
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి గతేడాది అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు విడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. టీ20 వరల్డ్‌కప్-2024 విజయం అనంతరం కోహ్లి తన నిర్ణయాన్ని వెల్లడించి అందరికి షాకిచ్చాడు. అతడితో పాటు సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలు కూడా ఇంటర్నేషనల్ టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
అయితే తాజాగా తన రిటైర్మెంట్ వెనక గల కారణాన్ని కోహ్లి వెల్లడించాడు. యువ ఆటగాళ్లకు అవకాశమిచ్చేందుకు ఆ నిర్ణయం తీసుకున్నట్లు కోహ్లి చెప్పుకొచ్చాడు. "టీ20లకు రిటైర్మెంట్ అన్ని ఆలోచించాకే ప్రకటించాను. కొత్త ఆటగాళ్లు జట్టులోకి రావాలని, వారు సిద్దమయ్యేందుకు కాస్త సమయం అవసరమని భావించాను.
వారు తదుపరి టీ20 వరల్డ్‌కప్‌కు సిద్దంగా ఉండేందుకు కనీసం రెండేళ్ల సమయమైనా కావాలి. అందుకే వరల్డ్‌కప్ అనంతరం టీ20 క్రికెట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను" అని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లి పేర్కొన్నాడు.
కాగా కోహ్లి అంతర్జాతీయ టీ20 క్రికెట్ నుంచి తప్పుకున్నప్పటి ఐపీఎల్‌లో మాత్రం దుమ్ములేపుతున్నాడు. ఐపీఎల్-2025లో ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 138.87 స్ట్రైక్ రేట్‌తో 443 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లలో ఆరు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఆరెంజ్ క్యాప్ జాబితాలో మూడవ స్థానంలో కోహ్లి కొనసాగుతున్నాడు.
చదవండి: IPL 2025: చరిత్ర సృష్టించిన సాయి సుదర్శన్.. సచిన్ రికార్డు బద్దలు