రూల్స్‌ పెట్టేది బాబు.. రూట్లు మార్చేది లోకేష్‌, పవన్‌! | Babu Makes the Savings Rules Lokesh and Pawan Take Different Routes | Sakshi
Sakshi News home page

రూల్స్‌ పెట్టేది బాబు.. రూట్లు మార్చేది లోకేష్‌, పవన్‌!

May 22 2026 12:34 PM | Updated on May 22 2026 7:02 PM

Babu Makes the Savings Rules Lokesh and Pawan Take Different Routes

“ఖర్చులు తగ్గించాలి.. విదేశీ పర్యటనలు తగ్గించాలి..” అని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు తర్వాతే ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌లో ‘పొదుపు’ మంత్రం వినిపించింది. ఆర్థిక పరిస్థితి కష్టంగా ఉందని, మంత్రులు కూడా జాగ్రత్తగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారని ఎల్లో మీడియా ప్రచారం చేసింది. కానీ ఆ మాటలు కేబినెట్‌ హాల్లోనే ఆగిపోయాయా?.. బయటకు రాగానే గాల్లో కలిసిపోయాయా? అనే చర్చ మొదలైంది.

మోదీ చెప్పిన పొదుపు సూత్రాలు ఇంకా ప్రజల చెవుల్లో మోగుతుండగానే.. మంత్రి నారా లోకేష్‌ రష్యా పర్యటనకు రెడీ అయ్యారు. జూన్‌ 2 నుంచి 6 వరకు ఆయన విదేశీ టూర్‌కు జీవో కూడా వెలువడింది. ఏపీ కేబినెట్‌లో ఏడాది పాటు మంత్రులు విదేశీ పర్యటనలు రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నా.. కొద్ది రోజుల్లోనే ఆ నిర్ణయాన్ని తుంచేసినట్టయ్యింది. 

నో కాన్వాయ్‌ డే అంటూ చంద్రబాబు హడావిడి చేస్తే.. అదే రోజు లోకేష్‌ తన కాన్వాయ్‌తో హల్‌ చల్‌ చేశారు. ఇక కడప పర్యటనకు కూడా లోకేష్‌ ప్రత్యేక విమానంలో వెళ్లడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ప్రత్యేక విమాన ప్రయాణాలపై ఇప్పటికే ఉన్న విమర్శలతో కలిసిపోవడంతో “పొదుపు” అనే మాట ప్రజలకు మాత్రమేనా?.. మంత్రులకు మినహాయింపులా? అనే ఎద్దేవా పెరిగింది.

సోషల్‌ మీడియాలో అయితే సెటైర్లు మామూలుగా లేవు. “ప్రజలకు పొదుపు క్లాసులు.. నేతలకు స్పెషల్‌ ఫ్లైట్‌ పాసులు” అంటూ పోస్టులు వైరల్‌ అవుతున్నాయి. మోదీ ఇచ్చిన పిలుపుతో చంద్రబాబు చెప్పిన మాటలు.. అంతా స్టంటేనా? అనే ప్రశ్న హాట్‌టాపిక్‌ అయ్యింది. ఇదంతా “మోదీ చెప్పినా వినం” అనే వాళ్ల తీరును ప్రతిబింబిస్తోంది.

ఇదీ చదవండి: పొదుపు పేరుతో చెప్పేవన్నీ సోది కబుర్లే: వైఎస్‌ జగన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement