The Midnight Walk’ అ ‘మాయ’కుడు ఎవరు | Twisted Horrors adventure game ‘The Midnight Walk’ | Sakshi
Sakshi News home page

The Midnight Walk’అ ‘మాయ’కుడు ఎవరు

May 2 2025 2:32 PM | Updated on May 2 2025 3:05 PM

Twisted Horrors adventure game ‘The Midnight Walk’

డార్క్‌ ఫాంటసీ అడ్వెంచర్‌ గేమ్‌.... ది మిడ్‌నైట్‌ వాక్‌. ప్లేయర్స్‌ను ఈ గేమ్‌ భయానక ప్రపంచంలోకి ఆహ్వానిస్తుంది. ఆ ప్రపంచంలోకి వెళ్లే ధైర్యసాహసాలు ఉంటే క్రూరమైన రాక్షసులతో ΄ోరాడాలి. ఎన్నో రహస్యాలను వెలికితీయాలి. కోర్‌ గేమ్‌ప్లే ఫీచర్స్‌ఆకట్టుకుంటాయి. ఈ గేమ్‌ కోసం ఎన్నో సర్రియల్‌ క్రియేచర్‌లను సృష్టించారు. ప్రతి ఫ్రేమ్‌ స్టాప్‌ మోషన్‌ మ్యాజిక్‌తో ప్రాణం పోశారు.
‘సూర్యుడిని ఎవరు మాయం చేశారు? ఎందుకు?’ అనేది గేమ్‌లో సెంట్రల్‌ మిస్టరీ.

‘ఈ గేమ్‌ ఇండి గేమింగ్‌ ప్రపంచంలో ప్రత్యేకతను చాటుకుంటుంది. మిడ్‌నైట్‌ వాక్‌ అనేది డార్క్‌ ఫాంటసీ, స్టాప్‌–మోషన్‌ మ్యాజిక్‌ సమ్మేళనం’ అంటున్నారు గేమ్‌ మేకర్స్‌.విడుదల తేది: 8 మే ప్లాట్‌ఫామ్స్‌: ప్లేస్టేషన్‌ 5, మైక్రోసాప్ట్‌ విండోస్‌ జానర్స్‌: అడ్వెంచర్‌ గేమ్, ఇండి గేమ్‌

ఇదీ చదవండి: Good Health: వెజ్‌ తినాలా? నాన్‌ వెజ్‌ తినాలా?

 

అవును... ఇది నిజమే! 

∙1904లో అమెరికన్‌ టీ వ్యాపారి ఒకరు చిన్న సిల్క్‌ సంచులలో టీ పొడిని ఐరోపాకు రవాణా చేశాడు. అయితే....కొందరు తెలియక వాటిని మరుగుతున్న నీటిలో ముంచారు. అలా టీ బ్యాగ్‌ ఐడియా పుట్టింది! ∙‘ఏ ఇద్దరు వ్యక్తుల వేలి ముద్రలు ఒకేరకంగా ఉండవు’ అనేది నాలుకకు కూడా వర్తిస్తుంది. ప్రతి వ్యక్తి ‘టంగ్‌ ప్రింట్‌’కు దాని స్వంత, విలక్షణమైన ఆకారం, పరిమాణం, రంగు ఉంటుంది అంటున్నారు పరిశోధకులు. ఫోరెన్సిక్‌ పరిశోధనలలో ‘టంగ్‌ ప్రింట్‌’లు కూడా ఉపయోగపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement