breaking news
santoor soaps
-
దేశంలో అతిపెద్ద సోప్ బ్రాండ్ ఏదంటే..
విప్రో కన్జూమర్ కేర్ అండ్ లైటింగ్ సంస్థకు చెందిన ‘సంతూర్’ సబ్బు దేశంలోనే అతిపెద్ద సోప్ బ్రాండ్‌గా అవతరించింది. గడిచిన ఏడాది కాలంలో రూ.2,850 కోట్ల విలువైన సంతూర్ సోప్‌ల అమ్మకాలు జరిగినట్లు ఇన్వాయిస్డ్ సేల్స్ (ఇండాస్) డేటా వెల్లడించింది. ప్రతి భారతీయ మహిళకు ‘యవ్వనమైన, కాంతివంతమైన చర్మం’ అనే ట్యాగ్‌లైన్‌తో సంతూర్ గుర్తింపు పొందింది. తర్వాత ‘సంతూర్ మామ్’ ప్రచారంతో కస్టమర్లను విశేషంగా ఆకట్టుకుంది.ఈ సందర్భంగా కంపెనీ సీఈఓ వినీత్ అగర్వాల్ మాట్లాడుతూ... ‘కస్టమర్ల అవసరాలపై లోతైన అవగాహన, వ్యూహాలను కఠిన క్రమశిక్షణతో అమలు చేయడం, దీర్ఘకాలంలో స్థిరమైన విలువను సృష్టిస్తుందనే నమ్మకం, ఆకర్షణీయమైన ప్రకటనలు విజయానికి కారణమయ్యాయి. 1986లో కేవలం రూ.60 కోట్ల ఆదాయంతో ప్రారంభమైన సంతూర్, వ్యూహాత్మక విస్తరణతో 2018లో రూ.2,000 కోట్ల మైలురాయిని దాటింది. ప్రస్తుతం రూ.2,850 కోట్ల ఆదాయంతో లైఫ్‌బాయ్‌ను అధిగమించి దేశంలోనే నంబర్ వన్ సబ్బు బ్రాండ్‌గా నిలిచింది’ అని అన్నారు.ఇదీ చదవండి: టర్మ్ ఇన్సూరెన్స్.. డబ్బులు దండగా..!? -
మానవత్వం మరిచి సబ్బులు ఎత్తుకెళ్లారు!
లక్సెట్టిపేట: మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మున్సిపాలిటీ పరిధి ఇటిక్యాల గ్రామ స్టేజీ సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం అర్ధరాత్రి రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ డ్రైవర్ మృతి చెందాడు. దేవాపూర్ నుంచి మహారాష్ట్రలోని నాందేడ్‌కు వెళ్తున్న సిమెంటు ట్యాంకర్ లారీ, హైదరాబాద్ నుంచి సంతూర్ సబ్బుల లోడ్‌తో ఛత్తీస్‌గఢ్ వెళ్తున్న లారీఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కాసిపేట మండలం పలాంగూడ గ్రామానికి చెందిన ట్యాంకర్ లారీ డ్రైవర్ శ్రీనివాస్ (52) క్యాబిన్లో ఇరుక్కుని మృతిచెందాడు.పోలీసులు రెండు గంటలపాటు శ్రమించి మృతదేహాన్ని బయటకు తీశారు. మరో లారీ డ్రైవర్ సచిన్‌కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇదిలా ఉండగా.. సంతూర్ సబ్బుల లారీ యాక్సిడెంట్‌కు గురైన విషయం తెలియడంతో సమీపంలోని ప్రజలు పెద్దఎత్తున సంఘటన స్థలానికి చేరుకుని లారీపైకి ఎక్కి ఇష్టారాజ్యంగా సబ్బులు ఎత్తుకెళ్లారు. సబ్బులను సంచుల్లో నింపుకొని కొందరు వెళ్లగా, మరికొందరు పెట్టెలను ఎత్తుకుని వెళ్లారు. ప్రమాదంలో గాయపడ్డ డ్రైవర్లు ఒకవైపు నెత్తురోడుతూ ఉండగా వారిని రక్షించకుండా స్థానికులు సబ్బులకోసం ఎగబడ్డారు. గురువారం ఉదయం కూడా పలువురు సబ్బులను తీసుకెళ్లడం కనిపించింది. -
రష్మికకు ప్రపోజ్ చేసిన రౌడీ హీరో.. వీడియో వైరల్
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, కన్నడ బ్యూటీ రష్మికల కెమిస్ట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘గీతా గోవిందం’ నుంచి వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ‘డియర్ కామ్రేడ్’ సినిమాతో ఆ స్నేహం మరింత బలపడింది. ఒకనొక దశలో వీరిద్దరి మధ్య ప్రేమాయాణం నడుస్తుందనే పుకార్లు కూడా వచ్చాయి. అయితే తమ మధ్య ప్రేమ, దోమ ఏదీ లేదని, ఫ్యామిలీ ప్రెండ్స్ మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు. ‘గీతా గోవిందం’, డియర్ కామ్రేడ్ సినిమాల్లోనూ వీరిద్దరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీకి ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ఈ కాంబినేషన్ నుంచి మరో సినిమా రావాలని అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. తాజాగా ఫ్యాన్స్ కోరిక నెరవేరింది. అయితే అది సినిమా రూపంలో కాకుండా యాడ్ రూపంలో నెరవేరింది. సంతూర్ సోప్ యాడ్‌లో ఈ జంట కలిసి నటించింది. ఇప్పటికే ముంబైలో యాడ్ షూట్ పూర్తి అయింది. త్వరలో టెలికాస్ట్ కాబోయే ఈ కమర్షియల్ యాడ్‌లో విజయ్, రష్మికకు ప్రపోజ్ చేశాడు. విజయ్ మోకాళ్లపై కూర్చుని గిఫ్ట్ ఇస్తూ రష్మికకు ప్రపోజ్ చేశాడు. ఇందుకు సంబంధించిన పిక్స్, వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లైగర్’ లో నటిస్తున్నాడు. ఇందులో అనన్య పాండే హీరోయిన్గా నటిస్తోంది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం ‘పుష్ప’లో హీరోయిన్గా నటిస్తోంది రష్మిక. అలాగే ఓ బాలీవుడ్ సినిమాలో కూడా నటిస్తోంది. The New Faces of #Santoor@TheDeverakonda & @iamRashmika #VijayDeverakonda and #RashmikaMandanna have recently done a TVC shoot. Clip from BTS footage. pic.twitter.com/WE6gJ5xkD3 — BARaju (@baraju_SuperHit) April 20, 2021 -
సబ్బుల ధరలు తగ్గాయ్..
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ కంపెనీలు కంపెనీలు తమ సబ్బుల ధరలను తగ్గించాయి అంతంత మాత్రంగానే ఉన్న అమ్మకాలను పెంచుకోవడం లక్ష్యంగా హిందుస్తాన్ యూనిలీవర్, ఐటీసీ కంపెనీలు తమ తమ సబ్బుల ధరలను తగ్గించాయి. సబ్బుల తయారీలో ఉపయోగపడే పామ్ఆయిల్ ధరలు తగ్గడం కూడా కలసిరావడంతో ఈ నిర్ణయం తీసుకున్నాయి.. హెచ్‌యూఎల్ గత నెలలోనే లక్స్, లైఫ్‌బాయ్ ధరలను తగ్గించగా... సంతూర్ సబ్బుల ధరలను విప్రో తాజాగా తగ్గించింది. -
ఫోన్ బుక్ చేస్తే సబ్బులు వచ్చాయి
మెళియాపుట్టి: మెళియాపుట్టి గ్రామానికి చెందిన త్రినాథ్‌రధో మొబైల్ కోసం ఆర్డర్ ఇస్తే పార్శిల్లో సబ్బులు రావడంతో నివ్వెరపోయారు. రూ.15,990 విలువ గల మొబైల్ కోసం ప్లిప్‌కార్ట్‌లో (ఆన్లైన్లో) బుక్ చేశారు. గురువారం వచ్చిన పార్శిల్‌ను తెరచి చూసేసరికి మొబైల్‌కు బదులు ఐదు సంతూరు సబ్బుల ప్యాకెట్ రావడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. ఇలా ఆన్లైన్లో మోసపోవడం పట్ల త్రినాథ్‌రధో ఆవేదన వ్యక్తం చేశారు. -
నకిలీ సంతూర్ సబ్బులు స్వాధీనం
హైదరాబాద్: నకిలీ సంతూర్ సబ్బులు అమ్ముతున్న రెండు షాపులపై పోలీసులు దాడిచేసి రూ.3 వేల విలువ చేసే నకిలీ సబ్బులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఎల్బీనగర్ మజీద్గల్లీ సమీపంలో రెండు షాపుల్లో నకిలీ సంతూర్ సబ్బులు విక్రయిస్తున్నట్లు విప్రో కంపెనీ ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో శుక్రవారం షాపులపై దాడిచేసి వారి వద్ద నుంచి రూ.3 వేల నకిలీ సంతూర్ సబ్బులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


