
శుక్రవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 259.75 పాయింట్లు లేదా 0.32 శాతం లాభంతో 80,501.99 వద్ద, నిఫ్టీ 12.50 పాయింట్లు లేదా 0.051 శాతం లాభంతో 24,346.70 వద్ద నిలిచాయి.
జుల్లుందూర్ మోటార్ ఏజెన్సీ ఢిల్లీ, స్పోర్ట్‌కింగ్ ఇండియా, జోడియాక్ క్లాతింగ్ కంపెనీ, క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్, ఫోర్స్ మోటార్స్ వంటి కంపెనీలు లాభాలను చవి చూశాయి. యునైటెడ్ పాలీఫ్యాబ్ గుజరాత్, గోద్రేజ్ ఆగ్రోవెట్, జీ-టెక్ జైన్ఎక్స్ ఎడ్యుకేషన్, వైశాలి ఫార్మా, మాలు పేపర్ మిల్స్ మొదలైన కంపెనీలు నష్టాలను చవిచూశాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు).