
శ్రీనిధీ శెట్టి, నాని, అడివి శేష్, శైలేష్ కొలను
‘‘హిట్ 3’ సినిమా సక్సెస్ అవుతుందనుకున్నాను. కానీ... ఈ స్థాయిలో విజయం సాధిస్తుందని ఊహించలేదు. ఒక క్రైమ్ థ్రిల్లర్‌ని పెద్ద మాస్ కమర్షియల్ సినిమాలా సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందాన్నిచ్చింది. ప్రేక్షకుల స్పందన చూస్తే అద్భుతంగా అనిపించింది. మాకు ఇంతటి విజయాన్నిచ్చిన వారికి ధన్యవాదాలు’’ అని నాని తెలిపారు. శైలేష్ కొలను దర్శకత్వంలో నాని, శ్రీనిధీ శెట్టి జంటగా నటించిన చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’.
యునానిమస్ ప్రోడక్షన్స్, వాల్‌పోస్టర్ సినిమా బ్యానర్స్‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ సినిమా ఈ నెల 1న విడుదలైంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్‌లో నాని మాట్లాడుతూ– ‘‘శైలేష్‌తో నేను చేయబోయే తర్వాతి సినిమా మంచి వినోదాత్మక చిత్రం అవ్వాలని కోరుకుంటున్నాను. ఓ ఆలోచన చెప్పాడు... చాలా బాగుంది’’ అన్నారు. శైలేష్ కొలను మాట్లాడుతూ– ‘‘మంచి కంటెంట్‌ని ఆదరిస్తారని ‘హిట్ 3’తో ప్రేక్షకులు మరోసారి నిరూపించినందుకు వారందరికీ «థ్యాంక్స్’’ అని పేర్కొన్నారు.
‘‘హిట్ 3’లో నేను చేసిన అతిథిపాత్రకి ప్రశంసలు రావడం హ్యాపీగా ఉంది’’ అన్నారు అడివి శేష్. ‘‘నాని ఎప్పటి కప్పుడు తనని కొత్తగా మలుచుకుంటున్నందుకు గర్వంగా ఉంది’’ అని నిర్మాత దీప్తి చెప్పారు. ‘‘ఈ చిత్రంలో మృదులపాత్రకి నన్ను ఎంచుకున్నందుకు శైలేష్‌కి ధన్యవాదాలు’’ అని శ్రీనిధీ శెట్టి చెప్పారు.