
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి: శు.షష్ఠి ప.1.20 వరకు, తదుపరి సప్తమి, నక్షత్రం: పునర్వసు సా.5.47 వరకు, తదుపరి పుష్యమి, వర్జ్యం: ఉ.6.03 నుండి 7.37 వరకు, తదుపరి రా.1.46 నుండి 3.22 వరకు, దుర్ముహూర్తం: ఉ.6.03 నుండి 7.14 వరకు, అమృతఘడియలు: ప.3.27 నుండి 5.02 వరకు; రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు, యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు, సూర్యోదయం: 5.37, సూర్యాస్తమయం: 6.15.
మేషం: కొన్ని పనుల్లో ప్రతిబంధకాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. శ్రమాధిక్యం. బంధువుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
వృషభం: ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. స్వల్ప ధనలాభం. పాతబాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రగతి కనిపిస్తుంది.
మిథునం: మిత్రులతో విభేదాలు. ప్రయాణాలలో అవాంతరాలు. పనులు ముందుకు సాగవు. ఆలోచనలు కలసిరావు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.
కర్కాటకం: శుభవార్తా శ్రవణం. కుటుంబంలో ఉత్సాహవంతంగా ఉంటుంది. ఏ పని చేపట్టినా విజయమే. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. దైవచింతన.
సింహం: వ్యవహారాలలో అవాంతరాలు. దూరప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. శ్రమ తప్పదు. బంధువుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.
కన్య: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలను సమయానికి పూర్తి చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.
తుల: కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక ప్రగతి కనిపిస్తుంది. వివాదాలు పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలం.
వృశ్చికం: వ్యవహారాలలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో వివాదాలు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.
ధనుస్సు: వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆత్మీయులతో మాటపట్టింపులు. ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
మకరం: సన్నిహితులతో సఖ్యత నెలకొంటుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. దైవదర్శనాలు. శుభవర్తమానాలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యల నుంచి గట్టెక్కుతారు.
కుంభం: సన్నిహితులతో విభేదిస్తారు. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో అవాంతరాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చిక్కులు.
మీనం: కార్యజయం. ధనలాభ సూచనలు. ప్రముఖులతో పరిచయాలు. నూతన ఉద్యోగలాభం. సోదరుల నుంచి పిలుపు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది.