కొత్త కారు కొన్న 'బిగ్ బాస్ 8' నైనిక.. రేటు ఎంతంటే? | Bigg Boss 8 Telugu Nainika Buys New Car | Sakshi
Sakshi News home page

Nainika: కొత్త కారుతో బిగ్ బాస్ బ్యూటీ.. ఫొటోలు వైరల్

May 2 2025 7:07 PM | Updated on May 2 2025 7:35 PM

Bigg Boss 8 Telugu Nainika Buys New Car

బిగ్ బాస్ కొత్త సీజన్ త్వరలో మొదలుకానుంది. ఇప్పటివరకు 8 సీజన్లు జరగ్గా.. కంటెస్టెంట్ వాళ్లలో చాలామంది గుర్తింపు తెచ్చుకున్నారు. మరీ సినిమా అవకాశాలైతే రావట్లేదు గానీ షోలు చేస్తూ సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే గతేడాది 8వ సీజన్ లో పాల్గొన్న డ్యాన్సర్ నైనిక ఇప్పుడు కొత్త కారు కొనుగోలు చేసింది.

(ఇదీ చదవండి: ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు.. ఈ రెండు రోజుల్లోనే)  

ఢీ షోతో డ్యాన్సర్ గా కెరీర్ ప్రారంభించిన నైనిక.. ఒకటి రెండు సీజన్లలో పాల్గొంది. మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలా వచ్చిన ఫేమ్ తో బిగ్ బాస్ అవకాశం దక్కించుకుంది. కానీ ఎన్ని వారాలు ఉండలేకపోయింది. ఫెర్ఫార్మెన్స్ సరిగా లేకపోవడం వల్ల కొన్ని వారాలకే ఎలిమినేట్ అయిపోయింది. 

షో నుంచి బయటకొచ్చిన తర్వాత అప్పుడప్పుడు షోల్లో కనిపించిన నైనిక.. మరోవైపు ప్రమోషన్స్ కూడా చేస్తూ సంపాదించుకుంటోంది. ఇప్పుడు అలా దాచుకున్న డబ్బుతో టాటా కారుని కొనుక్కుంది. దీని ధర మార్కెట్ లో రూ.10-15 లక్షల మధ్యలో ఉండొచ్చని తెలుస్తోంది.

(ఇదీ చదవండి: చేసిన ప్రతి సినిమా హిట్.. ఎవరీ శ్రీనిధి శెట్టి? 

Advertisement
 
Advertisement
Advertisement