దేశీ డిమాండ్ పెంచే చర్యలు
ఈవై ఎకానమీ వాచ్ నివేదిక
దేశీయంగా బలంగా ఉన్న డిమాండ్‌కు ప్రేరణనివ్వడం ద్వారా వచ్చే బడ్జెట్ (2026–27) వృద్ధికి మద్దతుగా నిలుస్తుందని ఈవై ఎకానమీ వాచ్ తన అంచనా వ్యక్తం చేసింది. వృద్ధికి అనుకూలమైన ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధానాన్ని సానుకూలంగా పేర్కొంది. ఆదాయపన్ను మినహాయింపులు, జీఎస్‌టీ సంస్కరణలతో కొంత ఆదాయం కోల్పోవాల్సి వస్తున్నప్పటికీ.. పన్నేతర ఆదాయం కింద బడ్జెట్‌లో పేర్కొనని అదనపు ఆదాయం, బడ్జెట్‌లో ప్రకటించిన కొన్ని రకాల వ్యయాలను తగ్గించుకోవడం ద్వారా ప్రభుత్వం నిర్దేశించుకున్న ద్రవ్యలోటు, మూలధన వ్యయాల లక్ష్యాలను చేరుకోవచ్చని అంచనా వేసింది.
ప్రభుత్వం ఆదాయం పెంచుకునేందుకు ఇటీవలే పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం, జాతీయ భద్రతా, ప్రజారోగ్యం సెస్సులను ప్రస్తావించింది. పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీ, పాన్ మసాలాపై సెస్సును అమలు చేసే రెండు చట్టాలకు పార్లమెంట్ ఇటీవలే ఆమోదించడం తెలిసిందే. ‘‘ఇక ముందూ భారత్ వృద్ధికి మద్దతుగా దేశీ డిమాండ్‌పైనే ఆధారపడడం కొనసాగొచ్చు. దీనికితోడు ఆర్‌బీఐ వృద్ధి ఆధారిత విధానంతో 2026–27 బడ్జెట్ వృద్ధికి మద్దతుగా ఉంటుందని అంచనా వేయొచ్చు’’అని ఈవై ఇండియా ముఖ్య విధాన సలహాదారు డీకే శ్రీవాస్తవ తెలిపారు.
అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులతో వాస్తవ జీడీపీ వృద్ధికి ఎగుమతుల రూపంలో సమకూరేది ప్రతికూలంగా ఉండొచ్చని ఈవై ఎకా నమీ వాచ్ పేర్కొంది. రెండో త్రైమాసికం జీడీపీ వృద్ధి (సెప్టెంబర్ క్వార్టర్)లో ఎగుమతుల వాటా మైనస్ 2.1 శాతంగా ఉన్నట్టు గుర్తు చేసింది. జూన్ త్రైమాసికంలో ఇది మైనస్ 1.4 శాతంగా ఉందని, అక్క డి నుంచి పెరిగినట్టు తెలిపింది. వాణిజ్య అనిశి్చతులు సమసిపోయే వర కు ఇదే పరిస్థితి కొనసొ గొచ్చని అంచనా వేసింది. భారత్ మధ్య కాలానికి 6.5% వృద్ధిని కొనసాగించొచ్చని శ్రీవాస్తవ అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: టర్మ్ ఇన్సూరెన్స్.. డబ్బులు దండగా..!?


