
ముంబై: మహారాష్ట్ర మంత్రి, బీజేపీ నాయకురాలు పంకజా ముండే (Pankaja Munde)ను వేధింపులకు గురిచేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని పూణేకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ ఘటనలో కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు వెల్లడించారు.
వివరాల ప్రకారం.. మహారాష్ట్ర మంత్రి పంకజా ముండే (Pankaja Munde)ను కొద్దిరోజులుగా నిందితుడు వేధిస్తున్నాడు. తరచూ ఆమెకు ఫోన్‌లు చేస్తూ అసభ్యంగా మాట్లాడుతున్నాడు. అలాగే, అసభ్యకరమైన మెసేజ్‌లు పెడుతున్నాడు. దీంతో, మహారాష్ట బీజేపీ కార్యాలయానికి చెందిన సోషల్ మీడియా కోఆర్డినేటర్ నిఖిల్ భమ్రే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని ట్రాక్ చేసి పట్టుకున్నారు.
మహారాష్ట్ర (Maharastra) నోడల్ సైబర్ పోలీసులు (Nodal Cyber Police) అతడిని అరెస్ట్ చేశారు. ఇక, సదరు వ్యక్తిని పూణేకు చెందిన అమోల్ కాలే(25) గుర్తించారు. ఈ నేపథ్యంలో నిందితుడు ఎందుకు పంకజా ముండేను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడ్డాడు?. ఇందులో ఇంకా ఎవరి పాత్ర అయినా ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Breaking News 🚨
A man, Amol Kale (25), was arrested for harassing Maharashtra Minister Pankaja Munde with obscene calls and messages. The accused, from Pune, admitted to the acts, and he was sent to police custody for further investigation under the IT Act: Maharashtra Cyber… pic.twitter.com/slTDkbntOc— The Statesman (@TheStatesmanLtd) May 2, 2025