నేచర్‌ క్యాంప్, ఫారెస్ట్‌ ట్రెకింగ్‌ అంటే ఇష్టమా..? | Do you like nature camping and forest trekking? check deets inside | Sakshi
Sakshi News home page

నేచర్‌ క్యాంప్, ఫారెస్ట్‌ ట్రెకింగ్‌ అంటే ఇష్టమా..?

May 2 2025 12:41 PM | Updated on May 2 2025 1:20 PM

Do you like nature camping and forest trekking? check deets inside

గచ్చిబౌలి తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో డెక్కన్‌ వుడ్స్, ట్రైల్స్‌ పేరిట వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు టీజీఎఫ్‌డీసీ ఎకో టూరిజం ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రంజిత్‌ నాయక్‌ తెలిపారు. 3వ తేదీ నుంచి మంరేవులలోని ఫారెస్ట్‌ ట్రెక్‌ పార్క్‌లో సాయంత్రం 4 నుం మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకు రాక్‌ బే నేచర్‌ క్యాంప్‌ ఉంటుందన్నారు. టీం బిల్డింగ్, టెంట్‌ పిచింగ రాత్రి పూట అడవిలో నడక, నైట్‌ క్యాపింగ్, క్యాంప్‌ ఫైర్, ఉదయం బర్డ్‌ వాచింగ్, ట్రెక్కింగ్, నేచర్‌ ట్రయల్‌ వంటి కార్యక్రమాలు ఉంటాయన్నారు.  (Summer Vacation వాయిద్యాలను పలికించడం ఆరోగ్యకరం)

కొత్తగూడలోని బొటానికల్‌ గార్డెన్‌లో ప్రతి శనివారం ఉదయం 9 గంటలకు ఎకో బస్‌ టూర్‌లో ఆడియో, వీడియో హాల్‌లో చెట్ల ప్రాముఖ్యతను వివరిస్తారు. సీతాకొక చిలుకల మీద ప్రజెంటేషన్, బ్యాటరీ ఆపరేటెడ్‌ వెహికిల్‌పై 75 థీమ్‌ పార్క్‌లు, వృక్ష పరిచయ క్షేత్రం చూపిస్తారు. అనంతరం జీవవైవిద్యంలో పాముల ప్రాముఖ్యతపై ఫ్రెండ్స్‌ ఆఫ్‌ స్నేక్‌ సొసైటీ వివరిస్తుంది. వర్చువల్‌ వైల్డ్‌లైఫ్‌ సఫారీ, గిరిజన జీవన శైలి, సంస్కృతి, వెస్ట్రన్‌గార్డ్స్, ఈస్ట్రన్స్‌ గార్డ్స్, 9డి సినిమా, స్పేస్‌ అక్వైరియం, థీమ్‌ ఫారెస్ట్‌ను వీక్షించవచ్చు. ఏసీ బస్సులో మృగవని నేషనల్‌ పార్క్‌కు తీసుకెళ్తారు. 4వ తేదీన ఫారెస్ట్‌ ట్రెక్‌ పార్క్‌లో బర్డ్స్‌ వాక్‌ నిర్వహిస్తారు. (అత్తగారు, ఆవకాయ పచ్చడి : ఉపాసన కొణిదెల వీడియో వైరల్‌)

బొటానికల్‌ గార్డెన్‌లో సమ్మర్‌ డే క్యాంప్‌ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉంటుంది. బర్డ్స్‌ వాక్, స్నేక్‌ షో, థీమ్‌ పార్క్‌లు, వైల్డ్‌ లైఫ్‌ సఫారీలను చూపిస్తారు. 
వివరాల కోసం ఫోన్‌: 9493549399, 9885298980.  
 

Advertisement
 
Advertisement
Advertisement