విప్రో కన్జూమర్ కేర్ అండ్ లైటింగ్ సంస్థకు చెందిన ‘సంతూర్’ సబ్బు దేశంలోనే అతిపెద్ద సోప్ బ్రాండ్‌గా అవతరించింది. గడిచిన ఏడాది కాలంలో రూ.2,850 కోట్ల విలువైన సంతూర్ సోప్‌ల అమ్మకాలు జరిగినట్లు ఇన్వాయిస్డ్ సేల్స్ (ఇండాస్) డేటా వెల్లడించింది. ప్రతి భారతీయ మహిళకు ‘యవ్వనమైన, కాంతివంతమైన చర్మం’ అనే ట్యాగ్‌లైన్‌తో సంతూర్ గుర్తింపు పొందింది. తర్వాత ‘సంతూర్ మామ్’ ప్రచారంతో కస్టమర్లను విశేషంగా ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా కంపెనీ సీఈఓ వినీత్ అగర్వాల్ మాట్లాడుతూ... ‘కస్టమర్ల అవసరాలపై లోతైన అవగాహన, వ్యూహాలను కఠిన క్రమశిక్షణతో అమలు చేయడం, దీర్ఘకాలంలో స్థిరమైన విలువను సృష్టిస్తుందనే నమ్మకం, ఆకర్షణీయమైన ప్రకటనలు విజయానికి కారణమయ్యాయి. 1986లో కేవలం రూ.60 కోట్ల ఆదాయంతో ప్రారంభమైన సంతూర్, వ్యూహాత్మక విస్తరణతో 2018లో రూ.2,000 కోట్ల మైలురాయిని దాటింది. ప్రస్తుతం రూ.2,850 కోట్ల ఆదాయంతో లైఫ్‌బాయ్‌ను అధిగమించి దేశంలోనే నంబర్ వన్ సబ్బు బ్రాండ్‌గా నిలిచింది’ అని అన్నారు.
ఇదీ చదవండి: టర్మ్ ఇన్సూరెన్స్.. డబ్బులు దండగా..!?


