శ్రీదేవి భర్త బోనీ కపూర్ ఇంట తీవ్ర విషాదం | Boney Kapoor and Anil Kapoor Mother Nirmal Kapoor Passes Away | Sakshi
Sakshi News home page

Boney kapoor: బోనీ కపూర్‌కు మాతృ వియోగం.. బాలీవుడ్ ప్రముఖుల సంతాపం

May 2 2025 7:57 PM | Updated on May 2 2025 8:27 PM

Boney Kapoor and Anil Kapoor Mother Nirmal Kapoor Passes Away

బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్‌ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి నిర్మల్ కపూర్‌(90) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో ముంబయిలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చేరిన ఆమె ఇవాళ సాయంత్రం తుదిశ్వాస విడిచారు. కాగా.. ఆమెకు ప్రముఖ నిర్మాత, శ్రీదేవి భర్త బోనీ కపూర్‌, నటుడు సంజయ్ కపూర్ కూడా సంతానం. వీరితో పాటు రీనా కపూర్‌ ఆమె ఓ కుమార్తె కూడా ఉన్నారు.  ఈ విషయం తెలుసుకున్న పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆమె మరణం పట్ల సంతాపం తెలియజేస్తున్నారు.

ఈ విషయం తెలుసుకున్న వెంటనే శ్రీదేవి భర్త బోనీ కపూర్, ఆయన కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్‌తో పాటు శిఖర్ పహరియా, షనాయా కపూర్‌ల ముంబయి లోఖండ్‌వాలాలోని అనిల్ కపూర్ ఇంటికి చేరుకున్నారు. కాగా.. గతేడాది సెప్టెంబర్‌లో నిర్మల్ కపూర్‌ 90వ పుట్టినరోజు వేడుకను అందరూ కలిసి గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు.

కాగా.. నిర్మల్ కపూర్ ప్రముఖ నిర్మాత సురీందర్ కపూర్‌ను వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ అనిల్ కపూర్, బోనీ కపూర్, సంజయ్ కపూర్, రీనా కపూర్‌ అనే నలుగురు జన్మించారు. అంతే కాకుండా ఆమెకు అర్జున్ కపూర్, సోనమ్ కపూర్, రియా కపూర్, హర్ష్ వర్ధన్ కపూర్, జాన్వీ కపూర్, అన్షులా కపూర్, ఖుషీ కపూర్, మోహిత్ మార్వా అనే మనవలు, మనవరాళ్లు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement