గుజ‌రాత్ చేతిలో ఓట‌మి.. స‌న్‌రైజ‌ర్స్ ప్లే ఆశ‌లు గ‌ల్లంతు! | GT vs SRH: Gujarat Titans wins by 38 runs | Sakshi
Sakshi News home page

IPL 2025: గుజ‌రాత్ చేతిలో ఓట‌మి.. స‌న్‌రైజ‌ర్స్ ప్లే ఆశ‌లు గ‌ల్లంతు!

May 2 2025 11:35 PM | Updated on May 2 2025 11:35 PM

GT vs SRH: Gujarat Titans wins by 38 runs

PC: BCCI/IPL.com

ఐపీఎల్‌-2025లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ క‌థ దాదాపు ముగిసిన‌ట్లే.  ప్లే ఆఫ్స్ రేసులో నిల‌వాలంటే క‌చ్చితంగా గెల‌వాల్సిన మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ తేలిపోయింది. అహ్మ‌దాబాద్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 38 ప‌రుగుల తేడాతో ఎస్ఆర్‌హెచ్ ఓట‌మి పాలైంది. 225 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన స‌న్‌రైజ‌ర్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి 186 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌ల్గింది. 

లక్ష్య​​ చేధనలో ఓపెనర్లు మంచి అరంభం ఇచ్చినప్పటికి, మిడిలార్డర్ విఫలమం కావడంతో ఆరెంజ్ ఆర్మీ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లలో అభిషేక్ శ‌ర్మ(74) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగితా బ్యాటర్లు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. గుజ‌రాత్ బౌల‌ర్ల‌లో ప్ర‌సిద్ద్ కృష్ణ, సిరాజ్ త‌లా రెండు వికెట్లు సాధించ‌గా.. ఇషాంత్ శ‌ర్మ, కోయిట్జీ త‌లా వికెట్ సాధించారు. 

గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్‌..
అంత‌కుముందు బ్యాటింగ్ చేసిన గుజ‌రాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌(76) టాప్ స్కోరర్‌గా నిలవగా.. జోస్ బట్లర్‌(64), సుదర్శన్‌(48) పరుగులతో రాణించారు. సన్‌రైజర్స్ బౌలర్లలో జయ్‌దేవ్ ఉనద్కట్ మూడు వికెట్లు పడగొట్టగా.. కమ్మిన్స్‌, అన్సారీ తలా వికెట్ సాధించారు. కాగా ఇప్ప‌టివ‌ర‌కు ప‌ది మ్యాచ్‌లు ఆడిన స‌న్‌రైజ‌ర్స్ కేవ‌లం మూడు విజ‌యాల‌తో పాయింట్ల ప‌ట్టిక‌లో రెండోస్దానంలో కొన‌సాగుతోంది.
 

Advertisement
 
Advertisement
Advertisement