ఈ రాశి వారికి శుభవార్తలు వింటారు, బాకీలు వసూలవుతాయి | Rasi Phalalu: Daily Horoscope On 26-11-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి శుభవార్తలు వింటారు, బాకీలు వసూలవుతాయి

Nov 26 2026 3:24 AM | Updated on Nov 26 2026 3:24 AM

Rasi Phalalu: Daily Horoscope On 26-11-2026 In Telugu

గ్రహం అనుగ్రహం : శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, తిథి: బ.విదియ సా.4.46 వరకు, తదుపరి తదియ, నక్షత్రం: మృగశిర రా.10.03 వరకు, తదుపరి ఆరుద్ర, వర్జ్యం: తె.5.30 నుండి 7.21 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.56 నుండి 10.41 వరకు, తదుపరి ప.2.21 నుండి 3.06 వరకు, అమృత ఘడియలు: ప.1.50 నుండి 3.20 వరకు.

సూర్యోదయం :    6.14
సూర్యాస్తమయం    :  5.20
రాహుకాలం : ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుండి 7.30 వరకు

మేషం.....నూతన ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు.ముఖ్యమైన పనులు విజయవంతంగా సాగుతాయి. వాహనయోగం. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

వృషభం...వ్యవహారాలలో కొన్ని ప్రతిబంధకాలు. ఇంటాబయటా వివాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.  శ్రమ తప్పదు. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.

మిథునం....వ్యవహారాలలో ఆటంకాలు. మిత్రుల నుంచి కొన్ని విషయాలలో ఒత్తిడులు. ఆరోగ్యభంగం. బంధువులతో విభేదాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.

కర్కాటకం....కొన్ని వివాదాలు,  సమస్యలు నుంచి బయటపడతారు. పనుల్లో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత ఉత్సాహంగా ఉంటుంది. దైవదర్శనాలు. వాహనయోగం.

సింహం.......బంధువులతో తగాదాలు. అనుకోని ప్రయాణాలు.  విద్యార్థులకు కొంత నిరాశ. స్వల్ప  అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తప్పవు. ఆలయ దర్శనాలు.

కన్య....నూతన ఉద్యోగాలు దక్కుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు.

తుల.....కుటుంబసభ్యులతో తగాదాలు. స్వల్ప అనారోగ్య సూచనలు. కొన్ని పనులు ముందుకు సాగవు. ఆరోగ్య సమస్యలు. దైవదర్శనాలు చేసుకుంటారు.  వృత్తి,వ్యాపారాలలో నిరుత్సాహం.

వృశ్చికం...కొత్త వ్యక్తుల పరిచయం. బంధువుల ద్వారా శుభవార్తలు అందుతాయి. పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

ధనుస్సు....కొత్త పనులు అనుకున్న విధంగా పూర్తి. శుభవార్తలు వింటారు. బాకీలు వసూలవుతాయి. భూవివాదాలు కొలిక్కి వస్తాయి. ఆస్తిలాభం. వ్యాపారాలు,ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.

మకరం...ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. కొన్ని వ్యవహారాలలో అవాంతరాలు. ప్రయాణాలలో మార్పులు. సోదరులతో విభేదాలు. వృత్తి, వ్యాపారాలలో తప్పని మార్పులు.

కుంభం...ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా నిరాశ. ఆరోగ్యం మందగిస్తుంది. ఉద్యోగయత్నాలలో ఆటంకాలు.  వ్యాపారాలు, ఉద్యోగాలలో లేనిపోని చికాకులు. దైవదర్శనాలు.

మీనం....ఇంటాబయటా అనుకూల వాతావరణం.  సన్నిహితులతో సఖ్యత. నూతన ఒప్పందాలు. పనుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి.  వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందులు తొలగుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement