
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన చిత్రం 'హిట్: ది థర్డ్ కేస్'. హిట్ సిరీస్‌లో వచ్చిన మూడో చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. క్రైమ్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. మే 1వ తేదీన థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో మేకర్స్ సక్సెస్ సెలబ్రేట్ చేసుకున్నారు. హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన నాని ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇండియా- పాకిస్తాన్ యుద్ధం గురించి ఆయన మాట్లాడారు.
హీరో నాని మాట్లాడుతూ..'ప్రస్తుతం పాక్‌తో యుద్ధం వల్ల పరిస్థితి సెన్సిటివ్‌గా ఉంది కదా మా టీమ్‌తో మాట్లాడా. అవతలి వాళ్లు మనకు ఏదో ప్రాబ్లమ్ క్రియేట్ చేయాలని ట్రై చేశారు. దానికి మన ఇండియన్ ఆర్మీ చాలా పద్ధతిగా తిరిగి ఇచ్చేసింది. అంటే వాళ్ల వల్ల మనదేశంలో ఒక సినిమా ఈవెంట్ కూడా రద్దు అయిందన్న సంతోషం కూడా పాకిస్తాన్‌కు ఇవ్వకూడదు. అందుకే ఈరోజు సక్సెస్ మీట్ ఈవెంట్‌ను ప్లాన్ చేశాం. దేశ సరిహద్దుల్లో ఉండి మనల్ని కాపాడుతున్నా ఆర్మీ, నావీ, ఎయిర్‌ఫోర్స్‌కు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు' అని తెలిపారు.
అనంతరం సినిమా సక్సెస్ గురించి మాట్లాడుతూ.. 'ఈ స్థాయిలో విజయం సాధిస్తుందని ఊహించలేదు. ఒక క్రైమ్ థ్రిల్లర్‌ని పెద్ద మాస్ కమర్షియల్ సినిమాలా సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందాన్నిచ్చింది. ప్రేక్షకుల స్పందన చూస్తే అద్భుతంగా అనిపించింది. మాకు ఇంతటి విజయాన్నిచ్చిన వారికి ధన్యవాదాలు’’ అని నాని తెలిపారు. కాగా.. ఈ చిత్రంలో కేజీఎఫ్ బ్యూటీ శ్రీ నిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని యునానిమస్ ప్రోడక్షన్స్, వాల్‌పోస్టర్ సినిమా బ్యానర్స్‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు