గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, తిథి: బ.షష్ఠి ఉ.7.35 వరకు, తదుపరి సప్తమి తె.5.42 వరకు (తెల్లవారితే మంగళవారం), నక్షత్రం: ఆశ్లేష ప.3.47 వరకు, తదుపరి మఖ, వర్జ్యం: రా.3.13 నుండి 4.44 వరకు, దుర్ముహూర్తం: ప.12.10 నుండి 12.54 వరకు, తదుపరి ప.2.22 నుండి 3.07 వరకు, అమృత ఘడియలు: ప,2,16 నుండి 3.24 వరకు.
సూర్యోదయం : 6.16
సూర్యాస్తమయం : 5.20
రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం : ఉ.10.30 నుండి 12.00 వరకు
మేషం... అనుకున్న పనుల్లో ప్రతిబంధకాలు. బాధ్యతలు అధికమవుతాయి. దూరప్రయాణాలు. ఆరోగ్య, కుటుంబసమస్యలు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి.
వృషభం... వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. భూములు, ఆభరణాలు కొంటారు. ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహం.
మిథునం... ప్రయాణాలలో అవాంతరాలు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. ధనవ్యయం. శ్రమాధిక్యం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.
కర్కాటకం... కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు. విందువినోదాలు. ఆకస్మిక ధనలబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత కలసివస్తాయి.
సింహం... రాబడికి మించిన ఖర్చులు. సమస్యలతో కుస్తీపడతారు. ఆరోగ్య విషయంలో చికాకులు. సోదరులతో కలహాలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
కన్య... కుటుంబంలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఆప్తుల సలహాలు పాటిస్తారు. సంఘంలో ఎనలేని గౌరవం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
తుల... సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. మీ సేవలకు గుర్తింపు లభిస్తుంది. పరిచయాలు విస్తృతమవుతాయి. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు వృద్ధి చెందుతాయి.
వృశ్చికం... శ్రమతో పనులు పూర్తి చేస్తారు. ఆలోచనలు స్థిరంగా సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులలో తగాదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.
ధనుస్సు... సన్నిహితులతో వివాదాలు. నిర్ణయాలలో పొరపాట్లు. పనులు మధ్యలో విరమిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.
మకరం... మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ధనలాభం. భూయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు పుంజుకుంటాయి. ఆలయ దర్శనాలు.
కుంభం... రుణ విముక్తులవుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు కొన్ని వసూలవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.
మీనం... పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. అనారోగ్య సూచనలు. కుటుంబంలో సమస్యలు ఎదురుకావచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.


