
కొచ్చి: మలయాళ నటుడు విష్ణుప్రసాద్ (Vishnu Prasad) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కేరళలోని ఓ ఆస్పత్రిలో శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. బుల్లితెర, వెండితెరపై అలరించిన విష్ణు ప్రసాద్ కొన్ని నెలల క్రితం అస్వస్థతకు లోనయ్యారు. వైద్యులను సంప్రదించగాక కాలేయ సమస్య ఉన్నట్లు తేలింది.
దీంతో ఆయన కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. వీలైనంత త్వరగా కాలేయ మార్పిడి చేయాలని వైద్యులు సూచింరు. దీంతో అతడి కూతురు తండ్రికి కాలేయదానం చేయడానికి సిద్ధమైంది. కానీ ఆపరేషన్‌కు దాదాపు రూ.30 లక్షల మేర ఖర్చవుతుందని, సాయం చేసి ఆదుకోమని అతడి కుటుంబసభ్యులు ఆర్థిక సాయం కోసం అర్థించారు. ఆ డబ్బు సేకరించేలోపే విష్ణుప్రసాద్ కన్నుమూశారు.
విష్ణు ప్రసాద్.. కాశీ, కై ఎతుం దూరత్, రన్‌వే, మంగోకాళం, లయన్, లోకనాథన్ IAS, పటాకా, మరాఠా నాడు వంటి పలు మలయాళ చిత్రాల్లో నటించారు. సీరియల్స్‌లోనూ కనిపించాడు. ఇతడికి అభిరామి, అనానిక అని ఇద్దరు కూతుర్లున్నారు.
చదవండి: నా కొడుక్కి 'ఆదిపురుష్' చూపించి సారీ చెప్పా: దేవర విలన్