'హిట్‌ 3' ఫస్ట్‌ డే కలెక్షన్స్‌.. నాని కెరీర్‌లో ఇదే టాప్‌ | HIT 3 Movie First Day Collection | Sakshi
Sakshi News home page

'హిట్‌ 3' ఫస్ట్‌ డే కలెక్షన్స్‌.. నాని కెరీర్‌లో ఇదే టాప్‌

May 2 2025 11:17 AM | Updated on May 2 2025 11:23 AM

HIT 3 Movie First Day Collection

నాని హీరోగా నటించిన తాజా చిత్రం ‘హిట్‌3: ది థర్డ్‌ కేస్‌’ బాక్సాఫీస్‌ వద్ద మొదటిరోజే భారీ కలెక్షన్స్‌ రాబట్టింది. ఈమేరకు అధికారికంగా మేకర్స్‌ ప్రకటించారు. శైలేష్‌ కొలను దర్శకత్వంలో వాల్‌ పోస్టర్‌ సినిమా, నాని యూనానిమస్‌ ప్రోడక్షన్స్‌ బ్యానర్స్‌ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ చిత్రం మే 1న విడుదలైంది. ఈ చిత్రంలో శ్రీనిధీ శెట్టి హీరోయిన్‌గా నటించారు. నానీకి ఓవర్‌సీస్‌లో హయ్యెస్ట్‌ గ్రాసర్‌ ఫిల్మ్‌గా హిట్‌-3 రికార్డ్‌ క్రియేట్‌ చేసింది.

ప్రపంచవ్యాప్తంగా హిట్‌-3 సినిమా రూ. 43 కోట్ల గ్రాస్‌ కలెక్ట్‌ చేసినట్లు మేకర్స్‌ ప్రకటించారు. నాని కెరీర్‌లోనే తొలిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. సులువుగా రూ. 150 కోట్ల మార్క్‌ను ఈ చిత్రం అందుకుంటుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దేశవ్యాప్తంగానే కాకుండా ఓవర్సీస్‌లోనూ అర్జున్‌ సర్కార్‌ దుమ్మురేపుతున్నాడు. ఓవర్సీస్‌లో తొలిరోజే 1.2 మిలియన్‌ డాలర్ల క్లబ్‌లో ఈ మూవీ చేరింది. ఆపై ‘బుక్‌మై షో’లోనూ ఈ చిత్రం పలు రికార్డులు క్రియేట్‌ చేసింది. 24గంటల్లోనే 2.70 లక్షల టికెట్స్‌ అమ్ముడుపోయాయి. నాని కెరీర్‌లో ఇంతమొత్తంలో టికెట్స్‌ సేల్‌ కావడం ఇదే తొలిసారి.

కథేంటంటే..
ఎస్పీ అర్జున్ సర్కార్(నాని) జమ్ము కశ్మీర్ నుంచి ఏపీకి బదిలీపై వస్తారు. డ్యూటీలో జాయిన్‌ అయ్యే కంటే ముందే అడవిలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేస్తారు. తర్వాత ఆ కేసును ఆయనే విచారణ చేస్తారు. అలా రెండో హత్య చేస్తున్న సమయంలో అర్జున్ సర్కార్ టీం సభ్యురాలు వర్ష(కోమలి ప్రసాద్‌) అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటుంది. దీంతో అర్జున్‌ సర్కార్‌ హత్యలు ఎందుకు చేస్తున్నాడో ఆమెకు వివరిస్తూ.. సీటీకే(కాప్చర్‌ టార్చర్‌ కిల్‌) డార్క్‌ వెబ్‌సైట్‌ గురించి చెబుతాడు. 

అసలు సీటీకే ఉద్దేశం ఏంటి? ఆ డార్క్‌ వెబ్‌సైట్‌ రన్‌ చేస్తున్నదెవరు? వారి లక్ష్యం ఏంటి? అర్జున్‌ సర్కార్‌ సీటీకే గ్యాంగ్‌ ఆటలకు ఎలా అడ్డుకట్ట వేశాడు? ఈ క్రమంలో ఆయనకు ఎదురైన సవాళ్లు ఏంటి? తల్లిలేని అర్జున్‌ సర్కార్‌ జీవితంలోకి మృదుల(శ్రీనిధి శెట్టి) ఎలా వచ్చింది? ఆమె నేపథ్యం ఏంటి? అర్జున్‌ సర్కార్‌ ఆపరేషన్‌కి ఆమె ఎలా సహాయపడింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Advertisement
 
Advertisement
Advertisement