మధుమతి అనుమానాస్పద మృతి.. వివాహేతర సంబంధమే కారణం | Ntr District Youtuber Madhumathi Incident Details | Sakshi
Sakshi News home page

మధుమతి అనుమానాస్పద మృతి.. వివాహేతర సంబంధమే కారణం

May 2 2025 9:44 AM | Updated on May 3 2025 6:42 PM

Ntr District Youtuber Madhumathi Incident Details

సాక్షి, ఎన్టీఆర్‌: ఏపీకి చెందిన ప్రముఖ తెలుగు యూట్యూబర్ మధుమతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం తీవ్ర కలకలం సృష్టించింది. మధుమతి తన అమ్మమ్మ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే, ఆమె మృతికి వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తోంది.

వివరాల ప్రకారం.. ఎన్టీఆర్ జిల్లాలోని విస్సన్నపేట మండల పరిధిలోని ఏ కొండూరు గ్రామానికి చెందిన మధుమతి(22) సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండేది. ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram)లో రీల్స్ చేస్తూ తనకుంటూ ఓ సపరేట్ ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకుంది. అదేవిధంగా లక్షల్లో సబ్‌స్క్రైబర్లు ఆమె సొంతం. ఈ క్రమంలోనే మధుమతికి అప్పటికే వివాహం అయిన ప్రతాప్‌ (Prathap)తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త కొన్నాళ్లకు వివాహేతర బంధానికి దారి తీసింది.

అయితే, ఉన్నట్టుండి మధుమతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. తాజాగా మధుమతి తన అ‍మ్మమ్మ ఇంటికి వెళ్లగా.. అక్కడే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాగా, తమ కుమార్తె ఆత్మహత్యకు ప్రతాప్‌ కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అతడిని కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని మధుమతి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. 

 


 

Video Credit: Telugu Scribe 

Advertisement
 
Advertisement
Advertisement