అర్జెంటీనాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ | Massive Earthquake Strikes Argentina | Sakshi
Sakshi News home page

అర్జెంటీనాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

May 2 2025 9:44 PM | Updated on May 2 2025 9:59 PM

Massive Earthquake Strikes Argentina

బ్యూనోస్ ఎయిర్స్:  అర్జెంటీనాలో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. అర్జెంటీనాలో  వచ్చిన భూకంప తీవ్రత రిక్టరు స్కేలుపై 7.4గా నమోదైంది. దాంతో చిలీ, అర్జెంటీనా, దక్షిణ అమెరికా తీరాలను భూకంపం కుదిపేసింది. మరో రెండు భూప్రకంపనలు కూడా నమోదయ్యాయి.  ఫలితంగా సునామీ హెచ్చరికలు జారీ చేశారు.

దక్షిణ అర్జెంటీనాలోని ఉషుయాకు దక్షిణంగా 219 కి.మీ దూరంలో ఉన్న డ్రేక్ పాసేజ్ వద్ద  ఉదయం 9 సమయంలో ప్రకంపనలు సంభవించాయని యూఎస్ జియోలాజికల్ సర్వే స్పష్టం చేసింది. 

చిలీ తీరంలోని కొన్ని ప్రాంతాలను సాధారణ అలల స్థాయి కంటే 3 నుండి 10 అడుగుల ఎత్తులో అలలు తాకవచ్చని అమెరికా సునామీ హెచ్చరిక కేంద్రం హెచ్చరించింది. ఒక మీటర్ ఎత్తు వరకు చిన్న అలలు కూడా అంటార్కిటికా తీరంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రభావితం చూపే అవకాశం ఉందని పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement