ఈ రాశి వారికి సంఘంలో గౌరవం పెరుగుతుంది | Rasi Phalalu: Daily Horoscope On 27-11-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి సంఘంలో గౌరవం పెరుగుతుంది

Nov 27 2026 12:20 AM | Updated on Nov 27 2026 12:20 AM

Rasi Phalalu: Daily Horoscope On 27-11-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, తిథి: బ.తదియ ప.2.45 వరకు, తదుపరి చవితి, నక్షత్రం: ఆరుద్ర రా.8.21 వరకు, తదుపరి పునర్వసు, వర్జ్యం: లేదు, దుర్ముహూర్తం: ఉ.8.28 నుండి 9.11 వరకు, తదుపరి ప.12.10 నుండి 12.54 వరకు, అమృత ఘడియలు: ఉ.11.02 నుండి 12.31 వరకు, సంకటహర చతుర్ధి.

సూర్యోదయం :    6.15
సూర్యాస్తమయం     :  5.20
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుండి 4.30 వరకు

మేషం... మీ అంచనాలు నిజమవుతాయి. ఆకస్మిక ధనలబ్ధి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలస్థితి.

వృషభం... బంధువులతో మాటపట్టింపులు. దూరప్రయాణాలు. పనులు మందకొడిగా సాగుతాయి. శ్రమాధిక్యం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

మిథునం... దూరప్రాంతాల నుండి  శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. అనుకున్నది సాధిస్తారు. ఆలయాల సందర్శనం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

కర్కాటకం... కొన్ని పనులలో అవాంతరాలు. రుణయత్నాలు. ప్రయాణాలు రద్దు. బంధువులతో విభేదాలు. ఉద్యోగులకు మార్పులు. వ్యాపారాలు అంతగా అనుకూలించవు.

సింహం... పనులు చకచకా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన. విలువైన సమాచారం. ఆప్తులతో ఆనందంగా గడుపుతారు. అరుదైన పురస్కారాలు. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో పురోగతి.

కన్య... నూతన పరిచయాలు. ఆలోచనలు కలసివస్తాయి. కొత్త కాంట్రాక్టులు దక్కతాయి. ప్రముఖుల సలహాలు పాటిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

తుల... ఏ పని చేపట్టినా ఆటంకాలే. ఆస్తుల వివాదాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆరోగ్యభంగం. మిత్రులతో విభేదాలు. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు. మనశ్శాంతి లోపం.

వృశ్చికం... పనుల్లో ప్రతిబంధకాలు. ప్రయాణాలు వాయిదా. విద్యార్థులు, నిరుద్యోగుల శ్రమ ఫలించదు. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు. ఆస్తిలాభం. ఆలయ దర్శనాలు.

ధనుస్సు... శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారం.

మకరం... యత్నకార్యసిద్ధి. వ్యాపారవృద్ధి. కీలక నిర్ణయాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. విందువినోదాలు. ఇంటర్వ్యూలు అందుతాయి.

కుంభం... కుటుంబసభ్యులతో విభేదాలు. పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు డీలాపరుస్తాయి. ఉద్యోగాలలో నిరుత్సాహం.

మీనం... ముఖ్యమైన కార్యక్రమాలలో అవాంతరాలు. రుణయత్నాలు. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement