breaking news
vishnu prasad
-
చికిత్సకు డబ్బుల్లేవ్.. నటుడు కన్నుమూత
కొచ్చి: మలయాళ నటుడు విష్ణుప్రసాద్ (Vishnu Prasad) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కేరళలోని ఓ ఆస్పత్రిలో శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. బుల్లితెర, వెండితెరపై అలరించిన విష్ణు ప్రసాద్ కొన్ని నెలల క్రితం అస్వస్థతకు లోనయ్యారు. వైద్యులను సంప్రదించగాక కాలేయ సమస్య ఉన్నట్లు తేలింది. దీంతో ఆయన కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. వీలైనంత త్వరగా కాలేయ మార్పిడి చేయాలని వైద్యులు సూచింరు. దీంతో అతడి కూతురు తండ్రికి కాలేయదానం చేయడానికి సిద్ధమైంది. కానీ ఆపరేషన్‌కు దాదాపు రూ.30 లక్షల మేర ఖర్చవుతుందని, సాయం చేసి ఆదుకోమని అతడి కుటుంబసభ్యులు ఆర్థిక సాయం కోసం అర్థించారు. ఆ డబ్బు సేకరించేలోపే విష్ణుప్రసాద్ కన్నుమూశారు.విష్ణు ప్రసాద్.. కాశీ, కై ఎతుం దూరత్, రన్‌వే, మంగోకాళం, లయన్, లోకనాథన్ IAS, పటాకా, మరాఠా నాడు వంటి పలు మలయాళ చిత్రాల్లో నటించారు. సీరియల్స్‌లోనూ కనిపించాడు. ఇతడికి అభిరామి, అనానిక అని ఇద్దరు కూతుర్లున్నారు.చదవండి: నా కొడుక్కి 'ఆదిపురుష్' చూపించి సారీ చెప్పా: దేవర విలన్ -
నటుడి పరిస్థితి విషమం.. కాలేయదానం చేస్తానన్న కూతురు.. అయినా!
సినీనటుడు విష్ణు ప్రసాద్ (Vishnu Prasad) తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అతడికి వీలైనంత త్వరగా కాలేయ మార్పిడి చేయాలని వైద్యులు పేర్కొన్నారు. దీనికి రూ.30 లక్షల మేర ఖర్చవుతుందని, దయచేసి సాయం చేసి ఆదుకోమని విష్ణు ప్రసాద్ కుటుంబసభ్యులు అర్థిస్తున్నారు. నటుడి పరిస్థితి రోజురోజుకీ దిగజారుతుండటంతో అతడి కుటుంబసభ్యులే కాలేయదానానికి ముందుకొచ్చారు. అది సరిపోదువిష్ణు కూతురు.. కాలేయం దానం చేసి తండ్రిని బతికించుకోవడానికి సిద్ధమైంది. కానీ ఈ మేరకు ఆపరేషన్ చేసేందుకు పెద్ద మొత్తంలో డబ్బు అవసరమని ఆత్మ సంస్థ (ద అసోసియేషన్ ఆఫ్ టెలివిజన్ మీడియా ఆర్టిస్ట్స్) పేర్కొంది. తమది చిన్న సంస్థ అని.. కొంత మొత్తం ఆర్థిక సాయం చేశామని.. చికిత్సకు అది సరిపోదని ఆత్మ వైస్ ప్రెసిడెంట్, నటుడు మోమన్ అయిరూర్ పేర్కొన్నాడు. సంస్థ సభ్యులను తోచినంత సాయం చేయాలని కోరినట్లు తెలిపాడు.ఎవరీ విష్ణు ప్రసాద్?విష్ణు ప్రసాద్.. కాశీ, కై ఎతుం దూరత్, రన్‌వే, మంగోకాళం, లయన్, లోకనాథన్ ఐఏఎస్, పటాకా, మరాఠా నాడు వంటి పలు మలయాళ చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం సీరియల్స్ చేస్తున్నాడు. ఇతడికి అభిరామి, అనానిక అని ఇద్దరు కూతుర్లున్నారు. View this post on Instagram A post shared by Vishnu Prasad (@vishnu.prasad18) చదవండి: హీరో అజిత్‌కు మరోసారి కారు ప్రమాదం.. వీడియో వైరల్ -
నటిని కావాలనుకోలేదు, సమంతతో పోలుస్తున్నారు: గౌరి
‘‘శ్రీదేవి శోభన్‌బాబు’లో నేను చేసిన జాను పాత్ర మోడ్రన్‌గా ఉంటుంది’’ అని హీరోయిన్ గౌరి జి. కిషన్ అన్నారు. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వంలో సంతోష్ శోభన్, గౌరి జి. కిషన్ జంటగా రూపొందిన చిత్రం ‘శ్రీదేవి శోభన్‌బాబు’. సుస్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గౌరి జి. కిషన్ మాట్లాడుతూ– ‘‘నేను నటిని కావాలనుకోలేదు. జర్నలిస్ట్ అవుదామనుకున్నా. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడు తమిళ మూవీ ‘96’ ఆడిషన్స్‌కి వెళ్లి సెలక్ట్ అయ్యాను. తెలుగులో నా తొలి చిత్రం ‘శ్రీదేవి శోభన్‌బాబు’. ‘ఏమాయ చేసావె’ టైమ్‌లో సమంత ఎలా ఉన్నారో ఇప్పుడు నేను అలా ఉన్నానని చాలామంది అన్నారు. ఆమెలా నాకూ అన్ని భాషల్లో నటించాలనుంది. ఇండస్ట్రీలో మహిళా రచయితలు తక్కువగా ఉన్నారు.. ఎక్కువమంది రావాలి. నేను కూడా రాయడానికి ప్రయత్నం చేస్తున్నాను’’ అన్నారు. -
భర్త విష్ణు ప్రసాద్‌తో చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత..
-
తహశీల్దార్ కార్యాలయం ఎదుట కాపునాయకుల ధర్నా
కాపులకు రిజర్వేషన్లు కల్పించాలంటూ తుగ్గలి తహశీల్దార్ కార్యాలయం ఎదుట కాపు నాడు రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. వెంటనే కాపులను బీసీలలో చేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం లేవనెత్తుతామని హెచ్చరించారు. అనంతరం తహశీల్దార్ కార్యాయలంలో ఉన్న సీనియర్ అసిస్టెంట్ విష్ణుప్రసాద్‌కు వినతి పత్రం అందజేశారు. -
‘సీనియర్’ చాంప్ విష్ణుప్రసాద్
జింఖానా, న్యూస్‌లైన్: జేకే టైర్ జాతీయ రోటక్స్ మ్యాక్స్ కార్టింగ్ చాంపియన్‌షిప్‌లో విష్ణు ప్రసాద్ (మెకో రేసింగ్ జట్టు), కృష్ణరాజ్ మహాదిక్ (రెయో రేసింగ్ జట్టు)లు విజేతలుగా నిలిచారు. లహరి రిసార్ట్స్‌లోని కార్టింగ్ సెంటర్లో ఆదివారం మూడు విభాగాల్లో ఫైనల్ పోటీలు జరిగాయి. 15 ఏళ్లు పైబడిన వారు పాల్గొనే సీనియర్ మ్యాక్స్ విభాగంలో విష్ణు ప్రసాద్ చాంపియన్‌షిప్ సాధించగా, అమేయ బఫ్నా (రెయో రేసింగ్), చిత్తేశ్ మండోడి (మోహిత్ రేసింగ్) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. 13 ఏళ్ల నుంచి 16 ఏళ్ల లోపు రేసర్లు పాల్గొనే జూనియర్ మ్యాక్స్ ఈవెంట్లో కృష్ణరాజ్ మహాదిక్ (రెయో రేసింగ్) విజేతగా నిలువగా, ఆర్య చిరాగ్ గాంధీ (రెయో రేసింగ్), ఆకాశ్ గౌడ (మెకో రేసింగ్) ద్వితీయ, తృతీయ స్థానాలు పొందారు. ఏడేళ్ల నుంచి 12 ఏళ్లలోపు రేసర్లు పాల్గొనే మైక్రో మ్యాక్స్ విభాగంలో పాల్ ఫ్రాన్సిస్ (మెకో రేసింగ్) చాంపియన్‌గా నిలిచాడు. అర్జున్ నాయర్ (మెకో రేసింగ్) రెండో స్థానం, నికిల్ (ఇండియన్ కార్టింగ్) మూడో స్థానం పొందారు.