‘సీనియర్’ చాంప్ విష్ణుప్రసాద్ | sennior champ vishuprasad | Sakshi
Sakshi News home page

‘సీనియర్’ చాంప్ విష్ణుప్రసాద్

Sep 1 2013 11:40 PM | Updated on Sep 1 2017 10:21 PM

జేకే టైర్ జాతీయ రోటక్స్ మ్యాక్స్ కార్టింగ్ చాంపియన్‌షిప్‌లో విష్ణు ప్రసాద్ (మెకో రేసింగ్ జట్టు), కృష్ణరాజ్ మహాదిక్ (రెయో రేసింగ్ జట్టు)లు విజేతలుగా నిలిచారు.

జింఖానా, న్యూస్‌లైన్: జేకే టైర్ జాతీయ రోటక్స్ మ్యాక్స్ కార్టింగ్ చాంపియన్‌షిప్‌లో విష్ణు ప్రసాద్ (మెకో రేసింగ్ జట్టు), కృష్ణరాజ్ మహాదిక్ (రెయో రేసింగ్ జట్టు)లు విజేతలుగా నిలిచారు. లహరి రిసార్ట్స్‌లోని కార్టింగ్ సెంటర్‌లో ఆదివారం మూడు విభాగాల్లో ఫైనల్ పోటీలు జరిగాయి. 15 ఏళ్లు పైబడిన వారు పాల్గొనే సీనియర్ మ్యాక్స్ విభాగంలో విష్ణు ప్రసాద్ చాంపియన్‌షిప్ సాధించగా, అమేయ బఫ్నా (రెయో రేసింగ్), చిత్తేశ్ మండోడి (మోహిత్ రేసింగ్) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.

13 ఏళ్ల నుంచి 16 ఏళ్ల లోపు రేసర్లు పాల్గొనే జూనియర్ మ్యాక్స్ ఈవెంట్‌లో కృష్ణరాజ్ మహాదిక్ (రెయో రేసింగ్) విజేతగా నిలువగా, ఆర్య చిరాగ్ గాంధీ (రెయో రేసింగ్), ఆకాశ్ గౌడ (మెకో రేసింగ్) ద్వితీయ, తృతీయ స్థానాలు పొందారు. ఏడేళ్ల నుంచి 12 ఏళ్లలోపు రేసర్లు పాల్గొనే మైక్రో మ్యాక్స్ విభాగంలో పాల్ ఫ్రాన్సిస్ (మెకో రేసింగ్) చాంపియన్‌గా నిలిచాడు. అర్జున్ నాయర్ (మెకో రేసింగ్) రెండో స్థానం, నికిల్ (ఇండియన్ కార్టింగ్) మూడో స్థానం పొందారు.
 

Advertisement
 
Advertisement
Advertisement