మేలో లాంచ్‌ అయ్యే టాప్‌ 5 స్మార్ట్‌ఫోన్లు | top smartphones expected to launch in May 2025 | Sakshi
Sakshi News home page

మేలో లాంచ్‌ అయ్యే టాప్‌ 5 స్మార్ట్‌ఫోన్లు

May 2 2025 9:08 AM | Updated on May 2 2025 10:22 AM

top smartphones expected to launch in May 2025

మొబైల్‌ యూజర్లు వాటి పనితీరు మెరుగ్గా ఉండాలని కోరుకుంటున్నారు. అందుకు అనుగుణంగా టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లలో మార్పులు వస్తున్నాయి. మొబైల్‌ తయారీ కంపెనీలు వినియోగదారుల అభిరుచుల మేరకు వినూత్న మోడళ్లను నిత్యం ఆవిష్కరిస్తున్నారు. అందులో భాగంగా మే, 2025లో లాంచ్‌ అవ్వనున్న టాప్‌ 5 కంపెనీల ఉత్పత్తుల గురించి కింద తెలుసుకుందాం.

1. శాంసంగ్ గెలాక్సీ ఎస్25 ఎడ్జ్

  • మే 13, 2025 నాటికి విడుదలవుతుందని అంచనా.

  • 6.6 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్.

  • స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ చిప్ సెట్. అల్ట్రా స్లిమ్ డిజైన్ (5.84 మిల్లీమీటర్‌ మందం, 162 గ్రాముల బరువు).

  • 25వాట్ ఛార్జింగ్‌తో 3,900 ఎంఏహెచ్ బ్యాటరీ.

2. వన్‌ప్లస్‌ 13ఎస్

  • విడుదల తేదీ మే 2025లో అంచనా.

  • 6.32 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే.

  • స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ చిప్ సెట్.

  • కాంపాక్ట్ ఫ్లాగ్ షిప్ డిజైన్.

  • బ్లాక్, పింక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

  • ధర సుమారు రూ.55 వేలు.

3. రియల్‌మీ జీటీ 7

  • విడుదల తేదీ మే 2025లో అంచనా.

  • మీడియాటెక్ డైమెన్సిటీ 9400+ చిప్ సెట్.

  • 16 జీబీ ర్యామ్, 1 టీబీ స్టోరేజ్.

  • 120 ఎఫ్పీఎస్ కలిగిన గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌.

  • రియల్‌మీ యూఐ 6.0 (ఆండ్రాయిడ్ 15)తో వస్తుంది.

4. పోకో ఎఫ్7

  • విడుదల తేదీ మే 2025లో అంచనా.

  • స్నాప్ డ్రాగన్ 8ఎస్ జెన్ 4 చిప్ సెట్.

  • 6.8 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే.

  • 90 వాట్ ఛార్జింగ్‌తో 7,550 ఎంఏహెచ్ బ్యాటరీ.

ఇదీ చదవండి: రూ.5,830 కోట్ల ప్రాజెక్ట్‌ను నిలిపేసిన జోహో

5. ఐకూ నియో 10

  • విడుదల తేదీ మే 2025లో అంచనా.

  • 6.78 అంగుళాల 144 హెర్ట్జ్ ఎల్‌టీపీఓ అమోలెడ్‌ డిస్‌ప్లే

  • డైమెన్సిటీ 9400 చిప్ సెట్.

  • 6,100 ఎంఏహెచ్ బ్యాటరీ, 120వాట్ వైర్డ్ ఛార్జింగ్.

  • ధర సుమారు రూ.40 వేలు.

Advertisement
 
Advertisement
Advertisement