మేషం...
విఖ్యాంతిగాంచిన వ్యక్తులు పరిచయం కాగలరు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. విద్యార్థులు, నిరుద్యోగులు అనుకున్నది సా«ధిస్తారు. ఇంటిలో శుభకార్యాల సందడి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారదశకు చేరతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో మీ అంచనాలు నిజమవుతాయి. కళారంగం వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో తగాదాలు. నేరేడు, ఆకుపచ్చ రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
వృషభం...
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. చిత్రవిచిత్ర సంఘటనలు ఎదురుకావచ్చు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విద్యార్థులు అనుకున్న విజయాలు సా«ధిస్తారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారదశకు చేరతాయి. శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలలో లాభాలు తథ్యం. ఉద్యోగాలలో చిక్కులు తొలగి ఊరట చెందుతారు. కళాకారులకు పురస్కారాలు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. ఆరోగ్యసమస్యలు. నీలం, ఆకుపచ్చ రంగులు. దేవీస్తోత్రాలు పఠించండి.
మిథునం...
పనులు కొంత మందగిస్తాయి. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆరోగ్యపరంగా చికాకులు. ఆలయాలు సందర్శిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు నెమ్మదిస్తాయి. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. విద్యార్థులకు శ్రమాధిక్యం. వ్యాపారాలలో కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు, పనిభారం. రాజకీయ, కళారంగాల వారికి ఒత్తిడులు పెరుగుతాయి. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. ధనలబ్ధి. ఎరుపు, గులాబీ రంగులు. హనుమాన్ ఛాలీసా పఠించండి.
కర్కాటకం...
చేపట్టిన ముఖ్య పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక ప్రగతి కనిపిస్తుంది. సన్నిహితులతో వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. కాంట్రాక్టులు పొందుతారు. గృహ నిర్మాణ యత్నాలు కార్యరూపం దాలుస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఇంటర్వ్యూలు సైతం అందుకుంటారు. విద్యార్థులకు అనుకూల సమయం. వాహనయోగం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో పైస్థాయి వారి ప్రశంసలు అందుతాయి. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో తగాదాలు. ఎరుపు, నేరేడురంగులు. శివారాధన మంచిది.
సింహం....
ప్రముఖ వ్యక్తులు పరిచయం కాగలరు. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. అనుకున్న పనులు జాప్యం లేకుండా పూర్తి కాగలవు. ఆస్తి వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. విద్యార్థుల యత్నాలు సానుకూలం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వాహన,గృహయోగాలు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు క్రమేపీ లాభసాటిగా మారతాయి. ఉద్యోగాలలో మీ సమర్థతను నిరూపించుకుంటారు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో అనుకోని ధనవ్యయం. ఇంటాబయటా ఒత్తిడులు. ఆరోగ్యభంగం. ఎరుపు, లేత ఆకుపచ్చరంగులు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.
కన్య....
కొత్త పనులు ప్రారంభిస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవం. విలువైన సమాచారం అందుతుంది. మీ ఊహలు నిజం చేసుకుంటారు. విద్యార్థుల ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. కొత్త వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. ఆర్థిక లావాదేవీలలో ఆటుపోట్లు తొలగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఉన్నతహోదాలు. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు సన్మానాలు జరుగుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. తెలుపు, గులాబీ రంగులు. లక్ష్మీగణపతి స్తోత్రాలు పఠించండి.
తుల...
అనుకున్న వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. రుణబాధలు తొలగుతాయి. ఆప్తులతో విభేదాలు తొలగుతాయి. ఇంటి నిర్మాణాలపై దృష్టి సారిస్తారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. విద్యార్థులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లేదా ధనలాభాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి బయటపడతారు. రాజకీయవర్గాల కృషి ఫలిస్తుంది. వారం చివరిలో బంధువిరోధాలు. శ్రమాధిక్యం. గులాబీ, నీలం రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.
వృశ్చికం....
ముఖ్య కార్యక్రమాలు అనుకున్న సమయానికి సాఫీగా సాగుతాయి. సన్నిహితులు, మిత్రులతో వివాదాలు పరిష్కారవుతాయి. విద్యార్థులను ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. పలుకుబడి మరింత పెరుగుతుంది. దూరపు బం«ధువులను కలుసుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి, కొన్ని సమస్యలు తీరతాయి. రాజకీయ, పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో కుటుంబసభ్యులతో తగాదాలు. అనారోగ్యం. గులాబీ, లేత ఎరుపు రంగులు. . శివపంచాక్షరి పఠించండి.
ధనుస్సు...
భవిష్యత్‌పై ఆశలు చిగురిస్తాయి. ప్రముఖులు నుంచి కీలక సమాచారం. ఇంటాబయటా అనుకూలం. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఆస్తుల కొనుగోలు యత్నాలు సానుకూలం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. జీవిత భాగస్వామితో వివాదాలు సర్దుబాటు కాగలవు.
వ్యాపార లావాదేవీలు అనుకూలిస్తాయి, కోరుకున్న లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో బంధువిరోధాలు. అనారోగ్యం. ఎరుపు, పసుపు రంగులు. శివాష్టకం పఠించండి.
మకరం...
పూర్వపు మిత్రుల కలయిక. ఇంటాబయటా ప్రోత్సాహకరంగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. అందర్నీ ఆకట్టుకుని ముందుకు సాగుతారు. ఆస్తి విషయాలలో అగ్రిమెంట్లు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగుల కలలు ఫలించే సమయం. కొన్ని సమస్యలు తేలిగ్గా పరిష్కారమవుతాయి. వ్యాపారాలలో పురోగతి, ఆశించిన లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో పదోన్నతి అవకాశాలు, విధి నిర్వహణలో అవాంతరాలు తొలగుతాయి. రాజకీయ, కళారంగాల వారికి సన్మానాలు. వారం మధ్యలో ధనవ్యయం. మానసిక అశాంతి. కుటుంబంలో చికాకులు. గులాబీ, లేత పసుపు రంగులు. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.
కుంభం...
కొత్త పనులకు శ్రీకారం. బంధువులను కలుసుకుని ముఖ్య విషయాలపై చర్చిస్తారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితుల నుంచి ముఖ్య సమాచారం. కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. విద్యార్థులకు శుభవార్తలు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగాలలో ఊహించని హోదాలు. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు సన్మానాలు. వారం చివరిలో ధనవ్యయం. అనారోగ్య సూచనలు. ఆకుపచ్చ, తెలుపురంగులు. అన్నపూర్ణాష్టకం పఠించండి.
మీనం...
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొన్ని పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. సంఘంలో కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. కొన్ని పరిచయాలు ఎంతో ఉపయోగపడతాయి. కొన్ని పాత సంఘటనలు గుర్తుకువస్తాయి. వస్తు, వస్త్రలాభాలు. ఆస్తి తగాదాలు కొలిక్కి వస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. నూతన విద్యావకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో మంచి గుర్తింపు, ఇంక్రిమెంట్లు. రాజకీయ,కళారంగాల వారికి ఉత్సాహవంతంగా సాగుతుంది. వారం ప్రారంభంలో ఆరోగ్య సమస్యలు. విచిత్ర సంఘటనలు. ఎరుపు, లేత నీలం రంగులు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.


