‘కేసీఆర్ పాలనలో మంత్రులకు పవర్ లేదు’ | Minister Ponguleti Srinivas Reddy On Former CM KCR | Sakshi
Sakshi News home page

‘కేసీఆర్ పాలనలో మంత్రులకు పవర్ లేదు’

May 2 2025 8:34 PM | Updated on May 2 2025 8:43 PM

Minister Ponguleti Srinivas Reddy On Former CM KCR

హైదరాబాద్:   మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శలు గుప్పించారు. రెవెన్యూ వ్యవస్థను కేసీఆర్ తన దగ్గర పెట్టుకొని పూర్తిగా నాశనం చేశారని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో మంత్రులకు పవర్ లేదని, స్వేచ్చగా రివ్యూ చేసుకునే పరిస్థితి ఉండేది కాదన్నారు పొంగులేటి. ఈరోజు(శుక్రవారం) మీడియాతో చిట్ చాట్ చేసిన పొంగులేటి.. ‘ ఆనాడు మంత్రులను కేసీఆర్ పని చేయనియ్యలేదు. భూ భారతి వల్ల 70శాతం ప్రజలకు ఉపయోగం జరిగినా మేము సక్సెస్ అయినట్లే. 

భూ భారతిలో కొత్త సాఫ్ట్ వేర్ రాబోతోంది. ఇందిరమ్మ ఇండ్లలో అవినీతి జరగదు. జరగనివ్వను. త్వరలోనే రాష్ట్రంలో సర్వేయర్లు నోటిఫికేషన్ విడుదల చేస్తాం. జూన్ లో సర్వే  మ్యాప్ పైలెట్ ప్రాజక్టు ద్వారా రిజస్ట్రేషన్లు చేస్తాం. ఆరువేల దరఖాస్తులు సర్వేకు వచ్చాయి. భర్తీ చేయబోతున్నాం. ప్రైవేట్ సర్వేయర్లతో భూముల సర్వే జరుగుతుంది.. ప్రభుత్వ పర్యవేక్షణ సైతం ఉంటుంది’ అని అన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement