం ధరలు తగ్గడానికి కారణం
ప్రపంచ వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గడం వల్ల సురక్షితమైన ఆస్తులకు డిమాండ్ తగ్గింది. దీంతో పెట్టుబడిదారులు మళ్ళీ లాభాలను ఆర్జించడానికి సిద్ధమయ్యాయి. అంతే కాకుండా దక్షిణ కొరియా, జపాన్, భారతదేశంతో సంభావ్య వాణిజ్య ఒప్పందాల గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచనలు..  చైనాతో ఒప్పందం గురించి సానుకూల వ్యాఖ్యలు కూడా బంగారం ధరల తగ్గుదలకు కారణమైందని ఏంజెల్ వన్‌లో కమోడిటీస్ అండ్ కరెన్సీల చీఫ్ టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్ 'తేజస్ అనిల్ షిగ్రేకర్' అన్నారు.

ఇదీ చదవండి: ఆ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు: జాబితాలో ఉన్న మోడల్స్ ఇవే..

అమెరికా సుంకాలను నివారించడానికి అనేక ప్రధాన వాణిజ్య భాగస్వాములు "చాలా మంచి" ఆఫర్లను అందించారని, ఒప్పందం కుదుర్చుకున్న మొదటి దేశాలలో భారతదేశం ఉంటుందని అమెరికా ట్రెజరీ కార్యదర్శి 'స్కాట్ బెసెంట్' అన్నారు. మొత్తం మీద రాబోయే మూడు నుంచి నాలుగు నెలల్లో బంగారం మరింత తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement