నటిని కావాలనుకోలేదు, సమంతతో పోలుస్తున్నారు: గౌరి | Gouri G Kishan about her debut movie | Sakshi
Sakshi News home page

Gouri G Kishan: నటిని కావాలని అనుకోలేదు

Feb 17 2023 3:05 AM | Updated on Feb 17 2023 8:45 AM

Gouri G Kishan about her debut movie - Sakshi

‘‘శ్రీదేవి శోభన్‌బాబు’లో నేను చేసిన జాను పాత్ర మోడ్రన్‌గా ఉంటుంది’’ అని హీరోయిన్‌ గౌరి జి. కిషన్‌ అన్నారు. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వంలో సంతోష్‌ శోభన్, గౌరి జి. కిషన్‌ జంటగా రూపొందిన చిత్రం ‘శ్రీదేవి శోభన్‌బాబు’. సుస్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది.

ఈ సందర్భంగా గౌరి జి. కిషన్‌  మాట్లాడుతూ– ‘‘నేను నటిని కావాలనుకోలేదు. జర్నలిస్ట్‌ అవుదామనుకున్నా. ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడు తమిళ మూవీ ‘96’ ఆడిషన్స్‌కి వెళ్లి సెలక్ట్‌ అయ్యాను. తెలుగులో నా తొలి చిత్రం ‘శ్రీదేవి శోభన్‌బాబు’. ‘ఏమాయ చేసావె’ టైమ్‌లో సమంత ఎలా ఉన్నారో ఇప్పుడు నేను అలా ఉన్నానని చాలామంది అన్నారు. ఆమెలా నాకూ అన్ని భాషల్లో నటించాలనుంది. ఇండస్ట్రీలో మహిళా రచయితలు తక్కువగా ఉన్నారు.. ఎక్కువమంది రావాలి. నేను కూడా రాయడానికి ప్రయత్నం చేస్తున్నాను’’ అన్నారు. 


 

Advertisement
 
Advertisement
Advertisement