వన్డేల్లో న్యూజిలాండ్‌తో చేతిలో ఎదురైన పరభావానికి టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. ఆదివారం గౌహతి వేదికగా కివీస్‌తో జరిగిన మూడో టీ20లో 8 వికెట్ల తేడాతో భారత్ విజయ భేరి మ్రోగించింది. దీంతో ఐదు టీ20ల సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు మిగిలూండగానే 3-0 తేడాతో భారత్ సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో మెన్ ఇన్ బ్లూ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది.
తొలుత బౌలింగ్‌లో పర్యాటక జట్టును కేవలం 153 పరుగులకే కట్టడి చేసిన భారత్.. అనంతరం బ్యాటింగ్‌లోనూ దుమ్ములేపింది. ఓపెనర్ అభిషేక్ శర్మ( 20 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 68 నాటౌట్) విధ్వంసం సృష్టించగా.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 57 నాటౌట్) మరో హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు.
ఫలితంగా 154 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 10 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి చేధించింది. కాగా పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో మురళీ కార్తీక్ నుంచి కెప్టెన్ సూర్యకుమార్‌కు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. నువ్వు స్కూల్లో ఉన్నప్పుడు కూడా ఇలానే ఆధిపత్యాన్ని చెలాయించావా? అని కార్తీక్ ప్రశ్నించాడు.
"మా స్కూల్ ప్రిన్సిపాల్ , టీచర్లు క్రికెట్ ఆడేందుకు నాకు చాలా సమయం ఇచ్చేవారు. పరీక్షల సమయం, స్కూల్ టైమ్‌లో కూడా నాకు చాలా సెలవులు ఇచ్చారు. గ్రౌండ్‌కు వెళ్లి ప్రాక్టీస్ చేసేవాడని. అక్కడే నేను ఆటలోని మెలకువలన్నీ నేర్చుకున్నాను. ఈ లక్ష్య చేధన గురించి మేం ముందే మాట్లాడుకున్నాం. మేము మొదట బ్యాటింగ్ చేసినా, బౌలింగ్ చేసినా ఒకే బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడాలనుకుంటున్నాము.
ఒకవేళ రేపు మ్యాచ్‌లో 20 పరుగులకే 3 వికెట్లు లేదా 40 పరుగులకే 4 వికెట్లు పడినా, పరిస్థితికి తగ్గట్టు ఎలా బ్యాటింగ్ చేయాలో మాకు తెలుసు. మా జట్టులో అద్భుతమైన బ్యాటర్లు ఉన్నారు. ఇక మా టాప్ 2-3 బ్యాటర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారు నా పనిని సులభం చేస్తున్నారు. ఇక బిష్ణోయ్ తన రీ ఎంట్రీ మ్యాచ్‌లో అసాధరణ ప్రదర్శన కనబరిచాడు.
బిష్ణోయ్ తన రోల్‌పై ఫుల్ క్లారిటీగా ఉన్నాడు. అతడికి తన బలాలు ఏంటో తెలుసు. క్లిష్ట సమయాల్లో వికెట్లు అందించడం అతడిప్రత్యేకత. రవి చాలా జట్టులో ఉండడం మాకు ప్లస్ పాయింట్" అని సూర్య పేర్కొన్నాడు. కాగా భారత జట్టును కెప్టెన్‌గా సూర్యకుమార్ అద్భుతంగా నడిపిస్తున్నాడు. అతడి కెప్టెన్సీలో 41 మ్యాచ్‌లు ఆడిన భారత్ 33 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.


