ప్రపంచానికి ఇదే సందేశం ఇచ్చాం: మల్లికార్జున ఖర్గే | aicc president mallikarjun kharge On Caste Census | Sakshi
Sakshi News home page

ప్రపంచానికి ఇదే సందేశం ఇచ్చాం: మల్లికార్జున ఖర్గే

May 2 2025 6:19 PM | Updated on May 2 2025 7:03 PM

aicc president mallikarjun kharge On Caste Census

ఢిల్లీ : దేశ భద్రత విషయంలో మొత్తం విపక్షం కేంద్రానికి మద్దతుగా నిలుస్తుందన్నారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే   పహల్గామ్‌ ఉగ్రదాడి అనంతరం ప్రపంచానికి కూడా ఇదే సందేశం ఇచ్చామన్నారాయన. ఈరోజు(శుక్రవారం) జరిగిన సీడబ్యూసీ సమావేశంలో మల్లికార్జున ఖర్గే మాట్లాడారు. ‘ పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతిగా ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన వ్యూహం కనిపించలేదు. రాహుల్ గాంధీ కాన్పూర్ లో చనిపోయిన శుభం ద్వివేదీ కుటుంబాన్ని కలిశారు. చనిపోయిన వారికి  ‘అమరుల’  హోదా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.

దేశ భద్రత విషయంలో మొత్తం విపక్షం కేంద్రానికి మద్దతుగా నిలుస్తుంది. ప్రపంచానికి ఇదే సందేశం ఇచ్చాం. మోదీ ప్రభుత్వం జనగణనతో పాటు కులగణన నిర్వహించాలని నిర్ణయించింది. ఇది రాహుల్ గాంధీ దీర్ఘకాలిక ఉద్యమ ఫలితమే. ఆయన “భారత్ జోడో న్యాయ యాత్ర” ద్వారా దీనిని ప్రధాన అజెండాగా మార్చారు. తెలంగాణ, కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇప్పటికే కుల సర్వే పూర్తి చేశాయి.

50% రిజర్వేషన్ సీలింగ్ ఎత్తివేయాలి. గణన నుండి వచ్చిన సమాచారాన్ని ప్రభుత్వం మంచి పాలన కోసం ఉపయోగించాలి.కులగణన కచ్చితంగా జరగాలి. ఫలితాలను అమలు చేయాలి. పాలసీలు, చట్టాలు దానికి అనుగుణంగా ఉండాలి. 2021 సాధారణ జనగణన కూడా జరగలేదు. ఇప్పటికీ 2011 డేటానే ఉపయోగిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ యొక్క రిజర్వేషన్ వ్యతిరేక దృక్పథమే ఈ ఆలస్యం వెనుక కారణం’ అని మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement