హజ్ యాత్రకు ప్రత్యేక విమానాలు | SpiceJet Begins Haj 2025 Operations | Sakshi
Sakshi News home page

హజ్ యాత్రకు ప్రత్యేక విమానాలు

May 2 2025 1:19 PM | Updated on May 2 2025 1:22 PM

SpiceJet Begins Haj 2025 Operations

15,500 మందిని తీసుకువెళ్లాలని స్పైస్‌జెట్‌ లక్ష్యం

ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ హజ్ 2025 యాత్రికులకు అంతరాయంలేని ప్రయాణాన్ని అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపింది. హజ్‌ యాత్రకు వెళ్లే వారి కోసం ప్రత్యేకంగా విమాన సర్వీసులు ప్రారంభించినట్లు ప్రకటించింది. గయ, శ్రీనగర్, గౌహతి, కోల్‌కతాలను సౌదీ అరేబియాతో కలుపుతూ మొదటి దశలో 45 విమానాలను నడపనుంది. మొదటి దశ కార్యకలాపాలు 2025 మే 29 వరకు కొనసాగుతాయని పేర్కొంది.

సర్వీసులు ఇలా..

  • గౌహతి నుంచి మెదీనా వరకు మే 3 నుంచి సర్వీసులు ప్రారంభం.

  • శ్రీనగర్ నుంచి మెదీనా వరకు మే 4 నుంచి మొదలు.

  • కోల్‌కతా నుంచి జెడ్డాకు మే 16న విమాన సర్వీసులు ప్రారంభం అవుతాయి.

  • 2025 జూన్ 13 నుంచి జులై 11 వరకు హజ్ యాత్ర కొనసాగనుంది.

ఇదీ చదవండి: ‘డీఓజే ప్రతిపాదనలు పూర్తి ప్రతికూలం’

యాత్రికుల సామర్థ్యం పెంపు

స్పైస్‌జెట్‌ సుమారు 15,500 మంది యాత్రికులను తీసుకువెళ్లాలని అంచనా వేసింది. ఇది 2024లో రవాణా చేసిన 13,000 మంది ప్రయాణికులతో పోలిస్తే 18% పెరుగుదలను సూచిస్తుంది. ఈ పెరుగుదల హజ్ కార్యకలాపాల్లో విమానయాన సంస్థ విస్తరిస్తున్న పాత్రను, భారతీయ యాత్రికుల అవసరాలను తీర్చడంలో సంస్థ నిబద్ధతను హైలైట్ చేస్తుంది. ప్రయాణీకుల సౌకర్యాన్ని మెరుగుపరచడానికి స్పైస్‌జెట్‌ రెండు వైడ్ బాడీ ఎయిర్ బస్ ఏ 340 విమానాలను ఫ్లీట్‌లో చేర్చింది. ఒక్కొక్కటి 324 మంది ప్రయాణీకులను తీసుకెళ్లగలదు. ఈ విమానాలు శ్రీనగర్, గౌహతి నుంచి మెదీనా వరకు, కోల్‌కతా నుంచి జెడ్డా వరకు నడుస్తాయి. అదనంగా గయా-మెదీనా మార్గంలో 189 సీట్ల బోయింగ్ 737ను ప్రారంభించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement