జాక్‌పాట్ కొట్టేసిన ప్రముఖ సింగర్.. ఏకంగా మూడున్నర్ర కోట్ల లాభం! | Singer Rahul Vaidya Sells Two Apartments In Mumbai's Oshiwara | Sakshi
Sakshi News home page

Rahul Vaidya: అపార్ట్‌మెంట్స్‌ అమ్మేసిన సింగర్ రాహుల్ వైద్య.. రూ.3.50 కోట్ల లాభం!

May 2 2025 4:52 PM | Updated on May 2 2025 5:02 PM

Singer Rahul Vaidya Sells Two Apartments In Mumbai's Oshiwara

ప్రముఖ సింగర్, బిగ్ బాస్ రన్నరప్ రాహుల్ వైద్య తన ఖరీదైన అపార్ట్‌మెంట్లను విక్రయించారు. ముంబయిలోని ఓషివారాలో  ఉన్న తన రెండు విల్లాలను దాదాపు రూ.5 కోట్లకు విక్రయించినట్లు తెలుస్తోంది. గతంలో అంటే 2008లో రాహుల్ వైద్య ఈ అపార్ట్‌మెంట్లను రూ.1.70 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు. తాజాగా వీటిని విక్రయించడంతో దాదాపు రూ.3.50 కోట్ల మేర ఆదాయం వచ్చింది. కాగా.. ఈ ప్రాంతంలో పలువురు సినీతారలు నివాసం ఉండడంతో ధరలు కూడా అంతేస్థాయిలో ఉన్నాయి. ఇక్కడ అమితాబ్ బచ్చన్, అజయ్ దేవ్‌గన్, సన్నీ లియోన్, సారా అలీ ఖాన్ వంటి అనేక మంది బాలీవుడ్ ప్రముఖులు కూడా ఆస్తులు కలిగి ఉన్నారు.

కాగా.. సింగర్  రాహుల్ వైద్య ఇండియన్ ఐడల్ సీజన్ 1లో రెండో రన్నరప్‌గా నిలిచారు. అప్పటి నుంచి బాలీవుడ్‌లో రాణిస్తున్నారు. అతని కెరీర్‌లో తొలి మ్యూజిక్ ఆల్బమ్ తేరా ఇంతేజార్ సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత అనేక బాలీవుడ్  పాటలు పాడి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా జో జీతా వోహి సూపర్ స్టార్,మ్యూజిక్ కా మహా ముఖాబ్లా వంటి రియాలిటీ షోలలో విజేతగా నిలిచారు. హిందీ బిగ్‌బాస్ సీజన్‌ -14 రన్నరప్‌గా నిలిచి మరింత ఫేమస్ అయ్యారు. అతను ప్రస్తుతం సెలబ్రిటీ కుకింగ్ రియాలిటీ షో లాఫ్టర్ చెఫ్స్‌లో నటిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement