
ఐపీఎల్-2025లో గుజరాత్ టైటాన్స్ యువ ఓపెనర్ సాయిసుదర్శన్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సుదర్శన్ విధ్వంసం సృష్టించాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లను ఊతికారేశాడు.
ముఖ్యంగా గుజరాత్ ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన స్టార్ పేసర్ మహ్మద్ షమీకి సుదర్శన్ చుక్కలు చూపించాడు. ఆ ఓవర్‌లో ఐదు ఫోర్ల సాయంతో ఏకంగా 20 పరుగులు పిండుకున్నాడు. ఓవరాల్‌గా 23 బంతులు ఎదుర్కొన్న 9 ఫోర్ల సాయంతో 48 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో సుదర్శన్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
టీ20ల్లో అత్యంతవేగంగా 2000 పరుగుల మైలు రాయిని అందుకున్న భారత క్రికెటర్‌గా సాయి సుదర్శన్ రికార్డు సృష్టించాడు. సుదర్శన్ కేవలం 54 ఇన్నింగ్స్‌లలో అందుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది.
సచిన్ ఈ ఘనతను 59 ఇన్నింగ్స్‌లలో అందుకున్నాడు. తాజా మ్యాచ్‌తో సచిన్ రికార్డును ఈ తమిళనాడు బ్యాటర్ బ్రేక్ చేశాడు. ఓవరాల్‌గా ఈ రేర్ ఫీట్ సాధించిన జాబితాలో ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ షాన్ మార్ష్(53) అగ్రస్దానంలో ఉండగా.. రెండో స్దానంలో సుదర్శన్ కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు ఈ రికార్డు బ్రాడ్ హాడ్జ్ , మార్కస్ ట్రెస్కోథిక్, ముహమ్మద్ వసీం పేరిట సంయుక్తంగా ఉండేది. తాజా మ్యాచ్‌తో వీరిని సుదర్శన్ అధిగమించాడు.
చదవండి: బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్‌లకు షాక్.. అకౌంట్లు బ్లాక్