గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, తిథి: బ.చవితి ప.12.01 వరకు, తదుపరి పంచమి, నక్షత్రం: పునర్వసు సా.6.41 వరకు, తదుపరి పుష్యమి, వర్జ్యం: ఉ.7.34 నుండి 9.01 వరకు, తదుపరి రా2.10 నుండి 3.41 వరకు, దుర్ముహూర్తం: ఉ.6.16 నుండి 7.44 వరకు, అమృత ఘడియలు: సా.4.28 నుండి 5.57 వరకు.
సూర్యోదయం : 6.16
సూర్యాస్తమయం : 5.20
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం : ప.1.30 నుండి 3.00 వరకు
మేషం... పనులు నిదానిస్తాయి. ఆలోచనలు స్థిరంగా సాగవు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. కుటుంబసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.
వృషభం... కొత్త పరిచయాలు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. పనులు సజావుగా సాగుతాయి. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు.
మిథునం... పనుల్లో అవాంతరాలు. రుణాలు చేస్తారు. పరిస్థితులు అనుకూలించవు. బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
కర్కాటకం... చర్చలు సఫలం. ప్రముఖులతో పరిచయాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు సైతం వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.
సింహం... రుణయత్నాలు సాగిస్తారు. కష్టానికి ఫలితం కనిపించదు. ఆస్తుల వివాదాలు. ఆరోగ్యసమస్యలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.
కన్య... నూతన ఉద్యోగాలు లభిస్తాయి. నూతన పరిచయాలు. వ్యవహారాలలో విజయం. ఆస్తిలాభం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.
తుల... బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. శ్రమ ఫలిస్తుంది. నిరుద్యోగులకు శుభవార్తలు. వాహనాలు కొంటారు. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
వృశ్చికం... రుణభారాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో తగాదాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.
ధనుస్సు... బంధువులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.
మకరం... కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తివృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.
కుంభం... నూతన ఉద్యోగావకాశాలు. ప్రముఖుల నుండి ముఖ్య సమాచారం. ఇంటాబయటా ప్రోత్సాహం. ఆకస్మిక «దనలబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.
మీనం... మిత్రులతో అకారణంగా విరోధాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. ఒప్పందాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది పెట్టవచ్చు.


