గ్రహం అనుగ్రహం; శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, తిథి: పౌర్ణమి రా.9.03 వరకు, తదుపరి బహుళ పాడ్యమి, నక్షత్రం: «కృత్తిక రా.1.01 వరకు, తదుపరి రోహిణి, వర్జ్యం: ప.1.36 నుండి 3.07 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.26 నుండి 9.10 వరకు, తదుపరి రా.10.29 నుండి 11.20 వరకు, అమృత ఘడియలు: రా.10.42 నుండి 12.14 వరకు, కార్తీక పౌర్ణమి, జ్వాలాతోరణం.
సూర్యోదయం : 6.12
సూర్యాస్తమయం : 5.20
రాహుకాలం : ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు
––––––––––––––––––––––
మేషం... పనుల్లో ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. అనారోగ్యం. ప్రయాణాలు రద్దు. బంధువుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.
వృషభం... కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. ఆత్మీయుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.
మిథునం... వ్యవహారాలలో అవాంతరాలు. విద్యార్థుల యత్నాలు నిరాశ పరుస్తాయి. బంధుమిత్రుల నుంచి ఒత్తిళ్లు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.
కర్కాటకం... కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో సఖ్యత. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.
సింహం... కొత్త వ్యక్తులతో పరిచయం. శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. ఉద్యోగయత్నాలు సానుకూలం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.
కన్య... మిత్రులతో విభేదాలు. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ప్రయాణాలలో మార్పులు. దైవదర్శనాలు చేసుకుంటారు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.
తుల... పనుల్లో తొందరపాటు. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ప్రయాణాలలో అవాంతరాలు. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.
వృళ్చికం... కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఆలోచనలు అమలు చేస్తారు. ఆర్థికంగా బలం చేకూరుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.
ధనుస్సు... ఉద్యోగయత్నాలు సానుకూలం. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలత.
మకరం... కుటుంబంలో కొంతమేర ఒత్తిళ్లు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనుల్లో అవాంతరాలు. నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.
కుంభం... రుణఒత్తిడులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడతారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా కొనసాగుతాయి.
మీనం... పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయులతో సఖ్యత. కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు. ధన,వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల నుంచి పిలుపు. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.


