TG: వడదెబ్బ మరణాల ఎక్స్ గ్రేషియా రూ. 4లక్షలకు పెంపు | RS 4 Lakhs ex gratia deceased due to Sunstroke In Telangana | Sakshi
Sakshi News home page

TG: వడదెబ్బ మరణాల ఎక్స్ గ్రేషియా రూ. 4లక్షలకు పెంపు

May 2 2025 4:37 PM | Updated on May 2 2025 5:40 PM

RS 4 Lakhs ex gratia deceased due to Sunstroke In Telangana

హైదరాబాద్: వడదెబ్బ మరణాల ఎక్స్ గ్రేషియాను రూ. 4 లక్షలకు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో  వడదెబ్బ మరణాల ఎక్స్ గ్రేషియా రూ. 50 వేలు ఉంటే దాన్ని రూ. 4 లక్షలకు పెంచింది ప్రభుత్వం​. ఈ మేరకు హీట్ వేవ్ పై 12 విభాగాలతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్షించారు.  

వడగాల్పులపై హీట్ వేవ్ యాక్షన​ ప్లాన్ ను రూపొందించారు. దీనిలో భాగంగా వడదెబ్బ మరణాల ఎక్స్ గ్రేషియాను రూ. 4 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అన్ని ప్రాంతాల్లో చ‌లివేంద్రాలు, మ‌జ్జిగ కేంద్రాలు. ఓఆర్ఎస్ ప్యాకెట్ల సరఫరా అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయాలన్నారు మంత్రి పొంగులేటి.

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement