‘మీ నాన్నను చంపినట్లే నిన్నూ..’ | Baba Siddique Son Zeeshan Gets Death Threat, Check Out Full Details Here | Sakshi
Sakshi News home page

‘మీ నాన్నను చంపినట్లే నిన్నూ..’

Apr 22 2025 8:10 AM | Updated on Apr 22 2025 10:42 AM

Baba Siddique Son Gets Death Threat Full Details Here

సిద్ధిఖీ తనయుడికి ‘డి’ కంపెనీ బెదిరింపులు

ముంబై: మహారాష్ట్ర దివంగత నేత బాబా సిద్ధిఖీ తనయుడు, ఎన్సీపీ నేత జీషాన్‌ను గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించారు.  సిద్ధిఖీని చంపినట్లే చంపేస్తామంటూ మెయిల్‌ చేశారు. రూ.10 కోట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ ఘటనపై  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

కిందటి ఏడాది అక్టోబరు 12న బాబా సిద్ధిఖీ ముంబయిలోని తన కుమారుడి కార్యాలయంలో ఉండగా.. కొందరు దుండగులు ఆయనపై కాల్పులకు పాల్పడిన విషయం తెలిసిందే. వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనకు తామే కారణమని లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ ఇప్పటికే ప్రకటించింది. 

అయితే.. బెదిరింపు మెయిల్‌పై తన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారని జీషాన్‌ ఏఎన్‌ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఇదిలా ఉంటే.. బాబా సిద్ధిఖీ హత్య కేసులో ప్రధాన నిందితుడు అక్షదీప్‌ గిల్‌ను పంజాబ్‌లో పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే ఈ వ్యవహారం వెనుక మాస్టర్‌ మైండ్‌ అన్మోల్‌ బిష్ణోయ్‌ అని పోలీసులు తేల్చారు. 

Advertisement
 
Advertisement
Advertisement